Trs Mp  

(Search results - 87)
 • kcr

  Telangana24, May 2019, 6:18 PM IST

  కేసీఆర్ ను కలిసిన కొత్త ఎంపీలు (ఫొటోలు)

  కేసీఆర్ ను కలిసిన కొత్త ఎంపీలు (ఫొటోలు)

 • ranjith reddy

  Telangana11, Apr 2019, 5:26 PM IST

  ఈసారి అయిపోయింది,వచ్చే ఎన్నికల్లో అయినా...: ఓటర్లకు చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి విజ్ఞప్తి

  తెలంగాణలో గురువారం లోక్ సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నిజామాబాద్ మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అయితే తాను పోటీచేస్తున్న చేవెళ్ల నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లు, పోలింగ్ సరళిని పరిశీలిస్తే పొద్దున్నుండి బిజీబిజీగా గడిపిన టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఎంపీ, ఎంఎల్ఏ కాలనీలోని సెంట్రల్ నర్సరీ పోలింగ్ బూత్ లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి ఓటు హక్కు  వినియోగించుకున్నారు. 

 • kavitha

  Telangana8, Apr 2019, 2:07 PM IST

  బీజేపీ మేనిఫెస్టోపై కవిత సెటైర్లు

  బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోపై నిజామాబాద్ ఎంపీ కవిత స్పందించారు. నిజామాబాద్ జిల్లా నందిపేటలో కవిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు

 • kavitha

  Telangana5, Apr 2019, 4:48 PM IST

  ఓటే కాదు నోటు కూడా ఇస్తామంటున్నారు: ఎన్నికల ప్రచారంలో కవిత (వీడియో)

  నిజామాబాద్ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీమీదున్న నమ్మకంతో లోక్ సభ ఎన్నికల్లో తనను గెలిపించడానికి సిద్దంగా వున్నారని ఎంపీ కవిత ధీమా వ్యక్తం చేశారు. కేవలం ఓటే కాదు ఎన్నికల ఖర్చు కోసం నోటు(డబ్బులు) కూడా ఇస్తున్నారని తెలిపారు. ఆమె శుక్రవారం నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని బఢా భీంగల్ లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు టీఆర్ఎస్ నాయకులు, మహిళా సంఘాలు ఆమెకు కొంత డబ్బును ఎన్నికల ఖర్చు కోసం అందించారు. 

 • jitender reddy

  Telangana26, Mar 2019, 11:34 AM IST

  రాం మాధవ్‌తో టీఆర్ఎస్ ఎంపీ భేటీ

  మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి బీజేపీ సీనియర్ నేత రాం మాధవ్‌తో మంగళవారం నాడు భేటీ అయ్యారు. టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కని కారణంగా జితేందర్ రెడ్డి టీఆర్ఎస్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.

 • chevella

  Telangana25, Mar 2019, 4:46 PM IST

  తుల్జాభవాని పాదాల వద్ద నామినేషన్ పత్రాలు... చేవెళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి ప్రత్యేక పూజలు (వీడియో)

  చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ కుమార్ సోమవారం నామినేషన్ వేశారు. అంతకు ముందు ఆయన శేరిలింగంపల్లి తారానగర్ లోని తుల్జాభవాని ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలను అమ్మవారి పాదాలవద్ద ఉంచి తనను గెలిపించాలని అమ్మవారికి వేడుకున్నారు. 

 • తలసాని సాయికిరణ్ యాదవ్ నామినేషన్ ర్యాలీ

  Telangana25, Mar 2019, 3:52 PM IST

  డప్పు చప్పుళ్లు, కళాకారుల నృత్యాలతో భారీ ర్యాలీ... అట్టహాసంగా సాయికిరణ్ నామినేషన్ కార్యక్రమం

  తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయులు, టీఆర్ఎస్ సికింద్రాబాద్ లోక్ సభ అభ్యర్థి సాయికిరణ్ యాదవ్ నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. సోమవారం ఆయన మారేడుపల్లిలోని ఇంటినుండి ఆబిడ్స్ వరకు భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. ఈ ర్యాలీలో టీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ నాయకులతో పాటు ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు. 

 • Kavitha TRS

  Telangana24, Mar 2019, 7:19 AM IST

  చంద్రబాబు కేసీఆర్ ను చాలా మిస్ అవుతున్నారు అందుకే కంగారు: ఎంపీ కవిత

  యుద్ధం యుద్ధం అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. తమకు ఎవరితోనూ యుద్ధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే వారితోనే తాము యుద్ధం చేస్తామని పరోక్షంగా పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చారు. 
   

 • నల్గొండ నుండి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థానం నుండి కేసీఆర్ కూడ పోటీ చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. సుఖేందర్ రెడ్డి పోటీకి విముఖత చూపితే తేరా చిన్నపరెడ్డి లేదా ప్రముఖ బిల్డర్ వి. నర్సింహారెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది. మల్కాజిగిరి నుండి నవీన్‌రావు, చేవేళ్ల నుండి రంజిత్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ నుండి మంత్రి తలసాని తనయుడు సాయి కిరణ్ పోటీ చేసే అవకాశం ఉంది.

