Search results - 255 Results
 • dhoni

  CRICKET19, Jan 2019, 12:49 PM IST

  రిటైర్మెంట్‌పై మరోసారి స్పందించిన ధోని...(వీడియో)

  ఆస్ట్రేలియా జట్టుపై నిర్ణయాత్మక చివరి వన్డేలో మహేంద్ర సింగ్ ధోని  మ్యాచ్ విన్నింగ్స్ ఆడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గ్రౌండ్ లోంచి బయటకు వస్తూ ధోని తన రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోని జట్టు కోచింగ్ సిబ్బందితో అన్న మాటలు రికార్డయి టివీలో ప్రసారమయ్యాయి. ధోని సరదాగానే అన్న ఈ మాటలు క్రికెట్ అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. 

 • ktr kavitha

  CRICKET19, Jan 2019, 12:00 PM IST

  టీంఇండియాకు కేటీఆర్, కవిత అభినందనలు...

  ఆస్ట్రేలియా జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించిన భారత జట్టుపై ప్రశంసల జల్లు కురుస్తోంది. చారిత్రాత్మక టెస్ట్ సీరిస్ విజయం సాధించడమే గొప్పతనంగా భావిస్తుంటే బోనస్ గా వన్డే సీరిస్ ను కూడా కోహ్లీ సేన కైవసం చేసుకుంది. ఇలా మొట్టమొదటి సారి వరుసగా టీ20 సీరిస్ ను సమం చేసి, టెస్ట్, వన్డే సీరిస్ లను కైవసం చేసుకున్న భారత ఆటగాళ్లను టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆయన సోదరి, నిజామాబాద్ ఎంపి కవిత అభినందించారు. 

 • CRICKET18, Jan 2019, 7:36 PM IST

  ఆస్ట్రేలియా జట్టును ఉతికి ఆరేసిన ధోని, చాహల్...

  మెల్ బోర్న్ వన్డేలో భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియా జట్టుపై చెలరేగిపోయారు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో కూడా రాణించి నిర్ణయాత్మక చివరి వన్డేలో జట్టును గెలిపించి వన్డే సీరిస్‌ కూడా భారత్ ఖాతాలో పడేలా చేశారు. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆసిస్ తమ స్వదేశంలో ఆడిన టెస్ట్, వన్డే సీరిస్ లను కోల్పోయి, టీ20 సీరిస్ ను సమం చేసింది. దీంతో ఆసిస్ రిక్తహస్తాలతో నిలిచి పరాభవం మూటగట్టుకుంది. 

 • chahal

  CRICKET18, Jan 2019, 5:43 PM IST

  వైడ్ బంతికి ఆసిస్ బ్యాట్స్ మన్ బోల్తా...అంతా చాహల్, ధోని మాయ

  ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనను విజయవంతంగా ముగించింది భారత జట్టు. ఈ పర్యటనలో చివరిదైన మెల్ బోర్న్ వన్డేలో గెలిచి ఆసిస్ గడ్డపై వరుసగా టెస్ట్, వన్డే సీరిస్ గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అయితే వన్డే సీరిస్ గెలుపును నిర్ణయించే చివరి వన్డేలో మొదట బౌలింగ్ లో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అద్భుతాలు సృష్టించగా, బ్యాటింగ్ లో మహేంద్ర సింగ్ ధోని ఆకట్టుకున్నాడు. అయితే వీరిద్దరు కలిసి  సమన్వయంతో ఆస్ట్రేలియాకు చెందిన కీలక బ్యాట్ మెన్ ను ఔట్ చేసి ఔరా అనిపించారు. 

