Ts Politics  

(Search results - 63)
 • Bandaru Dattatreya

  Telangana13, Jul 2019, 1:21 PM IST

  డీఎస్ మాత్రమే కాదు...బిజెపిలోకి మరికొందరు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఎంపీలు : దత్తాత్రేయ

  తెలంగాణలో టీఆర్ఎస్ ను ఎదిరించగలిగే దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని మాజీ  కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. తప్పకుండా భవిష్యత్ లో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే కాబోతున్నామని ఆయన తెలిపారు. అందుకోసం పక్క వ్యూహాలతో ముందుకెళుతున్నట్లు మాజీ కేంద్ర మంత్రి వెల్లడించారు.

 • తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మద్దతుతో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయినా కూడా తమకు అభ్యంతరం లేదని తెలంగాణ శాసనసభ్యుడు జగ్గారెడ్డి అన్నారు. తమకు రాష్ట్రంలో అధికారం ముఖ్యం కాదని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం తమకు ముఖ్యమని ఆయన గురువారం మీడియాతో అన్నారు

  Telangana13, Jul 2019, 7:43 AM IST

  నా వ్యక్తిగత విషయాలపై టీఆర్ఎస్ ఆరా...ఎందుకోసమంటే: జగ్గారెడ్డి

  తన నియోజకవర్గం సంగారెడ్డిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తాను ఉద్యమిస్తుంటే ప్రభుత్వం మాత్రం తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. అందువల్లే తనను అక్రమంగా అరెస్టులు చేయించడం జరుగోతోందని ఆరోపించారు. తనను వ్యక్తిగతంగా విమర్శించడం తర్వాత చేద్దురుగానీ ముందు ప్రజల సమస్యలపై దృష్టిసారించాలంటూ ఆయన తెలంగాణ ప్రభుత్వానికి చురకలు అంటించారు. 
   

 • Telangana13, Apr 2019, 3:17 PM IST

  ఆ ఏడు సీట్లు కాంగ్రెస్‌వే: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  తెలంగాణలో ఇటీవల ముగిసిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని భువనగిరి కాంగ్రెస్ అభ్యర్ధి  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవని...ఈ నాలుగు నెలల్లోనే ఓటర్లలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. రాష్ట్రంలోని సగం లోక్ సభ స్ధానాలను కాంగ్రెస్ గెలుచుకోనుందని... అందులో భువనగిరి ఖచ్చితంగా వుంటుందని పేర్కొన్నారు.

 • Telangana13, Apr 2019, 1:00 PM IST

  చంద్రబాబు హైదరాబాద్ ఆస్తులపై తలసాని సంచలన వ్యాఖ్యలు

  ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి కోసమే చంద్రబాబు తమపై బురదజల్లే ప్రయత్నం చేశాడని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేవలం తనకు మాత్రమే ఏపి  ప్రజలపై ప్రేమున్నట్లు మాట్లాడాడని...ఇక్కడ తెలంగాణ లో ఏపి ప్రజలు, నాయకులపై టీఆర్ఎస్ ప్రభుత్వం దాడులు చేస్తోందంటూ తప్పుడు ప్రచారం చేశారన్నారు. ముఖ్యంగా హైదారాబాద్ లో ఆస్తులున్నవారిని బెదిరించామని, కొట్టామని ఆయన ఆరోపించడాన్ని తప్పుబట్టాడు. చంద్రబాబు నిజాయితీ గల  నాయకుడైతే ముందు హైదరాబాద్ లోని తన ఆస్తులను అమ్ముకొవాలని తలసాని సూచించారు. 

