cars19, Feb 2019, 10:21 AM IST
ఎలక్ట్రిక్ వాహనం కొన్నవారికి రూ.50 వేల డిస్కౌంట్
విద్యుత్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు కేంద్రం పలు రాయితీలు ప్రకటిస్తోంది. పన్ను రాయితీలతోపాటు రూ.50 వేల వరకు రిబేల్ అందిస్తోంది.
business19, Feb 2019, 10:17 AM IST
పంతం చెల్లించుకున్న కేంద్రం.. ఆర్బీఐ నుంచి రూ.28 వేల కోట్ల డివిడెండ్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు తీర్చుకునేందుకు కేంద్రం అనుసరించిన వ్యూహం ఫలించినట్లే కనిపిస్తున్నది. ఇందుకు కేంద్రానికి రూ.28 వేల కోట్ల మధ్యంతర డివిడెండ్ అందజేయనున్నట్లు ప్రకటించడమే కారణం. ఆర్బీఐలో మిగులు నిధుల అంశంపైనే గతేడాది డిసెంబర్ నెలలో అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామాచేశారు.
business11, Feb 2019, 10:36 AM IST
రోడ్లమీద అమ్ముకుంటున్నారా.. మీకు గుడ్‌న్యూస్, త్వరలో షాపింగ్ లైసెన్స్..?
దేశ రాజధాని న్యూఢిల్లీతోపాటు దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో వీధుల్లో బండ్లపై వ్యాపారాలు నడిపే వారికి మంచి రోజులు రానున్నాయి. వీధి వ్యాపారులుగా వారికి లైసెన్సులు మంజూరు చేయడంతోపాటు ఇతర వసతులను కల్పించడానికి కేంద్ర గ్రుహ నిర్మాణ పట్టణాభివ్రుద్ధి శాఖ రంగం సిద్ధం చేస్తోంది.
Andhra Pradesh10, Feb 2019, 5:34 PM IST
ఏపీకి ప్రత్యేక హోదా: 11న ఢిల్లీలో బాబు ధర్నా
ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద 12 గంటల పాటు ధర్నా నిర్వహించనున్నారు.
NATIONAL7, Feb 2019, 10:22 AM IST
లోక్‌పాల్ ప్రక్రియను ప్రారంభించిన కేంద్రం, లోక్‌పాల్ అర్హతలివే..!!
ప్రముఖ సామాజికవేత్త, గాంధేయవాది అన్నాహజారే ఎట్టకేలకు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. కేంద్రంలో లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని తన చిరకాల స్వప్పాన్ని నెరవేర్చుకున్నారు. లోక్‌పాల్‌ను నియమిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించారు. లోక్‌పాల్ నియామక ప్రక్రియకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.
business4, Feb 2019, 4:36 PM IST
స్టార్టప్‌లపై కేంద్రం చిన్నచూపు... గతం కంటే తగ్గింపు నిధులు
కేంద్రం యావత్ దేశాన్ని డిజిటలీకరిస్తామని పదేపదే చెబుతోంది. కానీ ఆచరణలో పరిస్థితి భిన్నంగా ఉంది. బడ్జెట్ లో స్టార్టప్ ల అభివృద్ధి కోసం కేవలం రూ.25 కోట్లు కేటాయించింది. ఇది 2018-19 సంవత్సరంలో కంటే మూడు కోట్లు తక్కువ. అంటే ప్రభుత్వ లక్ష్యాలు ఆచరణ యోగ్యమా? అంటే అనుమానమే మరి.
business2, Feb 2019, 11:37 AM IST
ఇది ఇండస్ట్రియల్, బ్యాంకింగ్ బడ్జెట్: బడా వ్యాపారవేత్తల స్పందనిదే
బడ్జెట్ ప్రతిపాదనల పట్ల బ్యాంకర్లు, పారిశ్రామిక వర్గాలు ఖుషీఖుషీగా ఉన్నారు. అయితే రైతులు, వేతన జీవులను సంత్రుప్తి పరిచేలా ఉన్నా.. చిన్న పరిశ్రమలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తమైంది.
NATIONAL1, Feb 2019, 12:30 PM IST
కేంద్ర బడ్జెట్ 2019:సినిమా థియేటర్లపై జీఎస్టీ 12 శాతానికి తగ్గింపు
సినిమా థియేటర్లపై జీఎస్టీ ట్యాక్స్‌ను 12 శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు.NATIONAL1, Feb 2019, 12:13 PM IST
ఆదాయపన్ను పన్ను పరిమితి పెంపు: ఉద్యోగులకు భారీ ఊరట
ఆదాయ పన్ను పరిమితిని రూ. 3 లక్షలకు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.ప్రస్తుతం ఆదాయపు పన్ను పరిమితి రెండున్నర లక్షలుగా ఉంది.
NATIONAL1, Feb 2019, 11:38 AM IST
కేంద్ర బడ్జెట్ 2019 : కేసీఆర్ తరహా రైతు బంధు పథకం
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన రైతుబంధు పథకం తరహాలో కేంద్ర ప్రభుత్వం కూడ రైతులకు వ్యవసాయం చేసేందుకు అవసరమైన పెట్టుబడిని అందించనున్నట్టు ప్రకటించింది.
Andhra Pradesh30, Jan 2019, 4:35 PM IST
ఢీల్లీలో దీక్ష చేస్తా: అఖిలపక్ష సమావేశంలో బాబు
కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీల విషయమై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో ఒక్క రోజు దీక్ష చేయాలని భావిస్తున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.Andhra Pradesh29, Jan 2019, 4:56 PM IST
పోలవరానికి కేంద్రం మొండిచేయి: చంద్రబాబు ఫైర్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఇంకా రూ.4 వేల కోట్లు ఇవ్వాల్సిందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు.. ఈ నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు.
News21, Jan 2019, 2:08 PM IST
వొడాఫొన్, ఐడియా విలీనం ఎఫెక్ట్: రూ.10 వేల కోట్ల చెల్లింపు కష్టాలు
టెలికం రంగంలో అతిపెద్ద సంస్థ వొడాఫోన్ ఐడియా రుణభారంతో కొట్టుమిట్టాడుతున్నది. ఇటీవలే విలీనమైన ఈ సంస్థ ఈ ఏడాది స్పెక్ట్రం చెల్లింపును రెండేళ్ల పాటు వాయిదా వేయాలని కేంద్రాన్ని అభ్యర్థించినట్లు సమాచారం. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్ టెల్ సంస్థల నుంచి వచ్చే పోటీని ఎదుర్కొనేందుకు, నిధుల సమీకరణకు వొడాఫోన్ ఐడియా డైరెక్టర్ల బోర్డు బుధవారం భేటీ కానున్నది.
News13, Jan 2019, 11:12 AM IST
సై: సర్కార్ ఆంక్షలపై సమరానికి సోషల్ మీడియా
సోషల్ మీడియా వేదికగా ప్రచారం అయ్యే దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికీ నష్టం పేరిట దానిలో ప్రచార నిరోధానికి కేంద్రం విధిస్తున్న ఆంక్షలను ఎదుర్కొనేందుకు అంతర్జాతీయ సోషల్ మీడియా దిగ్గజాలు సిద్ధమౌతున్నాయి
NATIONAL7, Jan 2019, 3:18 PM IST
ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు: కేంద్రం
ఆర్థికంగా వెనుకబడిన అగ్రకులాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 10 ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ చేయనుంది.రిజర్వేషన్లను 50 నుండి 60 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. రిజర్వేషన్ల పెంపుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.