Teamlease  

(Search results - 3)
 • teamlease
  Video Icon

  Telangana6, Sep 2019, 8:21 PM

  టీమ్ లీజ్ సదస్సు: ఉద్యోగ నియామకాల్లో టెక్నాలజీ పాత్ర...ప్రముఖ హెచ్‌ఆర్‌ల సూచనలివే (వీడియో)

  ప్రముఖ ఉద్యోగ నియామకాల సంస్థ టీమ్ లీజ్ హెచ్‌ఆర్ రంగానికి  చెందిన ప్రముఖులతో ఓ సదస్సును నిర్వహించింది.''భవిష్యత్తులో టెక్ మరియు మానవ వనరులు'' అన్న అంశంపై హైదరాబాద్ లోని హోటల్ దసపల్లాలో ఈ సదస్సు జరిగింది.  ఇందులో మానవ వనరుల రంగంలో టెక్నాలజీ ప్రాతపై గ్లోబల్ టాలెంట్ లీడర్ శ్రీకాంత్ అరిమాణిత్య, గ్లోబల్ ట్రాన్స్‌ఫర్మేషన్ లీడర్ అజయ్ భక్షీ విలువైన సూచనలు, సలహాలు అందించారు. అలాగే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీహెచ్ఆర్వో వెంకటేశ్ పాలభట్ల, మెకనీస్ సాఫ్ట్‌వేర్ సీనియర్ హెచ్ ఆర్ డైరెక్టర్ నేహా చోప్రా కుమార్, మోడల్ ఎన్ సీనియర్ హెచ్ ఆర్ డైరెక్టర్ రాజలక్ష్మీ శివానంద్, హెచ్ఎస్‌బీసీ డేటా అనలిటిక్స్ గ్లోబల్ హెడ్ కిరణ్ సముద్రాల, జీవీకే బయో డైరెక్టర్ ఐతా లక్ష్మీపతి తదితర ప్రముఖులు కూడా తమ విలువైన సలహాలు, సూచనలను అందించారు.  

 • teamlease
  Video Icon

  Telangana6, Sep 2019, 6:55 PM

  టీమ్ లీజ్ టెక్ & హెచ్ఆర్ సదస్సు... ఉద్యోగుల స్పందనిదే (వీడియో)

  ప్రముఖ ఉద్యోగ నియామకాల సంస్థ టీమ్ లీజ్ ''భవిష్యత్తులో టెక్ మరియు మానవ వనరులు'' అన్న అంశంపై ఇవాళ  హైదరాబాద్ లో ఓ ప్రత్యేక సదస్సును నిర్వహించింది. హోటల్ దసపల్లాలో జరిగిన ఈ సదస్సులో వివిధ సంస్థలకు చెందిన ప్రతినిధులతో పాటు ఔత్సాహికులు పాల్గొన్నారు. మానవ వనరులు టెక్నాలజీని ఉపయోగించుకునేలా చూడటమే లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. ఇందులో పాల్గొన్న ముఖ్య అతిథులు వారి అనుభవాలతో కూడిన సలహాలు, సూచనలు అందించారని... అవి తమకెంతో ఉపయోగపడేలా వున్నాయని సదస్సులో పాల్గొన్న  ఉద్యోగులు తెలిపారు.   

 • team

  Telangana2, Sep 2019, 9:24 PM

  సెప్టెంబర్ 6న టీమ్ లీజ్ ఆధ్వర్యంలో టెక్ & హెచ్ఆర్ సదస్సు

  ప్రముఖ ఉద్యోగ నియామకాల సంస్థ టీమ్ లీజ్ భవిష్యత్తులో టెక్ మరియు మానవ వనరులు అన్న అంశంపై ఈ నెల ఆరో తేదీన హైదరాబాద్ హోటల్ దసపల్లాలో సదస్సు నిర్వహించనుంది. ఉద్యోగుల జీవిత చక్రంలో నియామకం, ఆన్ బోర్డింగ్ మరియు శిక్షణ, పరిహారం, ప్రయోజనాలు, నిష్క్రమణ తదితర అంశాల విషయంలో సాంకేతిక పరిజ్ఞానం సాయపడుతుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు