Search results - 11 Results
 • mla

  Andhra Pradesh12, Jul 2019, 9:42 PM IST

  అరకు ఎమ్మెల్యే హత్య: చార్జిషీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ

  ఇకపోతే గత ఏడాది సెప్టెంబర్ 23వ తేదీన అరకు ఎమ్మెల్యే  కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే  సివిరి సోమలను  మావోయిస్టులు  కాల్చి చంపారు. ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళిని ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను అత్యంత దారుణంగా కాల్చి చంపారు. 
   

 • Pragya Sing Thakur

  Lok Sabha Election 201924, Apr 2019, 7:20 PM IST

  ప్రగ్యాసింగ్ పోటీ చేయకుండా అడ్డుకోలేం: తేల్చి చెప్పిన ఎన్ఐఏ కోర్టు

  లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా సాధ్వి ప్రగ్యాసింగ్ ఠాకూర్‌ను తాము అడ్డుకోలేమిని ఎన్ఐఏ కోర్టు తీర్పు వెలువరించింది.

 • ys jagan

  Andhra Pradesh24, Jan 2019, 6:18 AM IST

  జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ చార్జిషీట్ లో కీలక అంశాలు

  అయితే కుట్ర కోణం లేదా నిందితుడికి ప్రోత్సాహం ఉందా అనే అంశంపై దర్యాప్తు కొనసాగుతోందని మాత్రం ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ 173(8) కింద దర్యాప్తు చేస్తున్నామని ఎన్‌ఐఏ చార్జిషీట్ లో పేర్కొంది. ఒకవేళ కుట్ర  కోణాలేమైనా ఉంటే భవిష్యత్‌లో మళ్లీ పూర్తిస్థాయి ఛార్జిషీట్‌ వేస్తామని కూడా ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. 

 • jagan

  Andhra Pradesh17, Jan 2019, 4:41 PM IST

  జగన్‌ దాడి కేసులో కొత్త ట్విస్ట్: మొండికేస్తున్న సిట్

  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి కేసులో గురువారం నాడు మరో ట్విస్ట్ చోటు చేసుకొంది. ఈ కేసును ఎన్ఐఏ‌కు ఆధారాలు ఇచ్చేందుకు సిట్ పోలీసులు నిరాకరించారు.ఈ విషయమై కోర్టులో  ఎన్ఐఏ  అధికారులు  పిటిషన్ దాఖలు చేశారు.

   

 • jagan attack

  Andhra Pradesh11, Jan 2019, 5:54 PM IST

  జగన్ పై దాడి కేసు: ఎన్ఐఏ కస్టడీకి నిందితుడు శ్రీనివాస్

  ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతినిచ్చింది. నిందితుడు శ్రీనివాస్ ను వారం రోజులపాటు కస్టడీకీ అప్పగిస్తూ ఎన్ఐఏ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

 • ys jagan

  Andhra Pradesh11, Jan 2019, 12:15 PM IST

  జగన్ పై దాడి కేసు: హాజరు కానీ శ్రీనివాస్ తరపు లాయర్, 25కు వాయిదా

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైకోర్టు, కేంద్రప్రభుత్వం ఆదేశాలతో కేసు నమోదు చేసిన నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తును వేగవంతం చేసింది. 

 • judge ravindar reddy

  16, Apr 2018, 7:32 PM IST

  మక్కా పేలుళ్ల కేసులో అలజడి.. ఎన్ఐఎ జడ్జి రవీందర్ రెడ్డి రాజీనామా

  న్యాయవ్యవస్థలో మరో సంచలనం చోటు చేసుకుంది. తాజాగా ఒక జడ్జి తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామా కూడా తీవ్ర సంచలనం రేపిన కేసులో తీర్పు వెలువరించిన కొద్దిసేపటికే రాజీనామా చేశారు. జడ్జి రాజీనామా వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

 • mecca masjid blast case

  16, Apr 2018, 12:49 PM IST

  మక్కా మసీదు పేలుళ్ల కేసును కొట్టివేసిన నాంపల్లి కోర్టు

  మక్కా మసీద్ బాంబు పేలుళ్ళ కేసును నాంపల్లి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. 11 ఏళ్ళ సదీర్ఘ విచారణ తర్వాత కోర్టు ఇవాళ సంచలనమైన తుది తీర్పు  వెల్లడించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పును కేవలం రెండు నిమిషాల్లోనే ఎన్ఐఏ కోర్టు వెల్లడించింది. ఈ పేలుళ్ల కేసులో ఆరోపణలు నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమయ్యింది. దీంతో తీర్పు వారికి వ్యతిరేకంగా రావడం జరిగింది. ఈ తీర్పు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపారు. సున్నితమైన ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు కొనసాగుతోంది. 

  2007 మే 18న మక్కా మసీద్ లో  ప్రార్ధనల సమయంలో పేలిన టిఫిన్ బాంబు పేలుళ్ల దాటికి 9  మంది  చనిపోగా , తర్వాత జరిగిన అల్లర్లను కంట్రోల్ చేయడం కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో 5  గురు మృతి చెందారు. ఇలా ఈ ఘటనలో మొత్తం 14  మంది మృతి చెందారు. అయితే ఈ బాంబు పేలుళ్ల కు పాల్పడిఉంటారని 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై చార్జీషీట్ నమోదుచేశారు. వీరిలో దేవేందర్‌గుప్తా(ఏ1), లోకేష్‌శర్మ(ఏ2), సందీప్‌డాంగే (ఏ3), రామచంద్ర కళాసంగ్రా (ఏ4), సునిల్‌ జోషి (ఏ5), స్వామి అసిమానంద(ఏ6), భరత్ భాయి (ఏ7), రాజేందర్‌ చౌదరి(ఏ8), తేజ్‌రామ్‌ పరమార్‌(ఏ9), అమిత్ చౌహాన్‌ (ఏ10) లు ఉన్నారు. వీరిలో ఐదుగురిని (స్వామి అసిమానంద, భరత్ భాయి, దేవేందర్‌గుప్తా,రాజేందర్‌ చౌదరి, లోకేష్‌శర్మ) ని నిర్దోషులుగా ప్రకటించగా, మరో ఐదుగురిపై చార్జిషీట్ కొనసాగనున్నట్లు సమాచారం. 

  హిందూ దేవాలయాల్లో బాంబులు పేలుస్తున్నందుకే ముస్లిం లు ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో బాంబు బ్లాస్ట్ లు చేసారని కోర్టుకి వెల్లడించిన ఎన్ఐఏ ఈ ఆరోపణలకు తగిన సాక్ష్యాలను అందించలేక పోయింది. దీంతో 11 ఏళ్ల విచారణ తర్వాత ఈ కేసును కోర్టే కొట్టివేసింది.ఇవాళ ఈ సున్నితమైన కేసులో తీర్పు వెలువడనున్న నేపధ్యం లో హైదరాబాద్ లో ముందే పోలీసులు అలెర్ట్ అయ్యారు. తీర్పు ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తూ పాతబస్తీ లో ప్రత్యేక బలగాల మోహరించిన పోలీసులు నాంపల్లి కోర్ట్ దగ్గర కూడా భారీ భద్రత కల్పించారు.