Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Raghuvira Reddy

"
Raghuvira says CM Naidu is antifarmerRaghuvira says CM Naidu is antifarmer

"చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి" -ఎలాగో తెలుసా...

ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు వ్యతిరేకి అన్న విషయం మరోసారి రుజువైందని  ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి అన్నారు.  దీనికి ఆయన చూపిన సాక్ష్యాలివే: 

- సోమవారం రైతు  బాంధవుడు ఆచార్య ఎన్. జి. రంగా గారి జయంతి సందర్భంగా కనీసం నివాళులు అర్పించకపోవడమే ఇందుకు నిదర్శనం.

- విజయవాడలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న సిఎంకు ప్రభుత్వ తరఫున ప్రపంచంలో నే రైతాంగ ఉద్యమపితగా గుర్తింపు పొందిన నేతను స్మరించుకోవాలన్న ధ్యాస లేక పోవడం సిగ్గుచేటుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నదని ఆయన చెప్పారు.

- గుంటూరులోని లాంఫాంలో రంగా గారి విగ్రహానికి మొక్కుబడిగా మంత్రులు,  స్పీకర్ పూలమాలలు వేసి మమ అనిపించారు.

-  1500 కోట్లతో రంగా గారి పేరుతో వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్మిస్తున్నట్లు ఏడాది కాలంగా గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి  నిధులు ఉన్నా ఇప్పటివరకు స్థలం సమకూర్చ లేకపోయారు.

- రైతులకు రుణ మాఫీ చేయలేదు. పంటలు ఎండిపోతే పెట్టుబడి రాయితీ ఇవ్వలేదు. మిగిలిన పంటలు కాపాడుకునేందుకు రైతులకు సాగునీరు అందించలేకపోయారు.

- ఈ ప్రశ్నలకు సమాధానం చెప్ప లేకనే అయన రంగా గారి పేరు  స్మరించడానికి సైతం భయపడ్డట్లుగా ఉంది.

- నాడు వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నేడు వారి భూములను పణంగా పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.

Nov 8, 2016, 8:43 AM IST