Recession  

(Search results - 22)
 • industry

  business12, Oct 2019, 1:34 PM IST

  ముంచుకొస్తున్న ముప్పు.. అంతటా స్తబ్దత

  ఇది క్లియర్.. పారిశ్రామిక రంగం పడకేసింది. ఆర్థిక మందకోడి పరిస్థితులు దేశ పారిశ్రామిక రంగ ప్రగతిని నిలిపేశాయని ఎన్ఎస్ఓ విడుదల చేసిన ఆగస్టు ఐఐపీ సూచీ గణాంకాలు చెబుతున్నాయి. -1.1 శాతం వ్రుద్దిరేటు మాత్రమే నమోదు కావడం ఏడేళ్లలో అత్యంత పేలవం.

 • imf

  business10, Oct 2019, 12:58 PM IST

  ఈసారి రిసెషన్ ఎఫెక్ట్ ఇండియాకే.. తేల్చి చెప్పిన ఐఎంఎఫ్ నూతన చీఫ్

  ఈ దఫా ఆర్థిక మాంద్యం ప్రభావం భారతదేశంపైనే ఎక్కువగా ఉంటుందని ఐఎంఎఫ్ నూతన అధిపతి క్రిస్టాలినా జార్జివా పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఆర్థిక స్థిరత్వం వైపు చర్యలు చేపట్టాలని సూచించారు.

 • hsbc

  business7, Oct 2019, 12:58 PM IST

  హెచ్ఎస్‌బీసీలో 10 వేల ఉద్యోగాలు హాంఫట్!

  ఆర్థిక మాంద్యం నేపథ్యంలో అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ హెచ్ఎస్‌బీసీ త్వరలో 10 వేల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపనున్నది. ఉన్నతస్థాయి ఉద్యోగులపైనే ఈ వేటు పడుతుందని సమాచారం.

 • ఇప్పటికైనా ఆర్ధిక పరిస్థితి మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. బ్యాంకులన్నింటినీ వారి వారి వడ్డీ రేట్లను తగ్గించేలా ప్రోత్సహించాలి. ఆలా ప్రోత్సహించినప్పుడు మాత్రమే ప్రజలు రుణాలుగా డబ్బును తీసుకొని ఖర్చు పెడతారు. అప్పుడు ఆర్థికంగా వృద్ధి జరుగుతుంది. ఆర్బీఐ తమ వడ్డీ రేట్లను తగ్గించినా బ్యాంకులు తగ్గించకపోతే, ఏదైతే ఆర్ధిక వృద్ధి కోసం ఆర్బీఐ ఈ చర్యలను తీసుకుందో అవన్నీ బూడిదలో పోసిన పన్నీరే.
  Video Icon

  NATIONAL4, Oct 2019, 4:51 PM IST

  మరోమారు ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపు: ఆర్ధిక వ్యవస్థ దూసుకెళ్లేనా? (వీడియో)

  ఈ సంవత్సరం ఇప్పటికే 4సార్లు వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్బీఐ రేపు శుక్రవారం నాడు మరోమారు వడ్డీ రేట్లను తగ్గించింది. గతసారి 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ ఒక రకంగా అందరిని ఆశ్చర్యపరిచింది. 20 నుంచి 40 బేసిస్ పాయింట్స్ మధ్య తగ్గిస్తుందని అందరూ భావించారు. అనుకున్నట్టుగానే, 25 బేసిస్ పాయింట్లమేర తగ్గించింది.   దేశ ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వచ్చినప్పటినుండి ఇలా వడ్డీ రేట్లను తగ్గిస్తూనే ఉంది.

 • RBI asked to Banks to cut interest rate after reduced repo rate

  business3, Oct 2019, 3:14 PM IST

  మరోమారు వడ్డీ రేట్లను తగ్గించనున్న ఆర్బీఐ: ఆర్ధిక వ్యవస్థ గాడిన పడేనా?

  గతసారి 35 బేసిస్ పాయింట్ల మేర తగ్గించిన ఆర్బీఐ ఒక రకంగా అందరిని ఆశ్చర్యపరిచింది. దానితో ఈసారి ఎంతమేర తగ్గిస్తుందో కరెక్ట్ గా ఊహించడం కష్టమవుతుంది. కానీ 20 నుంచి 40 బేసిస్ పాయింట్స్ మధ్య తగ్గిస్తుందనేది మాత్రం ఖచ్చితం

 • INTERNATIONAL21, Sep 2019, 4:28 PM IST

  కాదేది మాంద్యానికి అనర్హం: ఆ దేశంలో కండోమ్లు  కొనడానికి బెదురుతున్న ప్రజలు

  మాంద్యం దెబ్బకు కండోమ్ల అమ్మకాలు 8శాతం మేర పడిపోయాయని అర్జెంటీనా వ్యాపారవర్గాలు గగ్గోలుపెడుతున్నాయి. గర్భనిరోధక మాత్రల అమ్మకాలు కూడా 6శాతం పడిపోయాయట. దీనికి కారణం ఆర్ధిక మాంద్యమేనని వారు వాపోతున్నారు. 

 • hero

  Automobile17, Sep 2019, 3:14 PM IST

  మాంద్యం ఎఫెక్టే: 40 ఏళ్లు దాటిన ఉద్యోగులకు హీరో ‘వీఆర్ఎస్’

  ప్రముఖ దేశీయ మోటారు సైకిళ్ల తయారీ సంస్థ ‘హీరో మోటో కార్ప్స్’ తన సంస్థలో పని చేస్తున్న ఉద్యోగుల్లో 40 ఏళ్లు దాటిన వారికి, వరుసగా ఐదేళ్లకు పైగా పనిచేస్తున్న వారికి వీఆర్ఎస్ ఇవ్వ సంకల్పించింది. వారి రిటైర్మెంట్ సమయాన్ని లెక్క గట్టి మరీ భారీ మొత్తంలో పరిహారం అందజేయనున్నది. ఉద్యోగులకు, వారి పిల్లలకు భవిష్యత్‌లో రకరకాల ఆఫర్లు అందజేస్తున్నది.

