Search results - 897 Results
 • వారికి ఉన్న పరిచయాలతో కేసీఆర్ వారిని వైసీపీలోకి వెళ్లాలని అక్కడ ప్రత్యేక గుర్తింపు వచ్చేలా చూస్తానని హామీ ఇస్తున్నారని తెలుస్తోంది. ఇకపోతే ఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రభావితం చేసే రంగం సినీ ఇండస్ట్రీ. సినీ ఇండస్ట్రీ దాదాపుగా తెలుగుదేశం పార్టీవైపే మెుగ్గు చూపుతూ వస్తోంది.

  Andhra Pradesh19, Feb 2019, 9:19 PM IST

  వైసీపీవి దొంగ సర్వేలు, మనమే క్లీన్ స్వీప్ చేస్తాం : కృష్ణా జిల్లా నేతలతో చంద్రబాబు

  ఈసారి రాబోయే ఎన్నికల్లో 16 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లు గెలిచి క్లీన్ స్వీప్ చెయ్యాలని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఐదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఎంతో అభివృద్ధి చేశామని గుర్తు చేశారు. దశాబ్ధాల కాలంగా పెండింగ్ లో ఉన్న మచిలీపట్నం పోర్టును ప్రారంభించామని, అలాగే పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జిల్లాకు సాగునీటిని అందించి వారి కల నెరవేర్చామన్నారు. 
   

 • tdp mp rammohan naidu

  Andhra Pradesh19, Feb 2019, 8:40 PM IST

  వైఎస్ జగన్ కోర్టుల చుట్టూ తిరగాల్సిందే..: టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు

  తిత్లీ తుఫాన్ సమయంలో కనీసం పరామర్శించడానికి కూడా రాని నాయకులు రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు. వైసీపీ నేతలు ఏ ముఖం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాలు చాలా మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

 • వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొత్తులు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. దీంతో తెలుగుదేశం పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోబోతుందనే చర్చ ప్రారంభమైంది

  Andhra Pradesh19, Feb 2019, 8:11 PM IST

  చావు దెబ్బతిన్నా బుద్దిరాలేదు: వైఎస్ జగన్ పై లోకేష్ ఫైర్

  ఒకప్పుడు తండ్రి శవాన్ని అడ్డంపెట్టుకొని సీఎం పీఠం ఎక్కాలి అనుకుని చావు దెబ్బతిన్నాడని అయినా జగన్‌కి బుద్ధి రాలేదని విమర్శించారు. కొండవీడులో రైతు కోటయ్య మృతికి సానుభూతి ప్రకటించకుండా వైసీపీ నీచ రాజకీయాలకు వాడుకుంటోందని ఎద్దేవా చేశారు. 

 • రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చెయ్యాలని నాగార్జున భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే గతంలోనే అక్కినేని నాగార్జున వైఎస్ జగన్ తో భేటీ అయ్యారంటూ ప్రచారం జరుగుతుంది.

  Andhra Pradesh19, Feb 2019, 6:39 PM IST

  జగన్ తో భేటీపై అక్కినేని నాగార్జున వివరణ ఇదే...


  వైఎస్ జగన్ తనకు మంచి ఫ్రెండ్ అన్నారు. వైఎస్ కుటుంబంతో తమ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. జగన్ ను సాధారణంగానే కలిశానని అందులో ఎలాంటి ప్రాధాన్యత లేదని చెప్పుకొచ్చారు. తాను ఇతరుల టికెట్ కోసం జగన్ తో చర్చించేందుకు వచ్చానన్న వార్తలు కూడా వాస్తవం కాదన్నారు. 
   

 • Galla jayadev

  Andhra Pradesh19, Feb 2019, 6:24 PM IST

  అంతమాత్రాన పార్టీలో చేరిపోతారా..?: జగన్ తో నాగార్జున భేటీపై గల్లా జయదేవ్

  గుంటూరు నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో నాగార్జున వస్తే తనకు ఇబ్బంది కలుగుతుందనుకున్నారో ఏమో ఏకంగా ఆయన రాజకీయాల్లోకి రారు అంటూ స్టేట్మెంట్ ఇచ్చేశారు. వైఎస్ జగన్ ను నాగార్జున కలిసినంత మాత్రాన వైసీపీలో చేరినట్లేనా అంటూ ప్రశ్నించారు. 
   

 • stars

  Andhra Pradesh19, Feb 2019, 4:54 PM IST

  జగన్ వెంటే మేమంటున్న టాలీవుడ్ స్టార్స్!

  ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ కి సినీ మద్దతు రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇటీవల ప్రజా సంకల్ప యాత్ర పేరిట జగన్ పాదయాత్ర చేపట్టగా.. ఆ యాత్రలో కొందరు సినీతారలు.. ఆయన వెంట అడుగులు వేశారు. 