 • Dhoni-Kohli

  CRICKET18, Jan 2019, 5:12 PM IST

  కెప్టెన్‌గా కోహ్లీ ఖాతాలో మరో అరుదైన రికార్డు

  ఆస్ట్రేలియా పర్యటనను భారత జట్టు ఘనంగా  ముగించింది. ఇప్పటికే ఆసిస్‌ జట్టును వారి స్వదేశంలోనే మట్టికరిపించి  కోహ్లీ సేన చారిత్రాత్మక టెస్ట్ సీరిస్ విజయాన్ని అందుకుంది. తాజాగా మూడు వన్డేల సీరిస్ ను కూడా 2-1 తేడాతో గెలుచుకుని కెప్టెన్ గా కోహ్లీ మరో చరిత్ర సృష్టించాడు.ఆస్ట్రేలియా జట్టుపై వరుసగా ఇలా టెస్ట్ సీరిస్, వన్డే సీరిస్ లను గెలుచుకున్న ఏకైక భారత కెప్టెన్ గా కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియా జట్టుపై వారి స్వదేశంలోనే టీ20, టెస్ట్, సీరిస్ లను సాధించిన జట్టుగా భారత్ నిలిచింది.  

 • india win odi series

  CRICKET18, Jan 2019, 7:43 AM IST

  ఆస్ట్రేలియాకు షాక్: వన్డే సిరీస్ కూడా భారత్ ఖాతాలోనే..

  ఆస్ట్రేలియా గడ్డపై ఆతిథ్య జట్టును మట్టి కరిపించి టెస్టు సిరీస్ ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన వన్డే సిరీస్ ను కూడా సొంతం చేసుకుని తనకు తిరుగులేదని చాటి చెప్పింది. చివరి రెండు వన్డే మ్యాచుల విజయంలోనూ సీనియర్ ఆటగాడు ధోనీ కీలక పాత్ర పోషించడం శుభపరిణామం. 

 • khawaja pant

  CRICKET17, Jan 2019, 5:55 PM IST

  మా అమ్మ, సోదరి కూడా నా స్లెడ్జింగ్‌ను ఇష్టపడ్డారు: పంత్

  రిషబ్ పంత్...ప్రస్తుతం భారత యువ క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న ప్రతిభాశాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోపిలో భాగంగా జరిగిన టెస్ట్ సీరిస్‌లో పంత్ ఆస్ట్రేలియా జట్టుకు బ్యాట్ తోనే కాదు...నోటితోనూ సమాధానం చెప్పాడు. ఓ వైపు తన అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శనతో సిడ్నీ టెస్టులో సెంచరీ సాధించాడు. అంతే కాకుండా తనను  రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తూ స్లెడ్జింగ్‌కు దిగిన ఆసిస్ ఆటగాళ్ళకు తనదైన శైలిలోనే రిషబ్ జవాబిచ్చాడు. దీంతో ఈ యువ ఆటగాడి  క్రేజ్ మరింత పెరిగింది. 

 • CRICKET17, Jan 2019, 4:37 PM IST

  అతడే అత్యుత్తమ గేమ్ ఫినిషర్: సచిన్

  ఆస్ట్రేలియా జట్టుపై అడిలైడ్‌  వేదికగా జరిగిన రెండో వన్డేలో ధోని ఆటతీరు అద్భుతమని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసించారు. చివరి నిమిషంలో ఒత్తిడిని తట్టుకుని...వికెట్‌ను కాపాడుకుంటూ విన్నింగ్ షాట్ కొట్టడం అంత సులువైన విషయం కాదని అన్నారు. అందుకే ధోనికి గేమ్ ఫినిషర్ అన్న పేరు వచ్చిందని..నిజంగానే అతడు అత్యుత్తమ గేమ్ ఫినిసర్ అని మరోసారి నిరూపించుకున్నాడంటూ సచిన్ కొనియాడారు.

 • sachin tendulkar

  CRICKET17, Jan 2019, 4:02 PM IST

  రిషబ్ పంత్ వరల్డ్ కప్ జట్టులో ఆడితే ఇక అంతే...: సచిన్

   యువ క్రికెటర్ రిషబ్ పంత్ని వరల్డ్ కప్ జట్టులో చోటు కల్పించే అవకాశాలను పరిశీలిస్తున్నామని చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ ప్రతిపాదనను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వ్యతిరేకించారు. పంత్ మంచి ప్రతిభ కలిగిన ఆటగాడేనని ప్రశంసిస్తూనే...ప్రస్తుత జట్టు కూర్పుకు మాత్రం అతడు సరిపోడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 • hardik

  CRICKET16, Jan 2019, 11:22 AM IST

  హర్దిక్ పాండ్యాకు మరో షాక్

  టీంఇండియా  ఆటగాడు హార్దిక్ పాండ్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఓ టివి షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇతడిపై ఇప్పటికే బిసిసిఐ రెండు వన్డేల నిషేధాన్ని విధించింది. తాజాగా పాండ్యా గౌరవ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ముంబైలోని ప్రతిష్టాత్మక క్లబ్ ''ఖర్ జింఖానా" ప్రకటించింది. సోమవారం జరిగిన మేనేజింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 
   

 • siraj

  CRICKET16, Jan 2019, 10:45 AM IST

  అడిలైడ్ వన్డేలో హైరదబాదీ బౌలర్ చెత్త రికార్డు

  ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరిస్ విజయాన్ని నిర్దేశించే అడిలైడ్ మ్యా‌చ్‌లో భారత ఆటగాళ్ళు అద్భుతంగా రాణించి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ విక్టరీకి కారణమైన బ్యాట్ మెన్స్‌ని పొగడ్తలతో  ముంచెత్తుతూ...చెత్త ప్రదర్శనతో పరుగులు సమర్పించుకున్న బౌలర్లపై అభిమానులు విరుచుకుపడుతున్నారు. ఇలా ఆరంగేట్ర మ్యాచ్‌లోనే అత్యంత చెత్త ప్రదర్శన చేసిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ కూడా నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నాడు. 

 • cricket

  CRICKET16, Jan 2019, 9:02 AM IST

  గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి... గ్రౌండ్‌లోనే కుప్పకూలి

  మైదానంలో క్రికెట్ సాధన చేస్తూ ఓ యువ క్రికెటర్ మృతి చెందాడు. ఓ స్పోర్ట్ క్లబ్ లో సాధన చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో సదరు క్రికెటర్ గ్రౌండ్‌లోనే కుప్పకూలి మృతిచెందాడు. ఈ విషాదం పశ్ఛిమ బెంగాల్ రాజధాని బెంగాల్ లో చోటుచేసుంది. 

 • CRICKET16, Jan 2019, 8:33 AM IST

  ఈ విజయం నాది కాదు...ఆయనదే: కోహ్లీ

  ఆస్ట్రేలియాతో జరుగిన నిర్ణయాత్మక రెండో వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. ఇలా కీలకమైన సమయంలో పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కానీ ఈ విజయం నావల్ల కాదు...మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వల్లే సాధ్యమయ్యిందని కొనియాడుతూ కోహ్లీ తన సింప్లిసిటీ, క్రీడాస్పూర్తిని మరోసారి చాటుకున్నారు. 

 • ausis

  CRICKET14, Jan 2019, 3:57 PM IST

  తప్పులో కాలేసిన అంపైర్...ఏడో బంతికి బ్యాట్స్ మన్ ఔట్

  ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో ఓ విచిత్రం చోటుచేసుకుంది. సాధారణంగా ఒక ఓవర్లో ఆరు బంతులుండగా అంపైర్ తప్పిదం వల్ల బౌలర్ ఏడో బంతిని కూడా వేశాడు. సరిగ్గా అదే బాల్ కు బ్యాట్ మెన్ ఔటవడంతో అంపైర్ వివాదంలో చిక్కుకున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే బిగ్ బిష్ లీగ్ లో ఇలాంటి తప్పిదాలు జరగడంపై కేవలం ఆసిస్ అభిమానుల నుండే కాదు క్రికెట్ అభిమానుల నుండి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.