 • it jobs

  business16, Sep 2019, 3:01 PM IST

  మార్కెట్లపై చమురు మంటలు.. సెన్సెక్స్ 213 డౌన్

  సౌదీలో ఆరామ్ కో సంస్థపై డ్రోన్ దాడుల ప్రభావం జాతీయ, అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లపై గణనీయంగానే ఉంది. సెన్సెక్స్ 213 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ కూడా డౌన్ లోనే సాగుతోంది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ డాలర్ పై 71.42 వద్దకు చేరింది. 

 • car

  News13, Sep 2019, 10:54 AM IST

  పల్లెటూళ్ల బాటలో కార్ల సంస్థలు.. సేల్స్ పెంపు వ్యూహం

   విక్రయాలు పడిపోయి... ఆపసోపాలు పడుతున్న వాహన కంపెనీలకు వరుణుడు కరుణ చూపాడు. ఈ ఏడాది వర్షాలు కాస్త లేటైనా దండిగానే కురవడంతో ఇప్పుడు ఆటోమొబైల్‌ దిగ్గజాలు ‘వర్షా’తిరేకాన్ని వ్యక్తం చేస్తున్నాయి

 • gold

  business10, Sep 2019, 2:00 PM IST

  మాంద్యం మామూలుగా లేదు.. ఆభరణాల పరిశ్రమలోనూ ఉద్యోగాల కోతే?

  ఆర్థిక మాంద్యం ప్రభావంతో దేశీయంగా స్వర్ణకారులకు ఉపాధి దూరం కావచ్చునని దేశీయ గోల్డ్ అండ్ జ్యువెల్లరీ కౌన్సిల్ (జీజేసీ) సంకేతాలిచ్చింది. దేశీయ ఎగుమతుల్లో భారత ఎగుమతుల్లో జెమ్స్‌ అండ్‌ జువెలరీ రంగం వాటా 970 కోట్ల డాలర్లు కాగా, ఈ ఏడాది ఏప్రిల్‌-జూలైలో దేశ జెమ్స్‌ అండ్‌ జువెల్లరీ ఎగుమతులు వార్షిక ప్రాతిపదికన 8.5 శాతం తగ్గాయి.

 • Car sales

  News10, Sep 2019, 11:21 AM IST

  మాంద్యం గుప్పిట్లో ‘ఆటో’ విలవిల.. వరుసగా పదో నెలా నేల చూపులే!

  దేశీయ ఆటోమొబైల్ రంగం ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఆగస్టు నెలలోనూ ఆగస్టులోనూ వాహన విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా 23.55 శాతం క్షీణత నమోదైంది. గతేడాదితో పోల్చితే తగ్గిన 5.61 లక్షల యూనిట్ల అమ్మకాలు సాగాయి.
   

 • nirmala sitaraman

  business8, Sep 2019, 2:05 PM IST

  ఇన్‌ఫ్రా ప్రాజెక్టులే టార్గెట్.. రూ.100 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌పై ఫోకస్

  దేశంలో ఆర్ధిక మాంద్యం ప్రభావాన్ని తగ్గించేందుకు మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణంపై ద్రుష్టి పెట్టాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడంతోపాటు 2024-25 నాటికి దేశ ఆర్ధిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు చేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

 • maruti

  cars5, Sep 2019, 11:25 AM IST

  మారుతి ‘బ్రేక్’లు: 2 రోజుల ఉత్పత్తి స్టాప్.. ముందంతా గడ్డు కాలమే.. సియామ్

  అమ్మకాల్లేక మారుతి సుజుకి తన రెండు ప్లాంట్లలో రెండు రోజుల పాటు ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మున్ముందు ఆటోమొబైల్ రంగానికి గడ్డు కాలమేనని సియామ్ అధ్యక్షుడు రాజన్ వధేరా పేర్కొన్నారు. విక్రయాలు తగ్గడంతో మున్ముందు మారుతి సుజుకిలో మరి కొంత మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి రావచ్చునన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 • Nirmala raman

  Automobile2, Sep 2019, 12:12 PM IST

  మాంద్యం ఎఫెక్ట్.. 18 ఏళ్ల నాటికి వెహికల్ సేల్స్.. పరిశీలనలో జీఎస్టీ కోత?


  ఆటోమొబైల్ విక్రయాల్లో మరో నెల ప్రతికూల వ్రుద్ధిరేటు నమోదైంది. 2001 తర్వాత అతి తక్కువ సేల్స్ రికార్డు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఆటోమొబైల్ రంగాన్ని బయటపడవేసేందుకు జీఎస్టీని తగ్గించే అంశం పరిశీలనలో ఉందని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంపైనే అత్యధికంగా 28 శాతం జీఎస్టీ అమలులో ఉంది.

 • Diamond

  business30, Aug 2019, 11:58 AM IST

  అంపశయ్యపై డైమండ్ ఇండస్ట్రీ.. ఇదీ మాంద్యం ఎఫెక్ట్

  దశాబ్ద కాలంలోనే రెండోసారి ఆర్థిక మాంద్యం తలెత్తడంతో భారతదేశంలో వజ్రాల పరిశ్రమ విలవిల్లాడుతోంది. పూర్తిగా అంపశయ్యపై చిక్కుకున్నది.