Spice Jet
(Search results - 6)EntertainmentFeb 13, 2020, 5:02 PM IST
ఆకాశం నీ హద్దురా : మొదటిసారి విమానం ఎక్కిన వందమంది పేద విద్యార్థులు
సూర్య హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఆకాశం నీ హద్దురా.
ENTERTAINMENTJun 3, 2019, 12:00 PM IST
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో కయ్యం.. విశ్వక్ ఘాటు వ్యాఖ్యలు (వీడియో)
దాన్ని ఛాన్స్ గా తీసుకుని నన్ను ఏమైన చేయాలనుకుంటే నన్ను ఏవ్వడేంచేయలేడు: విశ్వక్ సేన్
businessJun 3, 2019, 11:40 AM IST
జెట్ నిపుణులకు ‘స్పైస్’ చేయూత: నిపుణులకు కొలువులు
మూలనపడ్డ జెట్ ఎయిర్వేస్ సిబ్బందికి ప్రత్యేకించి నిపుణులకు స్పైస్ జెట్ ఊరట కల్పిస్తోంది. తాజాగా 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని తలపెట్టింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తన సామర్థ్యం 80 శాతం విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పైస్‌జెట్ సీఎండీ అజయ్‌సింగ్ తెలిపారు.
businessApr 15, 2019, 10:40 AM IST
‘స్సైస్‌జెట్’లో హాఫ్ శాలరీకే జెట్ పైలట్లు, ఇంజినీర్లు: టిక్కెట్ల ధరలకు రెక్కలు
జెట్ ఎయిర్వేస్లో ఆర్థిక సంక్షోభం స్పైస్ జెట్ తదితర ప్రైవేట్ ఎయిర్ లైన్స్‌కు వరంగా మారుతోంది. మూడు నెలలకు పైగా వేతనాలందక ఇబ్బంది పడుతున్న జెట్ ఎయిర్వేస్ సిబ్బంది దాదాపు సగం వేతనానికే స్పైస్ జెట్‌లో చేరిపోతున్నారు.
businessMar 23, 2019, 1:18 PM IST
జెట్ ఎయిర్వేస్పై ముప్పేట దాడి: స్పైస్ జెట్ అండ్ ఇండిగో ఇలా
రుణ సంక్షోభంలో చిక్కుకుని సర్వీసులు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ విమానాలను లీజుకు తీసుకోవాలని స్పైస్ జెట్ భావిస్తున్నది. మరోవైపు జీతాల్లేక విలవిలాడుతున్న జెట్ ఎయిర్వేస్ పైలట్లను తమ సర్వీసులోకి తీసుకునేందుకు ఇండిగో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక రుణదాతలు అధిక వాటా తీసుకుని జెట్ ఎయిర్వేస్ సంస్థను నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు.
businessMar 3, 2019, 2:45 PM IST
ధరల సెగ ఉన్నా గోఎయిర్ డిస్కౌంట్ ఆఫర్
బడ్జెట్ ఎయిర్‌లైన్స్ సంస్థ గో ఎయిర్ విమాన టికెట్ల ధరలను తగ్గించింది. జాతీయ, అంతర్జాతీయ రూట్లలో విమాన టికెట్లను తగ్గింపు ధరల్లో ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించించింది. అన్ని చార్జీలు కలుపుకుని దేశీయ రూట్లలోరూ.1099, అంతర్జాతీయంగా రూ.4999 ప్రారంభ ధరలుగా ఆఫర్ చేస్తోంది. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్‌గా తీసుకొచ్చిన అవకాశం ఈ నెల నాలుగో తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
అలాగే ఇలా బుక్ చేసుకున్న టికెట్ల ద్వారా సెప్టెంబర్ ఒకటో తేదీ దాకా ప్రయాణించవచ్చు. పూర్తి వివరాలను గో ఎయిర్ వెబ్సైట్లో పొందుపర్చింది. కాగా ఒక పక్క భారీగా పెరిగి విమాన ఇంధన ధరలు, మరో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో విమాన ధరలు భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరల సంస్థ తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్ చేయడం గమనార్హం.
మరోవైపు గో ఎయిర్ ప్రత్యర్థి సంస్థ స్పైస్ జెట్ సంస్థ ఉడాన్ సేవలందించనున్నది. దీని ప్రకారం అన్ని ఫీజులు కలిపి టిక్కెట్ ధర రూ.2,293గా నమోదైంది. రీజినల్ కనెక్టివిటీ స్కామ్ - ఉడాన్ పథకాన్ని ఈ నెల 31 నుంచి ఏప్రిల్ 15 వరకు పది నూతన ప్లయిట్లలో అమలు చేయనున్నది.
వీడని జెట్ ఎయిర్వేస్ కష్టాలు
జెట్ ఎయిర్వేస్ కష్టాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. తాజాగా జెట్ ఎయిర్వేస్ రద్దు చేసిన విమాన సర్వీసుల్లోని ప్రయాణికులను అనుమతించమని ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా, ప్రైవేట్ రంగంలోని విస్తారా ఎయిర్‌లైన్స్ స్పష్టం చేశాయి. సాధారణంగా విమాన సర్వీసులు రద్దయినప్పుడు టికెట్ బుక్ చేసుకున్న విమానయాన సంస్థలు.. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇతర విమానయాన సంస్థల సర్వీసులను ఉపయోగించుకుంటాయి.
నిధుల కొరతతో జెట్ ఎయిర్వేస్ సర్వీసుల రద్దు
జెట్ ఎయిర్వేస్ మాత్రం నిధుల కొరతతో పలు విమాన సర్వీసులను రద్దు చేయటంతో తాము ఈ వసతిని కల్పించలేమని ఎయిర్ ఇండియా తెలిపింది. జెట్ ఎయిర్వేస్, జెట్ లైట్ లిమిటెడ్‌లకు చెందిన ప్రయాణికులను తమ విమానాల్లో ప్రయాణాలకు అనుమతించేదీ లేదని, ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని ఎయిర్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది.