Telangana Assembly Election 2018  

(Search results - 133)
 • undefined

  TelanganaDec 27, 2018, 6:14 PM IST

  అక్కడ మాత్రమే ఓటర్ల సంఖ్య పెరిగింది: సిఈసికి బిజెపి ఫిర్యాదు

  ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ పార్టీ అక్రమాలకు పాల్పడిందంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాన బిజెపి నాయకులు ఫిర్యాదు చేశారు. బిజెపి ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో కావాలనే ఓట్లను గల్లంతు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కానీ ఎంఐఎం ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాల్లో మాత్రం ఓటర్ల సంఖ్య పెరిగిందన్నారు. దీనిపై తమకున్న అనుమానాలను బిజెపి నాయకులు సీఈసి దృష్టికి తీసుకెళ్లారు. 

 • MAHESWARAM_Sabitha Indra Reddy

  TelanganaDec 14, 2018, 3:25 PM IST

  సబితా ఇంద్రారెడ్డికి కీలక బాధ్యతలు... కాంగ్రెస్ అధిష్టానం చర్చలు

  తెలంగాణ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం తీసుకురావడానికి అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. పార్టీలో కీలక మార్పులు చేపట్టాలని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు అందుకోసం మొదట కీలక పదవుల్లో మార్పులు చేపట్టడానికి రాష్ట్ర నాయకులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనాన్ని రంగారెడ్డి జిల్లాలో కాస్త అడ్డుకున్న సబితా ఇంద్రారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 
   

 • malla reddy

  TelanganaDec 14, 2018, 1:53 PM IST

  టీఆర్ఎస్ ఎంపీల రాజీనామా....

  టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తెలంగాణ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఇటీవలే మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచిన చామకూర మల్లారెడ్డిలు తమ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరు తమ రాజీనామా లేఖను లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహజన్ కు అందజేశారు. అయితే పెద్దపల్లి ఎంపీ మాల్క సుమన్ కూడా చెన్నూరను నుండి ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ఎంపీ పదవిని వదులుకోలేదు. 

 • KCR _ Narasimhan

  TelanganaDec 12, 2018, 8:52 PM IST

  కేసీఆర్ రాజీనామాను ఆమోదించిన గవర్నర్

  తెలంగాణ లో టీఆర్ఎస్ ప్రభుత్వ ఏర్పాటుకు అంతా సిద్దమైంది. రేపు(గురువారం) ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి చకచకా ఏర్పాట్లు జరుగుతుంది. దీంతో ఆపద్దర్మ ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు మంత్రి మండలి సభ్యులు కూడా రాజీనామా చేశారు. 

 • kcr flex

  TelanganaDec 12, 2018, 6:30 PM IST

  కేసీఆర్ మగాడ్రా బుజ్జి

   మహా కూటమి తరపున ఏపి ముఖ్యమంత్రి ఇక్కడే మకాం వేసి ప్రచారం చేసినా గెలిపించుకోలేక పోయారు. కానీ టీఆర్ఎస్ తరపున కేసీఆర్ ఒక్కడే దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ప్రచారం చేసి చివరకు ఫలితాన్ని రాబట్టారు. దీంతో ఆయన క్రేజ్ మరింతగా పెరిగింది. 

 • revanth reddy

  TelanganaDec 12, 2018, 5:53 PM IST

  అక్కడ సానుభూతి పనిచేసింది...మరి రేవంత్ విషయంలో ఎందుకలా

  తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే గతంలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా వున్న సమయంలో కూడా గెలిచిన కాంగ్రెస్ సీనియర్లు ఈసారి మాత్రం ఓటమి పాలయ్యారు. అయితే ఎన్నికల ముందు జరిగిన ఒకే రకమైన పరిణామం ఓ అభ్యర్థిపై సానుభూతిని పెంచి గెలిపిస్తే...మరో అభ్యర్థిని ఘోరంగా ఓడిపోయేలా చేసింది.  

 • kcr ktr

  TelanganaDec 12, 2018, 3:24 PM IST

  రెండోసారి నాన్నకు ప్రేమతో... కేసీఆర్ కు కేటీఆర్ గిఫ్ట్

  గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను మంత్రి కేటీఆర్ తన భుజాలపై ఎత్తుకుని ప్రచారాన్ని నిర్వహించారు. అదే సమయంలో టీఆర్ఎస్ ను హైదరాబాద్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. దీంతో గ్రేటర్ లో ఎప్పుడూ లేని విధంగా అత్యధిక మెజారిటీని టీఆర్ఎస్ గెలుపొంది. మరోసారి హైదరాబాద్ బాధ్యతులు స్వీకరించిన కేటీఆర్ ఇక్కడ అభ్యర్థుల తరపున విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇలా జీహెచ్ఎంసీలో పాటించిన వ్యూహాన్నే  మరోసారి అనుసరించి అదే ఫలితాన్ని రాబట్టడంలో కేటీఆర్ సఫలమయ్యారు.

 • trs

  TelanganaDec 12, 2018, 1:53 PM IST

  తెలంగాణ ఫలితాలు: కారును బోల్తా కొట్టించిన ట్రక్కు

  గత రెండు రెండు మూడు నెలలుగా తెలంగాణలో సాగుతున్న ఎన్నికలు ఎట్టకేలకు ముగిసాయి. ఈ ఎన్నికల్లో హస్తాన్ని నలిపెస్తూ కారు శరవేగంతో దూసుకుపోయింది. ఆ వేగం 2014ల్లో సెంటిమెంట్ అధికంగా వున్న సమయం కంటే ఎక్కువగా వుంది. అన్ని నియోజకవర్గాల్లో కారు జోరుకు అడ్డు లేకుండా దూసుకుపోతే... కొన్ని చోట్ల మాత్రం ఓ ట్రక్కు ఆ కారును అడ్డుకుంది. ఇలా రెండు మూడు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమికి ట్రక్కు గుర్తు శాసించిందని నిన్నటి ఫలితాలను చూస్తే అర్థమవుతోంది. 

 • Breaking News

  TelanganaDec 11, 2018, 7:22 PM IST

  తమ నాయకుడి ఓటమి తట్టుకోలేక యువకుడి ఆత్మహత్యాయత్నం

  తమ నాయకుడు ఓడిపోయాడన్న మనస్థాపంతో ఓ కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వికారాబాద్ పట్టణంలో నడిరోడ్డుపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోడానికి ప్రయత్నించాడు. అయితే చుట్టుపక్కల వున్నవారు దీన్ని  గమనించి అతన్ని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. 

 • KTR

  TelanganaDec 11, 2018, 4:01 PM IST

  తన గెలుపుపై కేటీఆర్ ట్వీట్...

  తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మరోసారి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ పార్టీ నాయకులందరు బంఫర్ మెజారిటీలతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులపై కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఇక టీఆర్ఎస్ ప్రముఖులు కేసీఆర్, హరిష్, కేటీఆర్ లు భారీ మెజారిటీలతో విజయం సాధించారు. 

 • undefined

  TelanganaDec 10, 2018, 8:55 PM IST

  ''కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్''

  తెలంగాణ పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల అలజడులు చెలరేగడంతో కౌటింగ్ సమయంలో కూడా అలాంటి పరిస్థితులు ఏర్పేడే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో కౌటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు శాంతి భద్రతల విభాగ అడిషినల్ డిజి జితేందర్ వెల్లడించారు.