 • kaleru

  Telangana12, Apr 2019, 1:36 PM IST

  టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై రంజిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు...కేసు నమోదు

  తెలంగాణ లోక్ సభ ఎన్నికలు గురువారం ముగిశాయి. పోలింగ్ సందర్భంగా అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా అంతటా ప్రజలు ప్రశాంతంగా ఓటేశారు.అయితే సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో అక్కడక్కడ చిన్న చిన్న వివాదాలు చెలరేగాయి. అంబర్ పేట టీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌కు స్థానిక బిజెపి నాయకులకు మధ్య ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ క్రమంలో బిజెపి నాయకులు రంజిత్ రెడ్డి ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

 • KTR

  Telangana11, Apr 2019, 2:13 PM IST

  బాధ్యతగా నేను ఓటేశాను, మరీ మీరు???: ఓటర్లకు కేటీఆర్ ప్రశ్న

  తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇప్పటికే తాను బాధ్యతను ఓటేశానని మరి మీరు వేశారా అంటూ ప్రజలను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. ఓటు హక్కును భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని...మన ఓటు ద్వారా మంచి నాయకులను ఎన్నుకోవాలంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 

 • etela

  Telangana11, Apr 2019, 1:18 PM IST

  కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన ఈటల... టీఆర్ఎస్‌ విజయంపై ధీమా (వీడియో)

  తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. పోలింగ్ లో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ, సీని ప్రముఖులు కూడా ఉత్సాహంగా  పాలుపంచుకుంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామం కమలాపూర్ లో ఓటు హక్కును  వినియోగించుకున్నారు. 

 • harish

  Telangana27, Mar 2019, 5:40 PM IST

  మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రచారాన్ని భుజానెత్తుకున్న హరీష్...సిద్దిపేటలో ముమ్మర ప్రచారం (ఫోటోలు)

  మెదక్ ఎంపీ అభ్యర్థి ప్రచారాన్ని భుజానెత్తుకున్న హరీష్...సిద్దిపేటలో ముమ్మర ప్రచారం 

 • harish

  Telangana27, Mar 2019, 5:26 PM IST

  మంత్రి పదవిని కూడా లాక్కుని అన్యాయం చేశారు: హరీష్ రావు

  నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకుండా అన్యాయం చేసిందని అన్యాయం చేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే ఆరోపించారు. తెలంగాణ కు ఇచ్చిన ఒక్క మంత్రి పదవిని కూడా పూర్తికాలం కొనసాగించకుండా మధ్యలోనే లాక్కున్నారని అన్నారు. ఇలా దత్తాత్రేయ నుండి మంత్రి పదవి లాక్కొని తెలంగాణ ను అవమానించారని హరీష్ పేర్కొన్నారు. 

 • Uttam Kumar Reddy

  Telangana27, Mar 2019, 3:03 PM IST

  బ్యాలెట్ ఎన్నికలే తమను గెలిపిస్తాయి... ఈవీఎంలు కావు: ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందడంపై టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. రెండు నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరగడం వల్లే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందన్న తమ అనుమానాలకు ఈ ఫలితాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని అన్నారు.ఇలా ఈవీఎంల ద్వారా జరిగే ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు చతికిల పడిందని ప్రశ్నించారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని ఉత్తమ్ అన్నారు. 

 • టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను నియమిస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాలు హరీష్‌రావుకు వ్యతిరేకంగా ఉన్నట్టుగా ఆయన వర్గీయులు భావిస్తున్నారు. కేబినెట్‌లో హరీష్‌రావుకు చోటు దక్కకపోవడంపై కూడ ఆయన స్వయంగా వివరణ ఇచ్చారు. తనకు అసంతృప్తి లేదని కూడ ప్రకటించారు.

