Saha
(Search results - 98)CricketJan 12, 2021, 10:31 AM IST
నెట్స్‌లో గాయపడ్డ మయాంక్ అగర్వాల్... ఇంకా ఆడడానికి ప్లేయర్లు ఉన్నారా?
ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ కోసం 18 మంది ప్లేయర్లను ఎంపిక చేసింది బీసీసీఐ. వీరితో పాటు నెట్ బౌలర్లుగా మరో ముగ్గురు బౌలర్లు రిజర్వు చేసుకుంది. అయితే మూడో టెస్టు ముగిసేసరికి టెస్టు సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఆరుగురు గాయాలతో తప్పుకున్నారు. మొదటి టెస్టులో షమీ, రెండో టెస్టులో ఉమేశ్ యాదవ్... మూడో టెస్టులో రవీంద్ర జడేజా, హనుమ విహారి, జస్ప్రిత్ బుమ్రా గాయాలతో నాలుగో టెస్టుకి దూరమయ్యారు. మంచి ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్ నెట్స్‌లో గాయపడి, సిరీస్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్ కూడా నెట్స్‌లో ప్రాక్టీస్ చూస్తూ గాయపడ్డాడట.
CricketJan 9, 2021, 12:51 PM IST
ముగిసిన మూడో రోజు ఆట... భారీ ఆధిక్యంలో ఆస్ట్రేలియా... టీమిండియాకు కష్టమే...
సిడ్నీ టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా పట్టు బిగించింది. మూడో రోజు భారత జట్టును మొదటి ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 103 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. మొదటి ఇన్నింగ్స్‌లో దక్కిన 94 పరుగుల లీడ్‌తో కలిపి ప్రస్తుతం ఆసీస్ ఆధిక్యం 197 పరుగులు.
CricketJan 9, 2021, 10:06 AM IST
స్కానింగ్‌కి రిషబ్ పంత్... రెండో ఇన్నింగ్స్‌లో కీపింగ్ చేయనున్న వృద్ధిమాన్ సాహా...
తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తూ గాయపడిన యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్... రెండో ఇన్నింగ్స్‌లో బరిలో దిగడం లేదు. పంత్ అయిన గాయం తీవ్రత తెలుసుకునేందుకు డాక్టర్‌తో కలిసి స్కానింగ్‌కి పంపించింది టీమిండియా మేనేజ్మెంట్.
businessDec 25, 2020, 1:56 PM IST
బ్యాంక్ కస్టమర్లకు ముఖ్య గమనిక, మరో రెండు బ్యాంకుల లైసెన్స్‌ను రద్దు చేసిన ఆర్బిఐ..
ఆర్బిఐ మహారాష్ట్రలోని బ్యాంకుల లైసెన్స్‌లను రద్దు చేసింది, అందులో ఒకటి కొల్హాపూర్‌లోని సుభద్ర లోకల్ ఏరియా బ్యాంక్. అయితే బ్యాంకింగ్ రంగ రెగ్యులేటరి ఈ బ్యాంక్ పనిచేస్తున్న విధానం ప్రస్తుత, భవిష్యత్ డిపాజిటర్ల ప్రయోజనాలకు హాని కలిగిస్తుందని, అది ఈ నిర్ణయానికి దారితీసిందని తెలిపింది.
CricketDec 24, 2020, 6:40 PM IST
ఇక్కడ సాహా... అక్కడైతే పంత్... టీమిండియాకి ఇదే బెస్ట్ ఆప్షన్... ఎమ్మెస్కే ప్రసాద్...
మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి వికెట్ కీపర్ ప్లేస్ కోసం పోటీపడుతున్నారు వృద్ధిమాన్ సాహా, రిషబ్ పంత్. పొట్టి ఫార్మాట్లో వికెట్ కీపర్ రేసులో రిషబ్ పంత్‌తో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వంటివాళ్లు పోటీపడుతున్నా, టెస్టుల్లో మాత్రం వృద్ధిమాన్ సాహా ఒక్కడే అతనికి గట్టి పోటీదారుగా నిలిచాడు. టెస్టుల్లో మెరుగైన రికార్డు ఉన్నప్పటికీ, వన్డే, టీ20 ఫార్మాట్లో ఫెయిల్ అవుతుండడంతో మొదటి టెస్టులో పంత్కి తుదిజట్టులో చోటు దక్కలేదు.
