రాంచి టెస్ట్: హిట్ మ్యాన్ సెంచరీ, రహానే హాఫ్ సెంచరీ

రాంచి టెస్ట్: హిట్ మ్యాన్ సెంచరీ, రహానే హాఫ్ సెంచరీ

రాంచి: రాంచి టెస్ట్ లో రోహిత్ శర్మ సెంచరీ చేసాడు. రహానే కూడా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని వీరిరువురు క్రీజులో బలంగా పాతుకుపోయారు. 130 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసాడు. టెస్టు మ్యాచులో పరుగుల వరదపారిస్తున్నాడు. 4 సిక్సర్లు,13 ఫోరులు బాదాడు. తన టెస్టు కెరీర్లో ఆరో సెంచరీని నమోదు చేసాడు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు సెంచరీలు బాదాడు. ఇది మూడో సెంచరీ. 

హిట్ మాన్ షో కంటిన్యూ అవుతుంది. ఇటుపక్క నుంచి రోహిత్ అటుపక్క నుంచి రహానే ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. ప్రస్తుతానికి భారత్ మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. 

భారత్‌ జట్టు 39 పరుగులకె మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కోహ్లీ 12 పరుగులవద్ద లెగ్ బిఫోర్ గా వెనుదిరిగాడు. అంతకుముందు మయాంక్‌ అగర్వాల్‌(10), చతేశ్వర్‌ పుజరా(0)లు నిరాశపరిచారు. వీరిద్దరూ రబడా బౌలింగ్‌లో ఔటయ్యారు.  ప్రతిసారి క్రీజులో పాతుకుపోయి పుజారా ఇలా డక్ అవుట్ అవడంతో అభిమానులు ఉసూరుమన్నారు. 

READ SOURCE