వైజాగ్ టెస్ట్‌: ఓపెనర్ల వీరవిహారం...రోహిత్ అజేయ శతకం

వైజాగ్ టెస్ట్‌: ఓపెనర్ల వీరవిహారం...రోహిత్ అజేయ శతకం

మహాత్మా గాంధీ-నెల్సన్‌ మండేలా ఫ్రీడమ్‌ ట్రోఫీలో భాగంగా విశాఖపట్నంలో ప్రారంభమైన మొదటి టెస్ట్ కోహ్లీసేన అదరగొడుతోంది. మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా మొదటిసారి టెస్టుల్లో ఓపెనింగ్ చేస్తున్న రోహిత్ శర్మ సెంచరీతో అజేయంగా నిలిచాడు. అతడు ప్రస్తుతం 174  బంతుల్లో  115 పరుగులు బాది అజేయంగా నిలిచాడు. 

మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా సెంచరీకి చేరువలో నిలిచాడు. కేవలం 183 బంతుల్లో 84 పరుగులతో సెంచరీకి చేరువలో నిలిచాడు. ఓపెనర్లిద్దరు సఫారి బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ భారత్ ను భారీ స్కోరు దిశగా నడిపిస్తున్నారు. టీ సమయానికి కోహ్లీసేన 59.1 ఓవర్లలో వికెట్లేవీ  నష్టపోకుండానే డబుల్ సెంచరీ(202 పరుగులు) చేసింది. 

అయితే భారత ఓపెనర్లు మంచి ఊపుమీదున్న సమయంలో వరుణుడు మ్యాచ్ కి అడ్డంకి సృష్టించాడు. టీవిరామం తర్వాత ఒక్కసారిగా భారీ వర్షం మొదలయ్యింది. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. 

పరిమిత ఓవర్ల క్రికెట్లో ఓపెనర్ గా ఇప్పటికే తానేంటో నిరూపించుకున్న రోహిత్ కు మొదటిసారి టెస్టుల్లో ఓపెనింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అతడు సెంచరీతో కదంతొక్కాడు. సెంచరీ తర్వాత మరింత రెచ్చిపోయే అతడి నుండి మరో భారీ ఇన్నింగ్స్ ఆశించవచ్చు. 

సంబంధిత వాార్తలు

తొలి టెస్ట్ మ్యాచ్... రెచ్చిపోయిన రోహిత్, మయాంక్ జోడి ...

 దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్ మ్యాచ్...బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ...

   

READ SOURCE