  Telangana21, Mar 2019, 7:56 PM IST

  లోక్ సభ అభ్యర్ధుల ఎంపికలో కేసీఆర్ సంచలన నిర్ణయం...గుత్తాకు దక్కని చోటు

  దేశ రాజకీయాలను శాసించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేంధర్ రెడ్డికి ఈసారి లోక్ సభ ఎన్నికలకు దూరం పెట్టారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ గా కొనసాగుతున్న నల్గొండ లోక్ సభ నియోజవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వేంరెడ్డి నర్సింహా రెడ్డి పోటీ చేయనున్నట్లు కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.  

 • హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు దెబ్బకు తెలంగాణ కాంగ్రెసు రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడుతోంది. మెజారిటీ ఎమ్మెల్యేలు కాంగ్రెసు చేతి నుంచి జారిపోయారు. దీంతో ప్రతిపక్ష హోదా కూడా గల్లంతు కానుంది.

  Telangana21, Mar 2019, 6:26 PM IST

  గుత్తా సహా నలుగురు సిట్టింగ్‌లకు కేసీఆర్ షాక్: టీఆర్ఎస్ అభ్యర్థులు వీరే

  తెలంగాణ రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కొద్దిసేపట్లో ప్రకటించనున్నారు. ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే  ప్రగతి భవన్‌కు చేరుకొన్నారు

 • తమకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెసు పార్టీని దాదాపుగా వదిలేసి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపైనే విరుచుకుపడ్డారు. మళ్లీ ఆంధ్రవాళ్ల పాలన కావాలా అని ఓటర్లను ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబును ఎలా అంగీకరిస్తారని ఆయన అడిగారు.

  Telangana21, Mar 2019, 3:17 PM IST

  జితేందర్ రెడ్డికి కేసీఆర్ షాక్: మహాబూబ్ నగర్ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్ రెడ్డి

  మహాబూబ్ నగర్  జిల్లాకు చెందిన టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. మహాబూబ్ నగర్ సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డి స్థానంలో మన్నె శ్రీనివాస్ రెడ్డికి కేటాయించే అవకాశం ఉంది.

 • తమకు ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెసు పార్టీని దాదాపుగా వదిలేసి కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుపైనే విరుచుకుపడ్డారు. మళ్లీ ఆంధ్రవాళ్ల పాలన కావాలా అని ఓటర్లను ప్రశ్నించారు. తెలంగాణకు నీళ్లు రాకుండా అడ్డుకుంటున్న చంద్రబాబును ఎలా అంగీకరిస్తారని ఆయన అడిగారు.

  Telangana21, Mar 2019, 9:42 AM IST

  ముగ్గురికి కేసీఆర్ షాక్: తెలంగాణ లోకసభ బరిలో నిలిచేది వీరే....

  16 మంది పార్లమెంట్ అభ్యర్థుల్లో సగానికిపైగా కొత్తవారికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం. అయితే వీరిలో 8మంది సిట్టింగ్ అభ్యర్థులకు మళ్లీ అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. అలాగే ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ లకు ఈసారి టికెట్ ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. 

 • kavitha

  Telangana15, Mar 2019, 4:48 PM IST

  టీఆర్ఎస్ పార్టీ బి-టీమే... కానీ బిజెపి, కాంగ్రెస్‌లకు కాదు: కవిత

  గతంలో అసెంబ్లీ, ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పై ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలను నిజామాబాద్ ఎంపీ  కల్వకుంట కవిత మరోసారి తిప్పికొట్టారు. తెలంగాణ ప్రజలు కొద్దిరోజుల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ పార్టీలమని చెప్పుకునే బిజెపి, కాంగ్రెస్ లను మాకొద్దంటూ తిరస్కరించినా వారి తీరులో మార్పు రావడం లేదన్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మీకంటే మీకు బీ-టీమ్ అని బిజెపి, కాంగ్రెస్ లు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. అయితే టీఆర్ఎస్ నిజంగానే బి-టీమ్ అని...కానీ వారంటున్నట్లు ఏదో పార్టీకి కాదని తెలంగాణ ప్రజలకు బి - టీమ్ అని కవిత పేర్కొన్నారు. 

 • తెలంగాణలో ఏర్పడిన మంత్రులలో 12 మందిలో ఏ ఒక్క మహిళలకు అవకాశం కల్పించలేదు. కేబినేట్ విస్తరణ తర్వాత కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది కేసీఆర్ కి. ఇలాంటి తరుణంలో తరుణంలో కేసీఆర్ తర్వాత జరగబోయే విస్తరణలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పిస్తామని ప్రకటించారు.

  Telangana14, Mar 2019, 4:58 PM IST

  ఆ లోక్ సభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు ఖరారు

  దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే అమలుచేయాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందుకోసం తమ పార్టీ తరపున ఎంపీ అభ్యర్థులను ముందుగానే ప్రకటించి ప్రత్యర్థులను మరోసారి ఇరుకునపెట్టే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది. ఇలా వేగంగా, పొరపాట్లు లేని నిర్ణయాల ద్వారా ఈ లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించేందుకు టీఆర్ఎస్ వ్యూహాలను సిద్దం చేసింది.  

 • jitender reddy

  Telangana14, Mar 2019, 4:36 PM IST

  గిట్టని వారి ప్రచారం, కాంగ్రెస్‌లో చేరను: జితేందర్ రెడ్డి

  తానంటే  పడనివారే తనకు టిక్కెట్టురాదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పారు.