 • Andhra Pradesh19, Feb 2019, 4:15 PM IST

  దమ్ముంటే జగన్ తో కలిసి పోటీ చెయ్యాలి: కేటీఆర్, కేసీఆర్ లకు నక్కా ఆనందబాబు సవాల్

  కేసీఆర్, జగన్ హైద‌రాబాద్‌లో కూర్చొని కుట్రలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్‌, కేటీఆర్ తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలతో మాట్లాడి వైసీపీలోకి వెళ్లేలా ప్లాన్ లు వేస్తున్నారంటూ ఆరోపించారు. దమ్ముంటే కేసీఆర్, కేటీఆర్ ఆంధ్రకి వ‌చ్చి వైఎస్ జ‌గ‌న్‌తో క‌లిసి పోటీ చేయాలని సవాల్ విసిరారు.
   

 • nagarjuna ys jagan

  Andhra Pradesh19, Feb 2019, 4:12 PM IST

  వైసీపీలోకి అక్కినేని నాగార్జున: వైఎస్ జగన్ తో భేటీ

  నాగార్జునకు వైఎస్ జగన్ సాదర స్వాగతం పలికారు. అక్కినేని నాగార్జున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారంటూ గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతుంది. వైఎస్ జగన్ చేపట్టబోయే బస్సు యాత్రలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. 
   

 • killi

  Andhra Pradesh19, Feb 2019, 12:25 PM IST

  ముహుర్తం ఫిక్స్: 28న వైసీపీలోకి కిల్లి కృపారాణి

  ఏపీ ప్రజలు చంద్రబాబును విశ్వసించరన్నారు మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో జగన్‌తో సమావేశమైన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తును తాను వ్యతిరేకించానని, ఇదే విషయంపై పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశానని ఆమె స్పష్టం చేశారు. ఈ నెల 28న అమరావతిలో వైసీపీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు. 

 • kcr

  Andhra Pradesh19, Feb 2019, 9:02 AM IST

  వైసీపీలోకి టీడీపీ నేతలు.. తెర వెనుక కేసీఆర్: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

  వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి టీడీపీ నేతలు వలస వెళ్లడం వెనుక టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తం ఉందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎలక్షన్ మిషన్-2019లో భాగంగా ఆయన పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 • yadam balaji

  Andhra Pradesh18, Feb 2019, 9:23 PM IST

  వైసీపీలో ఆమంచి ఎఫెక్ట్: చంద్రబాబును కలిసిన వైసీపీ ఇంచార్జ్ బాలాజీ

  ఆమంచి రాకను తాను స్వాగతించలేనని జగన్ కు స్పష్టం చేశారు. అయితే వైఎస్ జగన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో బాలాజీ టీడీపీ నాయకులకు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఆయన మంగళవారం సాయంత్రం అమరావతిలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. పార్టీలో చేరే అంశంపై చర్చించారు. 

 • killi kruparani

  Andhra Pradesh18, Feb 2019, 8:14 PM IST

  వైసీపీలోకి కేంద్రమాజీమంత్రి కిల్లి కృపారాణి : రేపు జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం

  ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇక పార్టీ మారకపోతే తమ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడే అవకాశం ఉందని కిల్లి కృపారాణి ఆలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో తన అనుచరులతో కలిసి మంగళవారం హైదరాబాద్ లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. 

 • anil kumar yadav

  Andhra Pradesh18, Feb 2019, 6:48 PM IST

  జడ్జిలుగా బీసీలు పనికి రారని చంద్రబాబు లేఖ రాయలేదా..?: వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కౌంటర్

  గత 40 ఏళ్లుగా టీడీపీ బీసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే వాడుకుందని, వారికి చేసిందేం లేదని విమర్శించారు. బీసీల జీవన స్థితిగతులను పట్టించుకోకుండా మోసం చేసిన చరిత్ర టీడీపీదేనని ఆరోపించారు. ఐదేళ్లలో కేవలం రూ. 18వేల కోట్లు ఖర్చుపెట్టి చంద్రబాబు బీసీలను మోసం చేస్తున్నారని తెలిపారు. 

 • thota trimurthulu

  Andhra Pradesh18, Feb 2019, 5:29 PM IST

  వైసిపిలోకి టీడీపి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు: వైవీ సుబ్బారెడ్డితో భేటీ

  ఈ ప్రచారం నేపథ్యంలో విజయవాడలో వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారెడ్డితో తోట త్రిమూర్తులు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీలోకి ఇతర పార్టీ నేతలను ఆహ్వానించే వారిలో వైవీ సుబ్బారెడ్డి ఒకరు. అయితే దాదాపు అరగంట నుంచి వీరి భేటీ కొనసాగుతుందని తెలుస్తోంది.