Asianet News TeluguAsianet News Telugu

గుట్టలు గుట్టలుగా పోసి...విశాఖలో రూ.9 కోట్ల విలువైన గంజాయి దహనం

విశాఖపట్నం : గంజాయి సాగు, అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు ఏపీ పోలీస్ యంత్రాంగం ''ఆపరేషన్ పరివర్తన్'' చేపడుతోంది.

First Published Dec 26, 2022, 5:06 PM IST | Last Updated Dec 26, 2022, 5:06 PM IST

విశాఖపట్నం : గంజాయి సాగు, అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు ఏపీ పోలీస్ యంత్రాంగం ''ఆపరేషన్ పరివర్తన్'' చేపడుతోంది. ఇందులో భాగంగా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతూ పట్టుబడిన కోట్ల విలువచేసే గంజాయిని కాల్చిబూడిద చేస్తున్నారు. ఇలా తాజాగా విశాఖజిల్లాలో గతకొంత కాలంగా పట్టుబడిన  సుమారు 22,000 కేజీల గంజాయి, 23 కేజీల అషిస్ ఆయిల్ (గంజాయి నుండి తీసిన నూనె), 960 గ్రాములు గంజా చాక్లెట్లను దగ్దం చేసారు. వీటి విలువు సుమారు రూ.9 కోట్లు వుంటుందని తెలిపారు. గుట్టలు గుట్టలుగా గంజాయి పోసి... వాటి చుట్టూ కట్టెలు పేర్చి పోలీసుల పర్యవేక్షణలో ఈ కాల్చివేతలు చేపట్టారు. 

ఈ సందర్భంగా వైజాగ్ సిపి శ్రీకాంత్ మాట్లాడుతూ... కోర్టు ఉత్తర్వుల మేరకు గంజాయిని కాల్చేయడం జరిగిందన్నారు. గంజాయి తీసుకుకోడం వల్ల యువతీయువకుల జీవితాలు నాశనం అవుతున్నాయని... కాబట్టి సమాజంలోకి ఇలాంటి మత్తుపదార్థాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేవలం పోలీసులదే కాదు ప్రతి ఒక్కరిదని అన్నారు. కాబట్టి సమాజంలో ఎక్కడైనా మాదక ద్రవ్యాలు వాడినట్లయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 14500 టోల్ ఫ్రీ నెంబర్ కి సమాచారం ఇవ్వాలని సిపి సూచించారు.