R.k.roja
(Search results - 54)Andhra PradeshDec 14, 2019, 5:06 PM IST
అయేషా మీరా తల్లి వ్యాఖ్యలపై రోజా రియాక్షన్: అండగా ఉన్న నాపై....
అయేషా మీరా ఘటన జరిగినప్పుడు రోజా హడావిడి చేశారని ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంటున్నారని నిలదీశారు. తన కుమార్తె ఘటనలో నిందితులు రోజాకు తెలుసునని అందువల్లే ఆమె మౌనంగా ఉన్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
Andhra PradeshDec 12, 2019, 11:54 AM IST
నన్ను ఎంతలా ఏడిపించావ్: మగధీర సినిమా డైలాగ్ చెప్తూ చంద్రబాబుపై రోజా పంచ్ లు
చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే మగధీర సినిమాలో ఒక డైలాగ్ గుర్తొస్తుందని చెప్పుకొచ్చారు. 151 మందికి తానొక్కడినే సమాధానం చెప్తానంటూ చంద్రబాబు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే రోజా.
Andhra PradeshDec 11, 2019, 1:31 PM IST
రోజా నెక్స్ట్ టార్గెట్ ఆ హీరోనే : ఆయనను చూస్తే కాళ్లు వణుకుతున్నాయంటూ రోజా పంచ్‌లు
తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే నారా లోకేష్ ను టార్గెట్ చేశారు ఎమ్మెల్యే రోజా. అయితే తాజాగా సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణపై కీలక వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే రోజా నెక్స్ట్ టార్గెట్ బాలయ్యేనని అర్థమవుతుంది.
Andhra PradeshDec 10, 2019, 4:48 PM IST
ఎర్రగడ్డ నుంచి లొల్లి చేసేందుకు వచ్చారు: చంద్రబాబును వీధి రౌడీ అన్న రోజా
చంద్రబాబు నాయుడుకు చిన్నమెుదడు చితికిపోయిందని రోజా విమర్శించారు. చంద్రబాబును ఆస్పత్రిలో చూపించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వల్ల అసెంబ్లీలో సమయం వృథా తప్ప ఏమీ లేదని రోజా విమర్శించారు.
Andhra PradeshDec 9, 2019, 1:51 PM IST
రెండు బెత్తం దెబ్బలు చాలన్నవాడు.. అప్పుడు గన్ ఎందుకు పట్టుకొచ్చాడు.. పవన్ పై రోజా
రేప్ చేసిన వారిని ఉరితీయడం ఏంటి రెండు బెత్తం దెబ్బలు చాలు అని పవన్ కళ్యాణ్ అనడంపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఏం జరిగిందని రివాల్వర్ పట్టుకుని రోడ్లపైకి వచ్చారో చెప్పాల్సిన అవసరం ఉందని రోజా నిలదీశారు.
Andhra PradeshNov 22, 2019, 3:19 PM IST
రోజా సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఆ భయంతోనే వాళ్ళ కాళ్లు పట్టుకుని బీజేపీలో చేరాడు
వైసీపీ ప్రభుత్వం యెుక్క సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకే చంద్రబాబు పవన్ కళ్యాణ్ లు ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ల విమర్శలు చూస్తుంటే వారి చిన్నమెదడు చితికినట్లు ఉందంటూ రోజా విరుచుకుపడ్డారు.
Andhra PradeshNov 19, 2019, 3:30 PM IST
ఎమ్మెల్యే రోజా బంపర్ ఆఫర్: జగన్ బర్త్ డే వరకు మాత్రమే......
ఎంత ప్లాస్టిక్ వ్యర్థాలు అందిస్తే అంత బియ్యాన్ని తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమం సీఎం జగన్ పుట్టిన రోజు వరకు కొనసాగుతుందని రోజా ప్రకటించారు. ఇకపోతే నగరి నియోజకవర్గాన్ని హానికర ప్లాస్టిక్ వ్యర్ధాలు లేని స్వచ్ఛ నగరిగా మారుద్దామని అందుకు అంతా కలిసిరావాలని ఆమె పిలుపునిచ్చారు.
Andhra PradeshNov 14, 2019, 2:26 PM IST
మీడియం రగడ: చంద్రబాబు, పవన్ లపై రోజా ఆగ్రహం
చంద్రబాబు నాయుడు పిల్లలు, మనవళ్లు, పవన్ కళ్యాణ్ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవచ్చు కానీ పేద పిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకోకూడదా అని నిలదీశారు. విద్యారంగం బలోపేతం కోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారని తెలిపారు.
Andhra PradeshOct 21, 2019, 4:17 PM IST
సీన్ లోకి రోజా : నవయుగకు కోలుకోలేని దెబ్బ కొట్టిన ఫైర్ బ్రాండ్
ఏపీఐఐసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే రోజా ఈ ఆరోపణలపై ఆరా తీశారు. ఏపీఐఐసీ ఎన్వోసీ లేకుండానే నవయుగ సంస్థ బ్యాంకుల నుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుందని నిర్ధారించడంతో నవయుగకు కేటాయించిన భూ కేటాయింపుల రద్దు చేశారు.
Andhra PradeshOct 10, 2019, 6:25 PM IST
డాక్టర్ అవతారం ఎత్తిన ఎమ్మెల్యే రోజా: వైద్యపరీక్షల కోసం ఎగబడ్డ విద్యార్థులు
వైయస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం పేద ప్రజలకు మరో సంజీవని లాంటిదని కొనియాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి పేద ప్రజలను ఆదుకున్నారని చెప్పుకొచ్చారు.
Andhra PradeshOct 3, 2019, 10:49 AM IST
ఓపెన్ జిమ్ లో వైసీపీ ఎమ్మెల్యే రోజా రచ్చ రచ్చ
ఎమ్మెల్యే రోజా జిమ్ వర్కవుట్ చేస్తున్న సమయంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు విజిల్స్ తో హెరెత్తించారు. అటు రోజా సైతం కార్యకర్తలను ఉత్తేజరుస్తూ మరింతగా జిమ్ చేశారు.
Andhra PradeshSep 21, 2019, 3:27 PM IST
రోజాను ఇండస్ట్రీకి, రాజకీయాలకు పరిచయం చేసిన శివప్రసాద్
రోజాను సినీ రంగానికి పరిచయం చేసింది తానేనని పదేపదే చెప్పుకొచ్చారు. ప్రేమ తపస్సు చిత్రంతో రోజాను ఇండస్ట్రీకి పరిచయం చేసినట్లు ఇటీవలే శివప్రసాద్ స్పష్టం చేశారు. ప్రేమ తపస్సు చిత్రంలో రాజేంద్రప్రసాద్ సరసన రోజాకు అవకాశం ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు.
Andhra PradeshSep 14, 2019, 5:12 PM IST
కోడెల, యరపతినేని లు కీచకులు, బాబూ! పెయిడ్ ఆర్టిస్టుల స్కీమ్ అభాసుపాలే: రోజా వార్నింగ్
పల్నాడు ప్రాంతం అంతా ప్రశాంతంగా ఉంటుంటే దానిపై రాజకీయం చేసేందుకు టీడీపీ శిబిరాల స్కీమ్ ను తెరపైకి తెచ్చిందని మండిపడ్డారు. యరపతినేని శ్రీనివాసరావు, కోడెల శివప్రసాదరావు లాంటి కీచకుల పాలన పోవడంతో అక్కడి ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారంటూ రోజా చెప్పుకొచ్చారు.
Andhra PradeshAug 29, 2019, 9:29 AM IST
శాలువలు-పూలదండలు తీసుకురావొద్దు, ఆ డబ్బుతో విద్యార్థులకు సాయం చేయండి: రోజా
విద్యార్థులకు అవసరమైన విద్యాసామగ్రి అందించే సాయమే తనకు నిజమైన సన్మానమని ఆమె చెప్పుకొచ్చారు. వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం గ్రామాలకు వచ్చినప్పుడు తనను అభినందించడానికి వచ్చేవారు శాలువలు, పూలదండలు తీసుకురావద్దని సూచించారు.
Andhra PradeshAug 26, 2019, 12:39 PM IST
మహిళలంటే అంత చులకనా...? చంద్రబాబు, కోడెలపై రోజా తీవ్ర వ్యాఖ్యలు
కారు షెడ్డులో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలంటూ చేసిన వ్యక్తి స్పీకర్ గా ఉండటం మన దౌర్భాగ్యమన్నారు. చంద్రబాబు అయితే మహిళల పుట్టుకనే నిందిస్తాడని మండిపడ్డారు. కోడలు మగపిల్లాడును కంటానంటే అత్త వద్దంటుందా అంటూ హీనంగా మాట్లాడారని ఆరోపించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్ పేరుతో మహిళలను వ్యభిచార కూపంలోకి నెట్టిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కాపాడారని విమర్శించారు.