Ram Madhav  

(Search results - 40)
 • అయితే ఈ ప్రచారాన్ని కేశవ్ ఖండించారు. కేశవ్ కు అసెంబ్లీ వ్యవహరాలపై పట్టు ఉన్న కారణంగానే ఆయనకు ఈ పదవిని కట్టబెట్టారని పార్టీలో ఓ వర్గం వాదిస్తోంది. అయితే కమ్మ సామాజిక వర్గానికే ఉన్న ఒక్క కేబినెట్ ర్యాంకు పోస్టును కేటాయించడంపై కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారని అంటున్నారు.

  Andhra Pradesh31, Aug 2019, 6:56 PM IST

  దూకుడు పెంచుదాం, మన టార్గెట్ జగన్-చంద్రబాబు: ఏపీ బీజేపీ కీలక నిర్ణయాలు

  వైసీపీతో బీజేపీ సన్నిహితంగా ఉంటుందన్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు. ఏపీలో టీడీపీ వైసీపీలకు సమదూరం పాటించాలని నిర్ణయం సమావేశంలో తీర్మానించారు. మూడు నెలల్లోనే వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. 

 • jayachandrareddy

  Andhra Pradesh24, Aug 2019, 3:07 PM IST

  చంద్రబాబుకు సొంత జిల్లాలో షాక్: బీజేపీలో చేరిన సన్నిహితుడు


  తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా కూడా పనిచేశారు. సైకం జయచంద్రారెడ్డి సివిల్ సప్లై చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఎన్నికలు రావడం ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి రావడంతో ముచ్చటగా మూడు నెలల్లోనే తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 
   

 • అన్నయ్య చిరంజీవితో గొడవపడి మరి పార్టీ పెట్టిన పవన్ కి ఇలాంటి ఫలితాలు రావడం నిజంగా ఆశ్చర్యమే. చిరంజీవి ఇప్పుడు తమ్ముడితో ఏ విధంగా చర్చ జరిపాడు అనేది మరో సందేహం.

  Andhra Pradesh3, Aug 2019, 10:19 AM IST

  బీజేపీలోకి చిరంజీవి... పవన్ తో డీల్ కుదిరిందా?

  చిరంజీవిని  బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు పావులు కదుపుతున్నారనే వాదనలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా... బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి.

 • మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలతో కూడ బీజేపీ నాయకత్వం చర్చలు జరుపుతోందని ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకొంది.

  Andhra Pradesh24, Jul 2019, 4:49 PM IST

  వైసీపీ వల్ల మేలు కంటే కీడే ఎక్కువ : బీజేపీ నేత రామ్ మాధవ్ సంచలన వ్యాఖ్యలు

  ఏపీ ప్రజలకు మేలు జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ భుజంతో భుజం కలిసి పనిచేసే నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. మరో 25 ఏళ్ల పాటు మోదీయే ప్రధానిగా ఉంటారన్నారు. 

 • అంతేకాదు తాను ఒంగోలు పార్లమెంట్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చెయ్యనున్నట్లు పరోక్షంగా ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించేశారు. ఇకపోతే టీడీపీ సీనియర్ నేత నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

  Andhra Pradesh17, Jul 2019, 9:55 AM IST

  చంద్రబాబుకి కష్టాలు చెప్పుకున్న రాయపాటి.. బీజేపీలోకి జంప్?

  గుంటూరు జిల్లాలో రాయపాటి కుటుంబానికి బలం ఎక్కువే. ఆయన కనుక బీజేపీలో చేరితే... ఆయన మద్దతుదారులంతా బీజేపీలోకి వచ్చి చేరే అవకాశం ఉంది. దాంతో పార్టీని ప్రతిష్టం చేసుకోవచ్చని బీజేపీ యోచిస్తోంది. 

 • ram madhav

  Andhra Pradesh14, Jul 2019, 1:36 PM IST

  ఏపీలో టీడీపీ కనుమరుగు కావడం ఖాయం: రామ్ మాధవ్

   ఏపీలో టీడీపీ కనుమరుగు కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చెప్పారు. తానా సభలకు మాత్రమే టీడీపీ పరిమితం కానుందని ఆయన ఎద్దేవా చేశారు.
   

 • RAM MADHAV

  Andhra Pradesh9, Jul 2019, 7:49 AM IST

  కేకలు వేశారు, రాం మాధవ్ ను అవమానించలేదు: తానా

  మంగళవాయిద్యాలతో రామ్ మాధవ్ కు ఘనస్వాగతం పలికి, వేదికపై ప్రముఖ స్థానం కల్పించామని వేమన సతీష్, డాక్టర్‌ మూల్పూరి వెంకటరావు తెలిపారు. 22వ తానా సభలకు అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రతినిధులను ఆహ్వానించినట్లు వారు తెలిపారు.

 • పోలవరం నిర్వాసితులకు సాయంతో పాటు విజయవాడలో తొలగించిన దేవాలయాలను తిరిగి నిర్మించాలని.. చుక్కల భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కన్నా లేఖలో విజ్ఞప్తి చేశారు. అగ్రిగోల్డ్‌లో అవినీతిపై సీబీఐతో విచారణ చేయించాలని, అలాగే దేవాలయ భూముల పరిరక్షణ చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు.

  Andhra Pradesh8, Jul 2019, 1:59 PM IST

  తానా సభలా..టీడీపీ భజనా సభలా: రామ్‌మాధవ్‌కు అవమానంపై కన్నా ఫైర్

  తానా సభల్లో బీజేపీ నేత రాంమాధవ్‌ను అవమానించడంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ  ఘాటుగా స్పందించారు. అవి తానా సభలు కాదని.. టీడీపీ భజన సభలంటూ సెటైర్లు వేశారు. 

 • bjp muralidhar rao

  Andhra Pradesh8, Jul 2019, 1:02 PM IST

  రామ్ మాధవ్‌తో విభేదాలు: క్లారిటీ ఇచ్చిన మురళీధర్ రావు

  పార్టీ నేత రామ్ మాధవ్‌తో తనకు విబేధాలు ఉన్నాయని సాగుతున్న ప్రచారంపై  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు స్పందించారు. ఈ విషయమై మీడియాలో  తప్పుడు ప్రచారం సాగుతోందన్నారు. తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవన్నారు. 
   

 • RAM MADHAV

  NRI8, Jul 2019, 7:36 AM IST

  తానా సభల్లో బిజెపి నేత రామ్ మాధవ్ కు చేదు అనుభవం

  తానా అధ్యక్షుడు వేమన సతీశ్‌ పద వీ కాలం ముగిసింది. తదుపరి అధ్యక్షుడిగా తెలంగాణలోని ఖమ్మంకు చెందిన తాళ్లూరి జయశేఖర్‌కు బాధ్యత అప్పగించారు. ఈ సభల్లో బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్‌కు చేదు అనుభవం ఎదురైంది.

 • pawan kaluan

  Andhra Pradesh7, Jul 2019, 11:50 AM IST

  బీజేపీతో నాకు శతృత్వం లేదు: రామ్‌మాధవ్‌తో భేటీ తర్వాత పవన్

  బీజేపీతో తనకు వ్యక్తిగత శతృత్వం లేదని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. తానా సభల్లో పాల్గొనేందుకు అమెరికాకు వచ్చిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేత రామ్‌మాధవ్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత  పవన్ కళ్యాణ్  ఓ తెలుగు న్యూస్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 • ఈ నేపథ్యంలో రాయలసీమకు చెందిన పలువురు టీడీపీ నేతలను బీజేపీలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారట రామ్ మాధవ్. అలాగే ఏపీ అసెంబ్లీలో బీజేపీ ప్రాతినిధ్యం సున్నా కావడంతో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని అసెంబ్లీలో బీజేపీ వాయిస్ వినిపించాలని చూస్తున్నారట.

  Andhra Pradesh7, Jul 2019, 11:31 AM IST

  పవన్‌తో రామ్ మాధవ్ భేటీ: ఎవరైనా రావొచ్చు, జనసేనానిపై కీలక వ్యాఖ్యలు

   తమ పార్టీలో చేరి పనిచేయాలనుకొనే వారికి స్వాగతం చెబుతున్నామని బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ స్పష్టం చేశారు. తానా సభల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌తో రామ్ మాధవ్  బేటీ అయ్యారు. ఆ తర్వాత ఆయన  ఓ తెలుగు న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.

 • pawan

  Andhra Pradesh7, Jul 2019, 11:06 AM IST

  పవన్‌తో బీజేపీ నేత రామ్‌మాధవ్ భేటీ: మతలబు ఏమిటి

  జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌తో బీజేపీ అగ్రనేత రామ్‌మాధవ్ అమెరికాలో భేటీ అయ్యారు. తానా సభల్లో పాల్గొనేందుకు వచ్చిన వీరిద్దిరూ అమెరికాలో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. 

 • గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. ఆ సమయంలో ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై ఆయన వివరణ ఇచ్చారు.

  Telangana26, Jun 2019, 10:05 AM IST

  బీజేపీ అధికారంలోకి వస్తే నేనే సీఎం అన్న వ్యాఖ్యలపై కోమటిరెడ్డి క్లారిటీ

  ఈ పరిణామాల నేపథ్యంలో తాను బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అవుతానని ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో వివరణ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే తాను అలా మాట్లాడినట్లు స్పష్టం చేశారు. తన కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే సీఎం అని మాట్లాడినట్టు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

 • 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేశాడు. 2008 ఆగష్టు 26వ తేదీన ప్రజారాజ్యం పార్టీని తిరుపతిలో ప్రకటించారు. 2009 ఎన్నికల సమయంలో దేవేందర్ గౌడ్ నేతృత్వంలోని నవ తెలంగాణ పార్టీ కూడ పీఆర్పీలో విలీనమైంది.

  Andhra Pradesh25, Jun 2019, 5:56 PM IST

  కీలక పదవులు ఇచ్చేందుకు రెడీ: చిరంజీవికి బిజెపి గాలం

  సినీనటుడుగా విశేష ఆదరణ కలిగిన చిరంజీవి కాపు సామాజిక వర్గంలో మంచి పట్టున్న నేత. ఉభయగోదావరి జిల్లాలతోపాటు మెుత్తం 74 నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గం ఓటర్లు గెలుపును నిర్దేశిస్తారు. ఈనేపథ్యంలో కాపు ఓటర్లను ఆకర్షించాలి అంటే చిరంజీవి లాంటి ప్రజాకర్షణ కలిగిన నేతలను పార్టీలోకి చేర్చుకుంటే బాగుంటుందని పార్టీ భావిస్తోంది.