CricketDec 23, 2020, 12:35 PM IST
రిషబ్ పంత్కి కీపింగ్ రాదు, సాహాకి బ్యాటింగ్ రాదు... ఇద్దరూ సరిపోయారు...
టీమిండియా టెస్టు వికెట్ కీపర్ కోసం యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా మధ్య చాలారోజులుగా పోటీ నెలకొని ఉంది. తొలి టెస్టులో సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి అవకాశం ఇచ్చాడు భారత సారథి విరాట్ కోహ్లీ. వికెట్ కీపింగ్‌లో తన రేంజ్లో సత్తా చాటిన వృద్ధిమాన్ సాహా, బ్యాటింగ్‌లో మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. దీంతో సాహా, పంత్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా.
Andhra PradeshDec 22, 2020, 6:07 PM IST
ఎన్నాళ్లో వేచిన ఉదయం: ఐఏఎస్ శ్రీలక్ష్మీకి పోస్టింగ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసుల్లో బాగా వినిపించిన పేరు ఐఏఎస్ శ్రీ లక్ష్మి. చిన్న వయసులోనే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ఎంపికై.. జగన్ అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుని కెరీర్‌ని పణంగా పెట్టారు.
CricketDec 18, 2020, 10:08 AM IST
INDvsAUS: స్వల్ప స్కోరుకే టీమిండియా ఆలౌట్... 11 పరుగులకే నాలుగు వికెట్లు...
11 పరుగులు, 23 నిమిషాలు... నాలుగు వికెట్లు...233/6 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా... కేవలం 11 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆదుకుంటాడని భావించిన వికెట్ కీపర్ వృద్ధిమాన్
CricketDec 15, 2020, 2:15 PM IST
ఓపెనింగ్ కోసం నలుగురు, స్పిన్నర్ కోసం ఇద్దరు, కీపింగ్ కోసం ఇద్దరు... భారత జట్టులో తీవ్రమైన పోటీ...
మొదటి రెండు వన్డేలు ఓడినా, ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి జోష్ నింపుకుంది టీమిండియా. రెండు ప్రాక్టీస్ మ్యాచుల్లో భారత బ్యాట్స్‌మెన్ రాణించారు. ఒక్క పృథ్వీషా మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్, బౌలర్లు సమిష్టగా రాణించారు. దీంతో మొదటి టెస్టుకి ముందు తుది జట్టులో స్థానం కోసం ఆటగాళ్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది...
CricketDec 14, 2020, 11:04 AM IST
రిషబ్ పంత్ ఆడుతుంటే ఆడమ్ గిల్‌క్రిస్ట్‌లా అనిపించాడు... అయినా వృద్ధిమాన్ సాహానే ఆడించాలి...
భారత జట్టులో బుల్లెట్లా దూసుకొచ్చిన వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఆసీస్ పర్యటనలో ఆస్ట్రేలియన్లనే సెడ్జింగ్ చేసి భయపెట్టిన పంత్... మహేంద్ర సింగ్ ధోనీకి సరైన రిప్లేస్‌మెంట్‌గా కనిపించాడు. అయితే తన స్థానాని ఢోకా లేదనే ధీమానో, లేక స్వతాహాగా ఉన్న బద్ధకమో తెలీదు కానీ పంత్ నుంచి సరైన ఇన్నింగ్స్ వచ్చి చాలా కాలమే అయ్యింది. అయితే రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌లో తన పవర్ చూపించాడు రిషబ్ పంత్.
businessDec 9, 2020, 2:34 PM IST
ఇండియాలో మరొక బ్యాంక్ మూసివేత.. వినియోగదారుల డిపాజిట్లపై ఆర్బిఐ క్లారిటి..
