Nri Murder
(Search results - 30)NRIOct 12, 2019, 3:58 PM IST
సౌదీలో తెలుగు ఎన్నారై దారుణ హత్య: ఆలస్యంగా వెలుగులోకి
పని విషయంలో జరిగిన ఒక చిన్న గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది. కోపోద్రిక్తుడైన నేపాల్ వ్యక్తి అయాజ్ మెడ మీద బలంగా గాయపరిచాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో అయాజ్ అక్కడికక్కడే కుప్పకూలాడు.
NRIMay 10, 2019, 7:31 AM IST
కత్తులతో దాడి: లండన్ లో హైదరాబాదీ హత్య
నజీముద్దీన్ ను టెస్కో సూపర్ మార్కెట్ లో పనిచేసే మరో వర్కరే హత్య చేసినట్లు భావిస్తున్నారు. నదీమ్ కుటుంబ సభ్యులు బుధవారంనాడు సూపర్ మార్కెట్ యాజమాన్యానికి ఫోన్ చేయడంతో హత్య జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది.
TelanganaMar 2, 2019, 1:53 PM IST
జయరాం హత్య కేసు నిందితుడు రాకేష్ రెడ్డిపై మరో కేసు
ప్రగతి రిసార్ట్స్ ఎండీ జిబికె రావును బెదిరించాడనే ఆరోపణలపై రాకేష్ రెడ్డిపై తాజాగా కేసు నమోదైంది. రెండేళ్ల క్రితం రాకేష్ రెడ్డి తన అనుచరులతో కలిసి జిబికె రావును బెదిరించారని, కొన్ని డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నాడని ఆరోపణలు వచ్చాయి.
TelanganaFeb 25, 2019, 7:36 AM IST
జయరాం హత్య: రాకేష్ రెడ్డితో టీడీపి నేతకు లింక్స్
జయరాం హత్య కేసు దర్యాప్తు అధికారి, బంజారాహిల్స్ ఏసీపీ కె.ఎస్.రావు కార్యాలయంలో గంటన్నరపాటు బీఎన్ రెడ్డిని పోలీసులు విచారించారు. రాకేష్‌రెడ్డి ఎలా తెలుసు, ఎప్పటి నుంచి పరిచయం,అతడిని రాయదుర్గం సీఐ రాంబాబు వద్దకు తీసుకెళ్లడానికి గల కారణాలేమిటి అనే మూడు అంశాలపై విచారణ చేశారు.
Andhra PradeshFeb 21, 2019, 11:45 AM IST
ఏలూరు టీడీపి అభ్యర్థి లగడపాటి: వైసిపి అభ్యర్థి కావూరి?
తెలుగుదేశం పార్టీ తరఫున ఏలూరు లోకసభ స్థానానికి మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కంభంపాటి రామ్మోహన్ రావు పేరు కూడా తెర మీదికి వచ్చింది. అయితే లగడపాటి ఆ విషయం ఇప్పటి వరకు ఎవరితోనూ మాట్లాడలేదని కూడా అంటున్నారు
TelanganaFeb 19, 2019, 6:25 PM IST
నేనెరుగ, నేనెరుగ: జయరాం హత్యపై యాక్టర్ సూర్య, తీరని అనుమానం
ఎన్నారై పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో తన పాత్ర లేదని టాలీవుడ్ నటుడు సూర్యప్రసాద్ అంటున్నారు. తాను జయరాంను రాకేష్ ఇంట్లో దించేసి వెళ్లామని, ఆ తర్వాత ఏం జరిగిందనేది తమకు తెలియదని ఆయన చెబుతున్నారు.
TelanganaFeb 16, 2019, 3:32 PM IST
తెలియక ఇరుక్కున్న నటుడు సూర్య: సినీతారలతో రాకేష్ రెడ్డికి లింక్స్
సూర్యప్రసాద్ కలియుగ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దాని నిర్మాణం కోసం రూ.25 లక్షలు అప్పు ఇవ్వాలని కొద్ది నెలలుగా రాకేష్‌రెడ్డిని కోరుతున్నట్లు సమాచారం.ఆడియో విడుదలకు సమయం సమీపిస్తుందంటూ సూర్య ఒత్తిడి చేశాడు. చివరకు జనవరి నెలాఖరులో ఇస్తానని రాకేష్ రెడ్డి హామీ ఇచ్చాడని అంటున్నారు.
TelanganaFeb 16, 2019, 2:58 PM IST
జయరాం హత్య: సిరిసిల్ల కౌన్సిలర్ భర్తను విచారిస్తున్న పోలీసులు
జయరాంను చంపిన తర్వాత అంజిరెడ్డి రాకేష్ రెడ్డి ఇంటికి వచ్చాడని, జయరాం శవాన్ని చూసి ఆయన పారిపోయాడని అంటున్నారు. అంజిరెడ్డితో శ్రీను, రాములు కూడా వచ్చినట్లు చెబుతున్నారు.
TelanganaFeb 9, 2019, 12:21 PM IST
జయరాం హత్య కేసు: నందిగామకు జూబ్లీహిల్స్ పోలీసులు
నందిగామ జైలులో ఉన్న నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస రెడ్డిలను తీసుకుని వచ్చేందుకు పోలీసులు బృందాలు అక్కడికి బయలుదేరాయి.వారిద్దరిని తమ కస్టడీకి ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టును కోరే అవకాశం ఉంది.
TelanganaFeb 8, 2019, 12:29 PM IST
జయరాం హత్యలో ట్విస్ట్: శిఖా చౌదరితో హైదరాబాద్ క్రికెటర్ కు లింక్స్
జయరాం హత్య జరిగిన రోజు శిఖా చౌదరి విల్లాకు యువ క్రికెటర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రికెటర్ ఎవరనేది తెలియడం లేదు. అతను ఐపిఎల్ మ్యాచులు కూడా ఆడినట్లు చెబుతున్నారు.
TelanganaFeb 8, 2019, 8:43 AM IST
అదే చివరిసారి, అలా చేయడం తప్పే: జయరాం హత్యపై శిఖా చౌదరి
జయరాం హత్య కేసులో తెలంగాణ పోలీసులకు తాను పూర్తిగా సహకరిస్తానని శిఖా చౌదరి చెప్పారు. మరణించారని తెలిసిన తర్వాత జయరాం ఇంటికి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయంపై ఆమె వివరణ ఇచ్చారు.
TelanganaFeb 8, 2019, 7:45 AM IST
పద్మశ్రీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం: జయరాం హత్యపై హైదరాబాద్ సిపి
హైదరాబాద్ సీపీ కార్యాలయంలో ఎలా ముందుకెళ్లాలనే విషయంపై పోలీసు ఉన్నతాదికారులు గురువారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాదు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మీడియాతో మాట్లాడారు.
TelanganaFeb 6, 2019, 6:55 AM IST
జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ
గత నాలుగు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీసులు తన భర్త హత్యపై రకరకాల ప్రచారాలు చేస్తూ, టీవీ సీరియల్స్‌లా సాగదీసి ఏమాత్రం తేల్చలేకపోయారని, ఈ నేపథ్యంలో ఆంధ్రా పోలీసులపై నమ్మకం కోల్పోయానని పద్మశ్రీ అన్నారు.
Andhra PradeshFeb 3, 2019, 9:21 PM IST
శిఖా చౌదరికి చాలా మందితో సంబంధాలు: రాకేష్ రెడ్డి
శిఖా చౌదరితో గతంలో డేటింగ్ చేశానని రాకేష్ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. ఇద్దరి మధ్య సంబంధం వివాహం దాకా వెళ్లిందని, శిఖాచౌదరికి చాలా మందితో సంబంధాలు ఉన్నాయని తనకు తెలిసిందని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.
Andhra PradeshFeb 3, 2019, 8:30 PM IST
శిఖా చౌదరి ఫొటో లీక్: కానిస్టేబుళ్లపై ఎస్పీ మండిపాటు
మీడియాకు సమాచారం ఇచ్చారనే ఆరోపణపై కంచికచర్ల కానిస్టేబుల్ లక్ష్మినారాయణను విఆర్ మీద పంపించారు. మరో ఐదుగురు కానిస్టేబుళ్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిపై ఎస్పీ విచారణకు ఆదేశించారు.