విషాదం:పెళ్లికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం... ముగ్గురు దుర్మరణం

విజయవాడ: కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. 

First Published Dec 7, 2020, 12:16 PM IST | Last Updated Dec 7, 2020, 12:16 PM IST

విజయవాడ: కృష్ణా జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. శుభకార్యానికి వెళ్లి తిరిగి వెళుతుండగా ప్రమాదానికి గురయి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యాయి. వీరిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.ఈ ప్రమాదం బాపులపాడు మండలం బొమ్ములూరు వద్ద తెల్లవారుజామున చోటుచేసుకుంది. నూజివీడు నుండి భీమవరంలో ఓ వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న కారు తెల్లవారుజామున రోడ్డుపక్కన ఆగివున్న లారీని ఢీకొట్టింది. దీంతో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యారు. మృతుల్లో ఒకరు విజయవాడకు చెందిన నాగేశ్వరరావు (75)కాగా మరో ఇద్దరు వెస్ట్ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఎర్రగొండపల్లికి చెందిన తాతారావు(65),భార్య లక్ష్మీదుర్గ పార్వతి (60)గా  గుర్తించారు.