Rangareddy  

(Search results - 50)
 • accident

  Telangana11, Oct 2019, 3:11 PM IST

  షాద్‌నగర్‌లో ఘోర రోడ్డుప్రమాదం: 20 అడుగులు ఎగిరి పొలాల్లో పడ్డ మృతదేహం

  రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుంచి అనంతపురం వెళుతున్న ఓ కారు షాద్‌నగర్ సమీపంలో మరో కారును ఓవర్‌టేక్ చేయబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. అయితే ఆ సమయంలో మితిమిరిన వేగంలో ఉండటంతో పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనే ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది. 

 • Shadnagar
  Video Icon

  Telangana24, Sep 2019, 4:51 PM IST

  షాద్ నగర్ లో మిషన్ భగీరథ విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ (వీడియో)

  మిషన్ భగీరథ విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ లో భాగంగా తెలంగాణ అన్ని జిల్లాల నుంచి వచ్చిన V&QC సిబ్బంది మంగళవారం ఉదయం అన్నారం, ఇప్పలపల్లి, గుట్టల గడ్డ తండాలో క్షేత్ర స్థాయి పర్యటన- మిషన్ భగీరథ పనుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు. మధ్యాహ్నం కమ్మదనం నీటి శుద్ధి కేంద్రంలో వర్క్ షాప్ జరిగింది. దీంట్లో ENC కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు jyaneshwar, చీఫ్ ఇంజినీర్లు విజయ్ పాల్ రెడ్డి, చిన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 • Mission Bhagiratha1
  Video Icon

  Telangana24, Sep 2019, 2:09 PM IST

  మిషన్ భగీరథ రాష్ట్రస్థాయి వర్క్ షాప్ (వీడియో)

  మంగళవారం షాద్ నగర్ లో మిషన్ భగీరథ విజిలెన్స్, క్వాలిటీ కంట్రోల్ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ జరిగింది. తెలంగాణ అన్ని జిల్లాల నుంచి వచ్చిన V&QC సిబ్బంది అన్నారం, ఇప్పలపల్లి, గుట్టల గడ్డ తండా లో క్షేత్ర స్థాయి పర్యటన- మిషన్ భగీరథ పనుల నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు.

 • Mission Bhagiratha
  Video Icon

  Telangana24, Sep 2019, 12:15 PM IST

  నీటి కష్టాలు తీర్చిన మిషన్ భగీరథ (వీడియో)

  రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో మిషన్ భగీరథ మీద ప్రజాప్రతినిధుల అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సు అధికారులతో పాటు గ్రామప్రజలు పాల్గొన్నారు. కెసీఆర్ ప్రభుత్వం వచ్చిన తరువాత తమ నీటి కష్టాలు తీరాయని గ్రామస్తులు తెలిపారు. ఇంతకు ముందు మంచినీటికోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్లమని ఇప్పుడా కష్టాలు గట్టెక్కాయని సంతోషం వ్యక్తం చేశారు.

 • revanth

  Telangana1, Sep 2019, 10:20 AM IST

  పొలిటికల్ రివ్యూ: ఈటల కలకలం,రేవంత్ సంచలనం

  తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. టీఆర్ఎస్‌లో అంతర్గతంగా ఏదో జరుగుతోందనే వాదనలనకు ఊతం చేకూరేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు

 • kcr

  Telangana29, Aug 2019, 4:56 PM IST

  కాళేశ్వరాన్ని ఇంతమంది మెచ్చుకుంటుంటే.. కొందరు ఒర్వలేకపోతున్నారు: కేసీఆర్

  ఇరుగు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర జల సంఘం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రశంసిస్తుంటే కొంతమంది సన్నాసులు అవాకులు చవాకులు పేలుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. 13 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్‌సభ సీట్లు, ఐదు జిల్లా పరిషత్‌లను టీఆర్ఎస్‌కు కట్టబెట్టి పాలమూరు ప్రజలు తమను గుండెల్లో పెట్టుకున్నారని.. వారి రుణం తీర్చుకుంటామని సీఎం తెలిపారు

 • గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు పరిస్థితి భిన్నంగా ఉండేది. కేసీఆర్ చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు ప్రజల ఆమోదం పొందుతూ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కేసీఆర్ పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతూ వచ్చింది. చంద్రబాబు కన్నా కేసీఆర్ బెట్టర్ అని అనుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.

  Telangana29, Aug 2019, 4:27 PM IST

  కృష్ణా-గోదావరి నదుల అనుసంధానంపై ఆ మాటలెందీ: బాబుపై కేసీఆర్ వ్యాఖ్యలు

  ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల అసమర్థ విధానాల కారణంగా తెలంగాణకు నష్టం జరిగిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా-గోదావరి నదీ జలాలపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు సరికాదన్నారు. 2003లోనే తాను ఆయనకు ఈ విషయంపై అసెంబ్లీ సాక్షిగా చెప్పానని కేసీఆర్ గుర్తు చేశారు.

