రాంచి టెస్ట్: రోహిత్ శర్మ అవుట్!

రాంచి టెస్ట్: రోహిత్ శర్మ అవుట్!

రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు. 212 వ్యక్తిగత స్కోర్ వద్ద రబాడా బౌలింగ్ లో ఎంగిడి కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రోహిత్ శర్మ అవుట్ అయినప్పుడు భారత స్కోర్ 370 పరుగులు. రోహిత్ వెనుదిరిగిన తరువాత సహా బాటింగ్ కు వచ్చాడు. రోహిత్ క్రీజులో ఉన్నంత సేపు స్కోర్ బోర్డును ఉరకలెత్తించాడు.ప్రస్తుత భారత స్కోర్ 379/5.  

ఇందాకే రోహిత్ శర్మ  డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 199 పరుగుల వద్ద సిక్స్ కొట్టి డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రాంచి టెస్టులో ఆకాశమే హద్దుగా రెచ్చిపోయాడు. పట్టపగలే సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. పరిస్థితులకు అనుగుణంగా గేయార్లు మారుస్తూ, చెలరేగిపోయాడు. టెస్టు మ్యాచులో 80 సగటు మైంటైన్ చేస్తూ, టెస్టు ను కాస్తా వన్డే మాదిరిగా మార్చి బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. టెస్టుల్లో రోహిత్ కు ఇదే తొలి డబల్ సెంచరీ. 

దీపావళి పండుగకు ఇంకో వారం రోజుల సమయమున్న రాంచీలో స్టేడియం లో ఉన్న వారికి మాత్రం వారం ముందుగానే వచ్చింది. హిట్ మ్యాన్ హిట్టింగ్ తో అక్కడ సిక్సర్ల మోత మోగింది.  199 పరుగుల వద్ద సిక్స్ కొట్టడంతో అభిమానులు ఒక్కసారిగా అరుపులు కేకలతో స్టేడియం హోరెత్తించారు. కానీ వారి ఆనందం వెంటనే ఆవిరయిపోవడంతో అభిమానులు నిరాశ చెందారు. 

నిన్నటి నుంచి జోరు మీదున్న హిట్ మ్యాన్ ఈ రోజు ఆ జోరును మరింత పెంచాడు. టాప్ గేర్లో దూసుకుపోతున్నాడు. ఇందాకే రహానే ఔటయ్యాడు.   అజింక్య రహానే 115 పరుగుల వద్ద జార్జ్ లిండే బౌలింగ్ లో క్లాస్సేన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రవీంద్రజడేజా(17),సహా (6) క్రీజులో ఉన్నారు. 

ఓవర్ నైట్ స్కోర్ 224/3 వద్ద భారత్ తన ఆటను ఆరంభించింది. నిన్న వెలుతురు సరిగా లేని కారణంగా తొలుత బ్రేక్ ఇచ్చినప్పటికీ, తరువాత వర్షం కారణంగా మ్యాచును ఆపేసారు. ఇప్పటికే రోహిత్ శర్మ డబల్ సెంచరీ చేసాడు. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడు. టెస్టు మ్యాచులో పరుగుల వరద పారించాడు.  సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. ఇది మూడో సెంచరీ.

READ SOURCE