మూడు రోజుల్లో ముప్పై కోతులు మృతి.. వింత రోగమా.. కరోనాతోనా?
కర్నూలు జిల్లా గడివేముల ఎస్సీ కాలనీలో కోతుల మరణం భయభ్రాంతులకు గురి చేస్తోంది.
కర్నూలు జిల్లా గడివేముల ఎస్సీ కాలనీలో కోతుల మరణం భయభ్రాంతులకు గురి చేస్తోంది. కరోనా నేపద్యంలో రెడ్ జోన్ గా ప్రకటించిన మండలాలలో గడివేముల మండలం కూడా ఒకటి. కానీ ఇదే సమయంలో మండలంలో వున్న వానరాలు మృత్యువాత పడుతున్నాయి. దీంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. దీనికి సంబంధించి ఫారెస్ట్ అధికారులు చొరవ తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గడివేముల మండలంలో గత మూడు రోజులుగా 30 కోతుల దాకా మృత్యువాత పడ్డాయని గ్రామస్తులు చెప్తున్నారు. గ్రామ రెవెన్యూ అధికారులకు, వీఆర్ఓకు, అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.