ప్రమాదకరంగా బుమ్రా గాయం... చికిత్స కోసం లండన్ కు

ప్రమాదకరంగా బుమ్రా గాయం... చికిత్స కోసం లండన్ కు

టీమిండియా యువ సంచలనం, యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా గాయం మరింత ప్రమాదకరంగా తయారవుతోందట. వెన్నెముఖ గాయంతో బాధపడుతున్న బుమ్రా ఇప్పటికే జట్టుకు దూరమయ్యాడు. కనీసం ప్రాక్టీస్ లో కూడా పాల్గొనకుండా మైదానానికి పూర్తి దూరంగా వుంటున్నాడు. ఈ గాయం తీవ్రత రోజురోజుకు మరింత ఎక్కువవుతుండటంతో ఆందోళనను కలిగిస్తోందట. దీంతో ప్రస్తుతం అందిస్తున్న వైద్యం కంటే మరింత మరింత మెరుగైన వైద్యం అందించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తోంది. 

ఇంగ్లాండ్ రాజధాని లండన్ లోని నిపుణుల పర్యవేక్షణలో బుమ్రాకు వైద్యం అందించాలని బిసిసిఐ నిర్ణయించిందట. ఈ మేరకు అతన్ని లండన్ కు పంపించడానికి చర్యలు కూడా ప్రారంభించినట్లు ఓ బిసిసిఐ అధికారి తెలిపారు. 

'' తీవ్ర వెన్నునొప్పితో బాధపడుతున్న బుమ్రాను వైద్య పరీక్షల నిమిత్తం లండన్ కు పంపాలని నిర్ణయించాం. మరో రెండు లేదా మూడు రోజుల్లో బుమ్రా, ఎన్సీఏ చీఫ్ ఫిజియో ఆశిస్ కౌశిక్ లు అక్కడికి వెళ్లనున్నారు. నిపుణుల సమక్షంలో వైద్య పరీక్షలు జరిపించి గాయం తగ్గుముఖం పట్టేవరకు వీరిద్దరు అక్కడే వుండనున్నారు. 
 
ప్రస్తుతాకయితే బుమ్రాను ఏన్సీఏలోని ముగ్గురు నిపుణుల బృందం వేర్వేర్వుగా పర్యవేక్షిస్తోంది. అయినప్పటికి గాయంపై ఎలాంటి స్పష్టత రావడం లేదు. లండన్ లో చికిత్స అనంతరమే ఈ గాయంపై ఓ క్లారిటీరానుంది.'' అని సదరు అధికారి తెలిపారు.  

విశాఖపట్నంలో అక్టోబర్ 2నుండి ప్రారంభంకానున్న టెస్ట్ సీరిస్ కు బుమ్రా గాయం కారణంగానే దూరమయ్యాడు. ప్రస్తుతం అతడి గాయం తీవ్రత తగ్గట్లేదు కాబట్టి నవంబర్ లో బంగ్లాదేశ్ తో జరగనున్న సీరిస్ కు కూడా దూరమయ్యే అవకాశాలున్నాయి. ఇలా స్వదేశంలో జరుగుతున్న ఈ సీరిస్ లకు బుమ్రా దూరమవడంతో టీమిండియాపై ప్రభావం పడనుంది. 

 

READ SOURCE