  Telangana26, Mar 2019, 7:36 PM IST

  ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా కేసీఆర్‌కు ఒక్క పైసా ఇవ్వలేదు: హరీష్

  నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి గత ఐదేళ్ళ కాలంలో కేంద్ర ప్రభుత్వం అదనంగా ఒక్క పైసా ఇవ్వలేదని మాజీ  మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. నిధుల కోసం సీఎం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఎంపీకి మంత్రి పదవి ఇచ్చినట్లే ఇచ్చి తిరిగి లాక్కుని యావత్ తెలంగాణను అవమానించారని హరీష్ బిజెపి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

 • chandra shekar

  Telangana24, Mar 2019, 2:55 PM IST

  కాంగ్రెస్‌కు మరో బిగ్‌ షాక్...పార్టీని వీడనున్నట్లు ప్రకటించిన మాజీ మంత్రి

  ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ములిగే నక్కపై తాటిపండు పడ్డట్లు తయారయ్యింది. ఇప్పటికే ఎమ్మెల్సీ  ఎన్నికల్లో ప్రారంభమైన ఎమ్మెల్యేల వలసలు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా కొనసాగుతున్న విషయం తెలిసిందే. వీటిని అడ్డుకోలేక ఆ పార్టీ అధినాయకత్వం, రాష్ట్ర నాయకులు చేతులెత్తేశారు. ఇలా   గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఆ పార్టీకి అండగా వుండాల్సిన సీనియర్లు కూడా ఒక్కొక్కరుగా వీడుతుండటం టిపిసిసి నాయకులు, కార్యకర్తలకు మరింత ఆందోళన కల్గిస్తోంది. ఇలా మహబూబ్ నగర్ మాజీ మంత్రి ఒకరు తాజాగా కాంగ్రెస్ వీడనున్నట్లు ప్రకటించి మరో షాక్ ఇచ్చారు.  

 • warangal

  Telangana15, Mar 2019, 8:34 PM IST

  వరంగల్ కార్పోరేషన్‌లో టీఆర్ఎస్ హవా...ఎన్నికలు లేకుండానే గెలుపు

  వరంగల్ కార్పోరేషన్ లో మరోసారి టీఆర్ఎస్ హవా కొనసాగింది. ఇటీవల నగర మేయర్ నన్నపునేని నరేందర్ ఎమ్మెల్యేగా గెలుపొందడంతో మేయర్ పదవితో పాటు 19వ డివిజన్ కార్పోరేటర్ పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా ఖాళీ అయిన కార్పోరేటర్ స్థానానికి ఎన్నికల కోసం ఇటీవలే నోటిఫికేషన్ వెలువడింది. అయితే ఎన్నికలేవీ లేకుండా ప్రత్యర్థులను ఒప్పించచడంలో ఎమ్మెల్యే నరేందర్ సఫలమవడంతో మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థి దిడ్డి నాగరాజు ఏకగ్రీవంగా గెలుపొందారు. దీంతో వరంగల్ టీఆర్ఎస్ సంబరాల్లో మునిగిపోయింది. ఈ సందర్బంగా ఆ పార్టీ నాయకులు కార్పోరేషన్ కార్యాలయం వద్ద మిఠాయిలు పంచుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

 • Telangana26, Feb 2019, 9:12 PM IST

  కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించిన ఉత్తమ్....

  సుధీర్ఘ చర్చల అనంతరం ఎట్టకేలకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని టిపిసిసి నిర్ణయించింది. శాసన మండలిలో ఖాళీ అయిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంకోసం మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలో నిలవనున్నట్లు టిపిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. అయితే అధికారికంగా మాత్రం బుధవారం ప్రకటించనున్నట్లు ఉత్తమ్ తెలిపారు. 

 • kcr cabinet

  Telangana20, Feb 2019, 5:06 PM IST

  కొత్త మంత్రులకు శుభాకాంక్షల వెల్లువ...

  తెలంగాణ మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం విస్తరించిన విషయం తెలిసిందే. కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వంలో పనిచేసేందుకు ఈ విస్తరణ ద్వారా మరికొందరికి అవకాశం వచ్చింది. ఇలా మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన నాయకులకు ప్రభుత్వ అధికారులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల నుండి శుభాకాంక్షలు వెల్లువ మొదలయ్యింది. మంత్రులను మర్యాదపూర్వకంగా కలవడానికి వారి ఇంటి వద్దకు భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు. ఇలా నూతన మంత్రులు బిజీబిజీగా గడుపుతున్నారు.