 • కర్ణాటక రాజకీయాలను తెలంగాణలో చేయాలంటే బిజెపి టీఆర్ఎస్ ను నిట్టనిలువునా చీల్చాల్సి ఉంటుంది. అయితే, కొంత మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో, ఎంపీలతో బిజెపి ఢిల్లీ నాయకులు మాట్లాడుతున్నారని టీఆర్ఎస్ నాయకులు కూడా చెబుతున్నారు. కాంగ్రెసు నేతలతో కూడా వారు మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలోనే కేసీఆర్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తూ వస్తున్నారనే ప్రచారం సాగుతోంది.

  Telangana29, Aug 2019, 3:03 PM IST

  ఉదయం బిల్లులు పెట్టండి.. సాయంత్రానికి క్లియర్ చేస్తా: కాంట్రాక్టర్లకు కేసీఆర్ వరాలు

  ఇక నుంచి కాంట్రాక్టర్లకు బిల్లుల చింతలేదన్నారు. ఉదయం బిల్లులు పెడితే.. సాయంత్రానికి వాటిని క్లియర్ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. సిబ్బందిని పెంచుకుని.. కాంట్రాక్టరులు పనులు వేగంగా పూర్తిచేయాలని సూచించారు

 • Srinivas Goud

  Telangana28, Aug 2019, 5:39 PM IST

  రేపు పాలమూరుకు సీఎం కేసీఆర్: ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రులు

  కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికావడంతో సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్షేత్రస్థాయి పనులను సీఎం కేసీఆర్ పరిశీలించి పనుల పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారని స్పష్టం చేశారు.  

 • Telangana27, Aug 2019, 4:48 PM IST

  విమర్శిస్తే మన్నించండి... కానీ నీళ్లివ్వండి: కేసీఆర్ కు మాజీ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అభ్యర్థన

  కేసీఆర్ తన సొంత ప్రాంతంలో ఎకరానికి రూ.లక్ష ఖర్చు చేసి నీళ్లు ఇస్తున్నారని తాము కూడా తెలంగాణలో ఉన్నాం అని గుర్తు చేశారు. రంగారెడ్డి జిల్లా తెలంగాణలోనే ఉందని తమకు సాగునీరు ఇవ్వాలని కోరారు. లక్ష్మీదేవిపల్లి జలాశయం నిర్మిస్తామని చెప్పి మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. 

 • goat

  Telangana24, Aug 2019, 8:14 PM IST

  మెుక్కను తిన్న మేక, రూ.500ఫైన్ వేసిన అధికారులు: రంగారెడ్డిలో ఆసక్తికర ఘటన

  ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా  నాటిన మేకకు రూ.500 జరిమానా విధించారు అధికారులు. మేకకు ఫైన్ వేయడంతో జరిమానా కట్టింది యజమానురాలు. ఫైన్ కడుతూ మేక ఎంత పనిచేశావే అంటూ కంటతడిపెట్టింది.

 • baby general

  Telangana3, Jul 2019, 9:11 AM IST

  రంగారెడ్డి జిల్లాలో శిశు విక్రయం, అడ్డుకున్న పోలీసులు

  రంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. కన్నబిడ్డను విక్రయానికి పెట్టిందో జంట. ఎల్లమ్మ తండాకు చెందిన  దంపతులు.. పోలీసులకు దొరికిపోయారు

 • suicide

  Telangana28, May 2019, 2:53 PM IST

  ఎమ్మార్వో కార్యాలయం ఎదుటే మహిళా రైతు ఆత్మహత్యాయత్నం...(వీడియో)

  తన భూమికి సంబంధించిన పట్టాపాస్ బుక్ కోసం ఓ మహిళా రైతు ఏకంగా రెవెన్యూ  కార్యాలయం ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గతకొంతకాలంగా కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా తన భూమి పత్రాలను అందించడం లేదంటూ బాధిత మహిళ ఆరోపించారు. తమ కుటుంబానికి జీవనాధారమైన ఆ భూమి కోల్పోతే కుటుంబం మొత్తం రోడ్డున పడుతుందని...అది చూసేకన్నా చనిపోవడమే మేలని భావించి బలవన్మరణానికి పాల్పడినట్లు మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 

 • nowhera shaikh

  Telangana29, Jan 2019, 2:03 PM IST

  నౌహీరా షేక్‌‌కు రిమాండ్ విధించిన రంగారెడ్డి కోర్టు

   నౌహీరా షేక్‌ను  సైబరాబాద్ పోలీసులు మంగళవారం నాడు రంగారెడ్డి  జిల్లా కోర్టులో హాజరుపర్చారు. నౌహీరాకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్ విధిస్తూ కోర్టు మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

   

 • rape

  Telangana9, Jan 2019, 2:16 PM IST

  మైనర్ బాలికపై గ్యాంగ్‌రేప్...హైదరాబాద్ శివారులో దారుణం

  రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇటుక బట్టీలో పనిచేసే ఓ 14 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే గ్రామ పెద్దలు ఈ బాలిక శీలానికి వెలకట్టి నిందితులను కాపాడే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నాలను అడ్డుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు.