Solipeta Sujatha
(Search results - 25)TelanganaNov 11, 2020, 9:03 AM IST
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం: హరీష్ రావుకు విజయశాంతి కితాబు
తెలంగాణ మంత్రి హరీష్ రావుపై సినీ నటి, కాంగ్రెసు నేత విజయశాంతి ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. హరీష్ రావు లేకుంటే దుబ్బాకలో టీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కేది కాదని ఆమె అన్నారు.
TelanganaNov 10, 2020, 7:42 PM IST
దుబ్బాక సౌండ్ ఇది: కేసీఆర్‌పై రఘునందన్ పంచ్‌లు
దుబ్బాక ఉప ఎన్నికలో తనను గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు బీజేపీ నేత రఘునందన్ రావు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విజయం పూర్తిగా దుబ్బాక ప్రజలకే అంకితం చేస్తున్నానని.. తన చివరి శ్వాస వరకు దుబ్బాక నియోజకవర్గానికే సేవ చేస్తానని తెలిపారు.
TelanganaNov 10, 2020, 7:21 PM IST
దుబ్బాక ఉప ఎన్నిక: కాంగ్రెస్‌కి బీజేపీ షాక్, టీఆర్ఎస్ కు దెబ్బేనా?
కాంగ్రెస్ పార్టీ మూడు ఎంపీ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేల్లో పది మందికి పైగా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. ఇది కూడ ఆ పార్టీకి నష్టం చేసింది.
TelanganaNov 10, 2020, 6:56 PM IST
గజ్వేల్‌కు కిలోమీటర్ దూరంలో బీజేపీ: కేసీఆర్‌కు సంజయ్ కౌంటర్
తమ పార్టీపై విశ్వాసంతో విజయాన్ని అందించిన దుబ్బాక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్. హైదరాబాద్ లోని రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పుగా సంజయ్ అభివర్ణించారు.
TelanganaNov 10, 2020, 6:00 PM IST
వచ్చేవారం ఢిల్లీకి విజయశాంతి: సొంత గూటికి తెలంగాణ రాములమ్మ
కాంగ్రెసు ప్రచార కమిటీ చైర్ పర్సన్, సినీ నటి విజయశాంతి వచ్చే వారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీలో పార్టీ పెద్దలను కలిసి ఆమె బిజెపిలో చేరుతారని భావిస్తున్నారు. ఇప్పటికే ఆమె కాంగ్రెసుకు దూరమయ్యారు.
TelanganaNov 10, 2020, 5:55 PM IST
దుబ్బాక ఉపఎన్నిక: బీజేపీదే విజయం.. ఈసీ అధికారిక ప్రకటన
దుబ్బాక ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించినట్లు తెలంగాణ ఎన్నికల కమీషన్ ప్రకటించింది. టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతపై 1,079 ఓట్ల తేడాతో బీజేపీ గెలిచినట్లు ఈసీ వెల్లడించింది
TelanganaNov 10, 2020, 4:34 PM IST
దుబ్బాక: కేసీఆర్ కు విజయశాంతి హెచ్చరిక, అదే నిజమైంది
దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంలో కాంగ్రెసు నేత, సినీ నటి విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్ కు చేసిన హెచ్చరికనే నిజమైంది. ఎవరు తీసిన గోతిలో వారే పడుతారని ఆమె వ్యాఖ్యానించారు.
TelanganaNov 10, 2020, 4:13 PM IST
దుబ్బాక: హరీష్ రావుకు ఎదురు దెబ్బ, బండి సంజయ్ మాటే నిజమవుతుందా?
దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత పరాజయం మంత్రి హరీష్ రావుకు ఎదురుదెబ్బనే. ఉప ఎన్నిక బాధ్యతను మొత్తం ఆయన తన భుజాల మీద మోశారు.
TelanganaNov 10, 2020, 3:33 PM IST
దుబ్బాక బైపోల్: తెలంగాణలో మారుతున్న సమీకరణాలకు కారణమిదీ...
అయితే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం యువత ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో ఆశించిన మేరకు ఉద్యోగ నియామకాలు చేపట్టలేదని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
TelanganaNov 10, 2020, 12:10 PM IST
దుబ్బాక బైపోల్: చిట్టాపూర్‌లో సత్తా చాటిన టీఆర్ఎస్
ఈ గ్రామంలో వచ్చిన మెజారిటీ ఆరో రౌండ్ లో వచ్చిన మెజారిటీయే బీజేపీ అభ్యర్ధి కంటే సుజాత ఆధిక్యాన్ని సాధించింది.ఐదు రౌండ్ల వరకు బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు ఆధిక్యతను సాధించింది. ఆరు, ఏడు రౌండ్లలో కూడ టీఆర్ఎస్ మెజారిటీ సాధించింది.
TelanganaNov 10, 2020, 11:47 AM IST
దుబ్బాక బైపోల్: స్వగ్రామంలో ఆధిక్యతను నిలుపుకున్న బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు
బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు స్వగ్రామం దుబ్బాక మండలంలోని బొప్పాపూర్. ఈ గ్రామంలో రఘునందన్ రావుకు 424 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి సోలిపేట సుజాతకు 147 ఓట్లు వచ్చాయి. రఘునందన్ రావుకు తన సమీప ప్రత్యర్ధి సుజాత కంటే 277 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.
TelanganaNov 10, 2020, 10:56 AM IST
దుబ్బాక ఫలితం: కత్తి కార్తిక ఓట్లు దిగదుడుపే, నామమాత్రం ఓట్లు
యాంకర్ కత్తి కార్తిక దుబ్బాక శాసనసభ ఉప ఎన్నికలో ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. ఆమె పోటీ నామమాత్రంగానే మిగిలే అవకాశాలున్నాయి. ఏ రౌండులోనూ రెండంకెల ఓట్లను సాధించలేదు.
TelanganaNov 10, 2020, 10:52 AM IST
దుబ్బాక బైపోల్: ఆధిక్యంలో బీజేపీ,గ్రామీణ ఓటర్లపైనే టీఆర్ఎస్ ఆశలు
ఈ నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉన్నాయి. పట్టణ ప్రాంతాల ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్టుగా ఫలితాలను చూస్తే అభిప్రాయంతో ఉంది.మొదటి రౌండ్ నుండి నాలుగు రౌండ్ల వరకు బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు ఆధిక్యంలో ఉన్నారు.
TelanganaNov 10, 2020, 10:18 AM IST
దుబ్బాక ఫలితం: టీఆర్ఎస్ ఎంపీ స్వగ్రామంలో బిజెపి పాగా
దుబ్బాక శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. టీఆర్ఎస్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి స్వగ్రామంలో కూడా బిజెపికి ఆధిక్యత లభించింది.
TelanganaNov 10, 2020, 7:45 AM IST
దుబ్బాక ఉప ఎన్నిక: టీఆర్ఎస్ కు షాక్, అంతిమ విజయం బిెజెపిదే
దుబ్బాక అసెంబ్లీ స్జానానికి జరిగిన ఉప ఎన్నికలో అనూహ్యంగా బిజెపి విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు.