Raghuram Rajan  

(Search results - 11)
 • undefined

  business22, May 2020, 10:26 AM

  అందరి చేయూత కావాలి.. అద్భుతమైన ప్యాకేజీ అవసరం: రాజన్

  కరోనా ‘లాక్ డౌన్’ వల్ల తలెత్తిన ఆ    ర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు, పూర్వ వైభవాన్ని సంతరించుకునేందుకు భారీ, మెరుగైన, అద్భుతమైన ఆర్థిక ప్యాకేజీ అవసరం అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. విపక్షాలు, నిపుణుల సాయం తీసుకోవాలని సూచించారు. వలస కార్మికులకు అన్ని విధాల అండగా ఉండేలా వసతులు కల్పించాలని స్పష్టం చేశారు. 

 • undefined

  NATIONAL30, Apr 2020, 1:42 PM

  పేదలకు రూ. 65 వేల కోట్లు అవసరం: రాహుల్‌తో రఘురామ్ రాజన్

  గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో  రఘురామ్ రాజన్ తో వీడియో కాన్పరెన్స్ ద్వారా మాట్లాడారు.సుధీర్ఘకాలం లాక్ డౌన్ భారతదేశ ఆర్ధిక పరిస్థితిని దెబ్బతీసే అవకాశం ఉందన్నారు.
   

 • raghuram rajan fire on modi government

  business9, Dec 2019, 11:37 AM

  గ్రామాల్లో గిరాకీ గోవిందా... మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగిన రాజన్

  మోదీ సర్కార్ అనుసరిస్తున్న విధానాల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ లేనే లేదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ప్రతి అంశంలోనూ ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) జోక్యం చేసుకుంటూ విధాన నిర్ణయాల్లో కేంద్రీకరణ పెంచుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఐదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చి దిద్దాలంటే ఏటా 8-9 శాతం జీడీపీ సాధించాలన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత తేలిక కాదని తేల్చేశారు.

 • niramala

  business1, Nov 2019, 10:05 AM

  రాజన్ రిటార్ట్: మీ హయాంలోనే ఎక్కువ కాలం పనిచేశా.. ‘నిర్మల’మ్మకు ఘాటు రిప్లై

  ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వల్లే ఆర్థిక వ్యవస్థ కునారిల్లిందని విత్తమంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలకు రాజన్ ఘాటుగా సమాధానమిచ్చారు. తాను ఎక్కువ కాలం పని చేసింది మోదీ హయాంలోనేనని గుర్తు చేస్తూనే రాజకీయ చర్చకు చోటివ్వదలుచుకోలేదని స్పష్టం చేశారు.

 • Raghuram Rajan

  business22, Jul 2019, 12:33 PM

  బ్రెగ్జిట్ ఒత్తిళ్లు: ఇంగ్లండ్ బ్యాంక్ గవర్నర్ పోస్ట్‌కు రాజన్ ‘నో’

  ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగనున్న నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ పై ఒత్తిళ్లు తీవ్రంగా ఉంటాయని రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు.

 • Raguram Rajan

  business13, Jun 2019, 12:07 PM

  బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ బరిలో రాజన్!

  325 సంవత్సరాల చరిత్ర గల బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ పదవి కోసం ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పోటీ పడుతున్నారు. ‘బ్రెగ్జిట్’పై బ్రిటన్ విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఆయన ఈ గవర్నర్ పదవి కోసం పోటీ పడుతుండటం గమనార్హం. 

 • raghuram rajan

  business26, Apr 2019, 1:11 PM

  అలా ఐతే నా భార్య నాతో ఉండదు: రఘురామ్ రాజన్ ఆసక్తికరం

  భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే తన భార్య తనను వదిలేస్తుందని చెప్పుకొచ్చారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఆయన ఈ విధంగా స్పందించారు.

 • undefined

  business28, Mar 2019, 12:35 PM

  మహా ఘట్‌బంధన్ గెలిస్తే ‘రాజన్’ఫైనాన్స్ మినిస్టర్ ?


  భారతీయుల్లో కాసింత దేశభక్తి ఎక్కువే. 11 ఏళ్ల క్రితం వచ్చిన ప్రపంచ ఆర్థిక మాంద్యానికి కాయకల్ప చికిత్స చేసేందుకు సూచనలు ఇచ్చిన రఘురామ్ రాజన్ వంటి వారిలో ఒకపాలు ఎక్కువే ఉంటుంది. అందుకే దేశానికి సేవ చేసే అవకాశం కల్పిస్తే మళ్లీ రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మహా ఘట్ బంధన్ అధికారంలోకి వస్తే ఆయన ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక రంగాన్ని మరోమారు సంస్కరణల బాట పట్టించే అవకాశాలు ఉన్నాయి. అయితే దాని గురించి మాట్లాడటం ఇప్పుడు తొందరపాటవుతుందని రాజన్ పేర్కొనడం గమనార్హం. 

 • undefined

  business23, Jan 2019, 10:58 AM

  పీవీ, మన్మోహన్‌లే ఆదర్శం: మోదీ ప్రభుత్వంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

  రోజురోజుకు మారుతున్న పరిణామాల నేపథ్యంలో 28 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని పీవీ నర్సింహారావు, ఆయన హయాంలో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ అమలు చేసిన ఆర్థిక సంస్కరణల విధానమే అందరికీ ఆదర్శం అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. కేంద్రీకరణ విధానాలు కిందిస్థాయిలో పూర్తిగా అమలు కాబోవని స్పష్టం చేశారు. పంట రుణ మాఫీ వల్ల ప్రయోజనం శూన్యమని తేల్చేశారు.