ప్రో కబడ్డి 2019: హోంగ్రౌండ్ లో జైపూర్‌ హవా... పూణే చిత్తు

ప్రో కబడ్డి 2019: హోంగ్రౌండ్ లో జైపూర్‌ హవా... పూణే చిత్తు

ప్రో కబడ్డి లీగ్ 2019 లో జైపూర్ పింక్ పాంథర్స్ మరో అద్భుత విజయాన్ని అందుకుంది. హోం గ్రౌండ్ లో...సొంత ప్రేక్షకుల మధ్య ఈ మ్యాచ్ ఆడిన పింక్ పాంథర్స్ సత్తా చాటింది. సవాయ్ మాన్ సింగ్ స్టేడియం వేదికన ప్రత్యర్థి పుణేరీ పల్టాన్స్ ను 9 పాయింట్ల తేడాతో చిత్తుచేసి విజయాన్ని అందుకుంది. పల్టాన్స్ స్టార్ రైడర్ పంకజ్ 14 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచినా జట్టును గెలిపించుకోలేకపోయాడు. 

స్థానిక జట్టు జైపూర్ ఆరంభంనుండే పూణేపై ఎదురుదాడికి దిగింది. అదే ఊపును మ్యాచ్ చివరి వరకు కొనసాగించి ఎక్కడకూడా పూణేను కోలుకునే అవకాశమివ్వలేదు. ఇలా పింక్ పాంథర్స్ రైడింగ్ లో 29, ట్యాకిల్స్ లో 10, ఆలౌట్ల ద్వారా 4  మొత్తం 43 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. ఆటగాళ్లలో దీపక్ నివాస్ 12, దీపక్ నర్వాల్ 11, నీలేశ్ 7, అమిత్ 4, సందీప్ 4 పాయింట్లతో ఆకట్టుకున్నారు. 

ఇక పుణేరీ పల్టాన్స్ విషయానికి వస్తే పంకజ్ 14, మంజిత్ 8 పాయింట్లతో అదరగొట్టారు. కానీ మిగతావారిలో దర్శన్ 3, జాదవ్ 2, గిరిశ్ 2 పాయింట్లు మాత్రమే సాధించారు. ఇలా కేవలం రైడింగ్ లో 23, ట్యాకిల్స్ లో 8, ఆలౌట్ల ద్వారా 2, ఎక్స్ ట్రాల రూపంలో 1 మొత్తం 33 పాయింట్ల వద్దే  ఆ జట్టు ఆట ముగింసింది. దీంతో విజయానికి 9 పాయింట్ల దూరంలో నిలిచి పూణే ఓటమిని చవిచూసింది. 

READ SOURCE