బుమ్రా గాయానికి, ఆటకు ఎలాంటి సంబంధం లేదు... నెహ్రా

బుమ్రా గాయానికి, ఆటకు ఎలాంటి సంబంధం లేదు... నెహ్రా

టీం ఇండియా ప్రధాన పేసర్  జస్ ప్రీత్ గాయానికి, అతని ఆటతీరుకి ఎలాంటి సంబంధం లేదని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. గాయం తగిలిందని.. బుమ్రా తన ఆటతీరు మార్చుకోవాల్సిన అవసరం లేదని నెహ్రా అభిప్రాయపడ్డాడు.  బుమ్రా గాయానికి తీరిక లేకుండా క్రికెట్‌ ఆడటం  కారణం కాదని, గాయం (స్ట్రెస్‌ ఫ్రాక్చర్‌)కు, యా క్షన్‌కు సంబంధం లేదని పేర్కొన్నాడు. 

ఓ ఫాస్ట్‌ బౌలర్‌గా సాంకేతిక అంశాలపై పట్టున్న నెహ్రా...  ‘ఈ విషయంలో మన ఆలోచన మారాలి. పునరాగమనం చేశాక బుమ్రా ఇదే శైలితో ఇంతే తీవ్రతతో బంతులేయగలడు. బంతిని విసిరే సందర్భంలో తన శరీరం కచ్చితమైన దిశలో ఉంటుంది. ఎడమచేయి మరీ పైకి లేవదు. ఎడమ కాలును వంచుతూ జావెలిన్‌ త్రో తరహాలో బౌలింగ్‌ చేసే మలింగ కంటే బుమ్రా యాక్షన్‌ పది రెట్లు మెరుగైనది’ అని నెహ్రా వివరించాడు.

గాయంతో ఉన్న ఆటగాడికి కోలుకునే వ్యవధి నిర్దేశించడం వివేకం కాదని, మైదానంలో దిగేందుకు తన శరీరం వంద శాతం సంసిద్ధంగా ఉందా లేదా అనేది వారికే తెలుస్తుందని అన్నాడు. బుమ్రా గాయానికి శస్త్రచికిత్సలు అవసరం లేదని, కేవలం విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పాడు. 

READ SOURCE