Prajasanthiparty  

(Search results - 11)
 • k.a.paul

  Andhra Pradesh7, May 2019, 4:11 PM IST

  రూట్ మార్చిన కేఏపాల్: బాబుకు రిటైర్మెంట్ ఇద్దాం, కలిసి పనిచేద్దామంటూ జగన్ కు విజ్ఞప్తి

  హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ తనకు తెలంగాణ సీఎం కేసీఆర్ కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కానీ శత్రువులు కారన్నారు. చంద్రబాబు నాయుడుకు రిటైర్మెంట్ ఇద్దాం, మనిద్దరం ప్రజల కోసం కలిసి పనిచేద్దామంటూ వైఎస్ జగన్ ను కేఏ పాల్ కోరారు. 

 • k.a.paul

  Telangana29, Apr 2019, 8:13 PM IST

  విద్యార్థులకు న్యాయం జరగకపోతే ఇంటర్ బోర్డు దగ్గర ధర్నా చేస్తా: కేఏ పాల్

  ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోవడంపై పాల్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కో బాధిత కుటుంబానికి  రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. బోర్డు అవకతవకలపై విపక్షాలు చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కేసీఆర్ పూర్తి స్థాయిలో వివరణ ఇస్తే విద్యార్థుల ఆత్మహత్యలు నిలుస్తాయని స్పష్టం చేశారు. 

 • ka paul

  Andhra Pradesh assembly Elections 20192, Apr 2019, 6:27 PM IST

  డబ్బులు అక్కడా తీసుకోండి, ఇక్కడ తీసుకోండి : కేఏ పాల్ వ్యాఖ్యలు

  నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేఏ పాల్ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఇచ్చే అవినీతి సొమ్మును తీసుకోవాలని కానీ ఓటు మాత్రం ప్రజాశాంతి పార్టీకే వెయ్యాలని కోరారు. 

 • ka paul

  Andhra Pradesh assembly Elections 20191, Apr 2019, 7:43 AM IST

  గుండు గీయించుకున్న పవన్ కళ్యాణ్ కావాలా..? నేను కావాలా..? : కాపులకు పాల్ సూటిప్రశ్న

  గుండు గీయించుకున్న పవన్‌ కళ్యాణ్‌ కావాలా? ప్రపంచాన్ని శాసించే పాల్‌ కావాలో ఆలోచించుకోవాలంటూ కాపు సామాజిక వర్గాన్ని ప్రశ్నించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన కేఏ పాల్ రాబోయే ఎన్నికల్లో పవన్‌కు నాలుగు శాతం ఓట్లు కూడా రావని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ పార్టీకి ఓటేస్తే రాష్ట్రంలో ఎవరూ భాగుపడరన్నారు. 

 • ys jagan

  Andhra Pradesh assembly Elections 201929, Mar 2019, 5:48 PM IST

  ప్రజాశాంతి అభ్యర్థులు: చిరుపై పడిన దెబ్బనే జగన్ పై...

  ఒకే విధంగా పేర్లున్న అభ్యర్థులను బరిలోకి దింపడం, ఒకేమాదిరిగా వైసీపీ కండువా, వైసీపీ గుర్తుకు దగ్గర ఉండేలా ప్రజాశాంతి పార్టీ గుర్తు, కండువా ఉండటంతో వైసీపీ కాస్త గందరగోళానికి గురవుతున్నదనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 35 అసెంబ్లీ స్థానాలతోపాటు నాలుగు పార్లమెంట్ స్థానాల్లో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటోంది. అయితే ఈ సీన్ గతంలో మెగాస్టార్ చిరంజీవికి ఎదురైందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 

 • k.a.paul

  Andhra Pradesh assembly Elections 201929, Mar 2019, 5:20 PM IST

  అభ్యర్థుల పేర్లు సేమ్: ఆ పని నాది కాదు, చంద్రబాబుదన్న కెఎ పాల్

  వైసీపీ అభ్యర్థుల పేర్లతో సరిపోలే అభ్యర్థులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే నామినేషన్లు వేయించారని ఆరోపించారు. తమ పార్టీ బీఫామ్ లను ఫ్యాబ్రికేట్ చేసి చంద్రబాబు, వైఎస్ జగన్ లు వాడుకుంటున్నారని ఆరోపించారు. వైసీపీ ఆరోపించినట్లు ఆ 35 మంది అభ్యర్థులకు తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.

 • k.a.paul

  Andhra Pradesh20, Feb 2019, 9:04 PM IST

  45 రోజుల్లో వైసీపీని భూస్థాపితం చేస్తా, పులివెందులలో జగన్ ఓడిపోతాడు: కే.ఏ.పాల్

  దళితులు, క్రిస్టియన్లు, బీసీలు జగన్‌తో ఉన్నారనుకోవడం వట్టి భ్రమేనన్న ఆయన వారంతా జగన్ తో లేరని కేవలం వందలు, వేల కోట్లు దోచుకున్న నాయకులే జగనగ్ వెంట ఉన్నారని విమర్శించారు. అలాంటి నేతలే ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి వైసీపీ నుంచి టీడీపీకి వలసలు చేస్తున్నారని ఆరోపించారు. 
   

 • k.a.paul

  Andhra Pradesh16, Feb 2019, 8:28 PM IST

  చంద్రబాబు, జగన్, పవన్ కుటుంబ సభ్యుల ఓటు మా పార్టీకే : మేనిఫెస్టో విడుదల చేసిన కేఏ పాల్

  తన పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రపంచంలోనే ఎవరూ రూపొందించలేరన్నారు. మేనిఫెస్టోపై సీఎం అభ్యర్థి ఎవ‌రితోనైనా చ‌ర్చకు తాను సిద్ధమంటూ సవాల్ విసిరారు. తన మేనిఫెస్టో చూశాక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ల కుటుంబ సభ్యులు కూడా తమ పార్టీకే ఓటేస్తారని కేఏ పాల్ చెప్పుకొచ్చారు. 

 • k.a.paul

  Andhra Pradesh26, Jan 2019, 4:11 PM IST

  బాలయోగికి ఇవ్వలేదు, ప్రణబ్ కు అందుకే ఇచ్చారు: పాల్

  కేఏ పాల్ జీఎంసీ బాలయోగి దళితుడు కాబట్టే నామినేషన్ కు పంపలేదన్నారు. నీతి నిజాయితీలకు మారుపేరు అయిన బాలయోగికి భారతరత్న ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. 
   

 • ka paul

  Andhra Pradesh21, Jan 2019, 6:10 PM IST

  50 సార్లు వైఎస్ నన్ను అరెస్టు చేయించారు, ఆపగలిగారా: చంద్రబాబుపై పాల్ ఫైర్

   తనను ఇబ్బందుల పాల్జేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలుస్తుందా అంటూ చంద్రబాబుకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఏపీలో భూస్థాపితం కాలేదా అని ప్రశ్నించారు. తాను గతంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ భూ స్థాపితం అయిపోతుందని చెప్పానని అలాగే అయిపోయిందన్నారు. 

 • ka paul

  Andhra Pradesh11, Jan 2019, 1:25 PM IST

  జగన్ సీఎం కాలేడు, పవన్ సెట్ అవ్వడు : నేనే సీఎం అంటున్న కేఏ పాల్

  చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం అయ్యే ఛాన్స్ లేదు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సీఎం కాలేడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ అసలే ఉండదు. ఖచ్చితంగా నేనే సీఎం అవుతా అందులో ఎలాంటి సందేహం లేదు. నేను సీఎం అయితే చంద్రబాబును నా సలహాదారుగా పెట్టుకుంటా.