మరో మారు బజ్జి పై ట్రోలింగ్: ఈ సారి కోహ్లీ,యువీల వంతు!

మరో మారు బజ్జి పై ట్రోలింగ్: ఈ సారి కోహ్లీ,యువీల వంతు!

టీం ఇండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడ్డారు. ఈ సారి ట్రోల్ చేసింది స్వయానా టీం ఇండియా కెప్టెన్ కోహ్లీ, మాజీ టీం ఇండియా అల్ రౌండర్ యువరాజ్ సింగ్. 

వివరాల్లోకెళితే, కపిల్ దేవ్ తో గోల్ఫ్ స్టిక్ తో పోజ్ ఇచ్చాడు భజ్జి. ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫోటోను పెట్టి థాంక్స్ కపిల్ పాజి అని రాసాడు. మీతో కలిసి క్రికెట్ ఆడలేకపోయినా గోల్ఫ్ ఆడాను, స్వతహాగా చాల ఎంజాయ్ చేశాను అని పేర్కొన్నాడు. 

దీన్ని గమనించిన కోహ్లీ వెంటనే సరదాగే ఒక పోస్టును పెట్టాడు. పంజాబీ భాషలో నువ్వేదో గుడ్డిగా గోల్ఫ్ స్టిక్ ను ఆడించి ఉంటావు అంటూ పేర్కొంటూ ఒక నవ్వుతున్న ఎమోజిని జత చేసాడు. వెంటనే యువరాజ్ సింగ్ కూడా దీనిపైన మరో పంచ్ వేసాడు. యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ ల మధ్య మంచి స్నేహ సంబంధాలున్న విషయం మనకు తెలిసిందే. 

కొన్ని రోజుల కింద యువరాజ్ సింగ్,హర్భజన్ సింగ్ లిద్దరు బీసీసీఐ పై తీవ్ర అసహనాన్ని,ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. విజయ్ హజారే ట్రోఫీలో రిజర్వు డే లేకుండా నెట్ రన్ రేట్ ఆధారంగా టీమ్స్ ని నెక్స్ట్ స్టేజి కి పంపడంపై వీరిరువురు ఆగ్రహం వ్యక్తం చేసారు. 

బెంగళూరు వేదికగా పంజాబ్,తమిళనాడు మధ్య విజయ్ హజారే ట్రోఫీలో జరగాల్సిన నాకౌట్ మ్యాచ్ వాతావరణ పరిస్థితుల కారణంగా రద్దయింది. మ్యాచ్ రద్దవడంతో పాయింట్ల పట్టికలో ముందున్న తమిళనాడు జట్టు ముందుకెళ్లింది. పంజాబ్ తన ప్రయాణాన్ని అక్కడితో ఆపేయాల్సి వచ్చింది. 

నాకౌట్ మ్యాచులకు రిజర్వు డేలను కొనసాగించాలని యువి,బజ్జి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ విషయంపై బీసీసీఐ ఇప్పటికైనా దృష్టి పెట్టాలని వారు కోరారు. 

READ SOURCE