జనతా సహకారి బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ (ఆర్బిఐ) రద్దు చేసింది. బ్యాంకుకు తగినంత ఫైనాన్స్ లేదని పేర్కొంటూ బ్యాంకింగ్ వ్యాపారాన్ని నిర్వహించకుండ నిరోధించింది. ఇకపై బ్యాంకుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు చేయలేరు.
CricketDec 8, 2020, 4:10 PM IST
పంత్ పనైపోయింది... అలా చేయకపోతే అతని కెరీర్ ముగిసినట్టే.. . ఆకాశ్ చోప్రా కామెంట్స్
భారత జట్టులోకి ఓ సంచలనంలా దూసుకొచ్చాడు రిషబ్ పంత్. సీనియర్ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ఆలోచనలు చేసిన తర్వాత మాహీ ప్లేస్‌ను భర్తీ చేసే బెస్ట్ ఆప్షన్‌గా పంత్‌వైపే చూశారు సెలక్టర్లు. అయితే ఎన్ని అవకాశాలు ఇచ్చినా నిర్లక్ష్యపు ఆటతీరుతో జట్టులో స్థానం కోల్పోయాడు రిషబ్ పంత్. ఆసీస్ టూర్లో వన్డే, టీ20లకు ఎంపిక కాని రిషబ్ పంత్ కేవలం టెస్టు జట్టులో స్థానం దక్కించుకున్నాడు. సాహా ఉండడంతో పంత్ ఆడడం కష్టమే.
CricketDec 8, 2020, 1:56 PM IST
INDAvsAUSA: ఆదుకున్న వృద్ధిమాన్ సాహా... ఆస్ట్రేలియా ఏతో ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా...
ఆస్ట్రేలియా టూర్లో విరాట్ కోహ్లీ లేకపోతే భారత జట్టు ఎలా ఆడుతుందో కళ్లకు కట్టినట్టు చూపించింది ఆస్ట్రేలియా ఏ, భారత్ ఏ మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్. కెఎల్ రాహుల్, బుమ్రా, రిషబ్ పంత్ వంటి ఒకరిద్దరు మినహా టెస్టు జట్టులోని సభ్యులందరూ ఆడిన ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరుకి మరో 20 పరుగులు జోడించి మొదటి ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేసింది ఆసీస్. మూడో రోజు టీమిండియా బ్యాట్స్‌మెన్ కుప్పకూలడం విశేషం.
CricketDec 7, 2020, 6:43 PM IST
సంజూ శాంసన్ ఫెయిల్, పంత్‌ను ఆడించండి... ఢిల్లీ క్యాపిటల్స్ యజమాని కామెంట్...
భారత జట్టులో ఎన్ని అవకాశాలు ఇచ్చినా వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చాడు యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్. మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నప్పుడే పంత్కి భారీగా అవకాశాలు ఇచ్చింది టీమిండియా. అయితే ఒకటి రెండు మ్యాచుల్లో తప్ప మిగిలిన మ్యాచుల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు పంత్. నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్లు సమర్పించుకున్నాడు. ఇప్పుడు సంజూ శాంసన్‌ది కూడా అదే ధోరణి.
CricketDec 6, 2020, 1:57 PM IST
IND A vs AUS A: అజింకా రహానే అజేయ శతకం... పూజారా హాఫ్ సెంచరీ... యంగ్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్...
టెస్టు సిరీస్ ఆరంభానికి ముందే విరాట్ కోహ్లీ లేకుంటే భారత జట్టు బలమెంతో నిరూపించేలా సాగుతోంది ఆస్ట్రేలియా ఏ జట్టుతో టీమిండియా ఏ ప్రాక్టీస్ మ్యాచ్. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఏ జట్టు మొదటి రోజు ఆట ముగిసేసమయానికి 8 వికెట్లు కోల్పోయి 237 పరుగులు చేసింది. కెప్టెన్ అజింకా రహానే సెంచరీతో అజేయంగా బ్యాటింగ్ చేస్తుండగా టెస్టు స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్ ఛతేశ్వర్ పూజారా హాఫ్ సెంచరీతో రాణించాడు.