Asianet News TeluguAsianet News Telugu

తిరుపతిలో ఘోర రోడ్డుప్రమాదం... 13మందికి గాయాలు

 తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది.

First Published Nov 4, 2022, 2:55 PM IST | Last Updated Nov 4, 2022, 2:55 PM IST

 తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. పాకాల మండలం నేండ్రగుంట సమీపంలో వేగంగా దూసుకెళుతున్న టెంపో ఆర్టిసి బస్సును వెనకనుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది గాయపడగా కొందరి పరిస్థితి విషమంగా వుంది. టెంపొ ముందుభాగం, బస్సు వెనకభాగం ధ్వంసమయ్యాయి. యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న పాకాల పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కాపాడి చికిత్స నిమిత్తం దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.