Search results - 30 Results
 • jet airways

  business18, Apr 2019, 1:02 PM IST

  జెట్ ఎయిర్‌వేస్ షాక్: అర్ధరాత్రి నుంచి సేవలు బంద్

  ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న జెట్ ఎయిర్‌వేస్ సంచలన నిర్ణయం ప్రకటించింది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జెట్‌ ఎయిర్‌వేర్‌కు నిధులు వచ్చే మార్గం కనిపించకపోవడంతో బుధవారం రాత్రి నుంచి తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

 • Naresh Goyal

  business17, Apr 2019, 10:01 AM IST

  ఎతిహాద్ ప్లస్ టీపీజీ వార్నింగ్స్: బిడ్‌ నుంచి గోయల్ బ్యాక్

  ఒఖ అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది జెట్ ఎయిర్వేస్ పరిస్థితి. జెట్ ఎయిర్వేస్ యాజమాన్యాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న బ్యాంకర్లు దాని నిర్వహణకు నిధుల కేటాయింపుపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. 

 • Naresh Goyal

  business12, Apr 2019, 10:44 AM IST

  జెట్ ఎయిర్‌వేస్‌ దక్కించుకునే పనిలో నరేశ్ గోయల్! ‘టాటా’ ఆసక్తి

  ఆర్థిక సంక్షోభంతో చిక్కుకున్న జెట్‌ ఎయిర్వేస్‌ యాజమాన్య బాధ్యతలను ఎస్బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్టియం తీసేసుకున్నది. అయితే దాని నిర్వహణకు సామర్థ్యం గల బిడ్డర్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దాదాపు 26 ఏళ్ల పాటు సంస్థను నడిపిన సామర్థ్యం గల జెట్‌ మాజీ ప్రమోటర్‌ నరేశ్‌ గోయల్‌ సైతం దానిపై మళ్లీ పట్టు సాధించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. 

 • jet airways

  business1, Apr 2019, 11:03 AM IST

  జెట్‌ ఎయిర్వేస్‌ తాత్కాలిక సారథి పుర్వార్‌!


  ఎట్టకేలకు ప్రైవేట్ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నది. నరేశ్ గోయల్ నుంచి సంస్థను టేకోవర్ చేసుకున్న బ్యాంకుల కన్సార్టియం... జెట్ ఎయిర్వేస్ తాత్కాలిక మేనేజ్మెంట్ కమిటీ సారథిగా ఎస్బీఐ మాజీ చైర్మన్ ఏకే పుర్వార్, సలహా సంస్థగా ఎస్బీఐ క్యాపిటల్ ను నియమించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సమ్మె హెచ్చరిక చేసిన పైలట్లు కాస్త నెమ్మదించారు. సంస్థ యాజమాన్యం కూడా కాసింత ఓర్చుకోవాలని అభ్యర్థించింది.

 • Naresh goyal

  business27, Mar 2019, 10:58 AM IST

  ట్రావెల్ ఏజెంట్ టు జెట్ అధిపతి.. దటీజ్ నరేశ్ గోయల్

  నరేశ్ గోయల్.. జెట్ ఎయిర్వేస్ అధినేతగా సుపరిచితుడు. హర్యానాలోని పాటియాలలో కటిక దారిద్ర్యాన్ని అనుభవించిన కుటుంబ వారసుడిగా ఢిల్లీకి చేరుకుని ట్రావెల్ ఏజెంట్‌గా కెరీర్ ప్రారంభించారు. తర్వాత ఏజెన్సీ అటుపై ఏకంగా జెట్ ఎయిర్వేస్ స్థాపించి పరిశ్రమ వర్గాలనే నివ్వెరపరిచారు.

 • naresh

  business26, Mar 2019, 12:15 PM IST

  ‘బీ’ లేట్ బట్ గుడ్ డిసిసన్: జెట్‌ ఎయిర్వేస్‌ చైర్మన్‌ నరేశ్‌ గోయల్‌ బైబై

  జెట్‌ ఎయిర్‌వేస్‌ కంపెనీ వ్యవస్థాపకుడే.. ఆ సంస్థ బోర్డును వీడాల్సి వస్తోంది. అదీ స్థాపించిన పాతికేళ్ల తర్వాత కావడం విషాదకరం. ఆయన సతీమణి అనితా గోయల్ కూడా జెట్ ఎయిర్వేస్ బోర్డు వైదొలిగారు. 

 • jet airways

  business25, Mar 2019, 11:10 AM IST

  కొత్త మేనేజ్‌మెంట్ చేతుల్లోకి జెట్ ఎయిర్‌వేస్: నరేశ్ గోయల్ నిష్క్రమణ నేడే?

  దాదాపు 25 ఏళ్లపాటు సంస్థను నిర్విఘ్నంగా నడిపిన జెట్ ఎయిర్వేస్ సంస్థ ప్రధాన ప్రమోటర్ నరేశ్ గోయల్‌కు ఆ సంస్థతో బంధం తెగిపోనున్నది.

 • business23, Mar 2019, 1:18 PM IST

  జెట్ ఎయిర్వేస్‌పై ముప్పేట దాడి: స్పైస్ జెట్ అండ్ ఇండిగో ఇలా

  రుణ సంక్షోభంలో చిక్కుకుని సర్వీసులు నిలిపేసిన జెట్ ఎయిర్వేస్ విమానాలను లీజుకు తీసుకోవాలని స్పైస్ జెట్ భావిస్తున్నది. మరోవైపు జీతాల్లేక విలవిలాడుతున్న జెట్ ఎయిర్వేస్ పైలట్లను తమ సర్వీసులోకి తీసుకునేందుకు ఇండిగో ప్రయత్నాలు ప్రారంభించింది. ఇక రుణదాతలు అధిక వాటా తీసుకుని జెట్ ఎయిర్వేస్ సంస్థను నడిపేందుకు కసరత్తు చేస్తున్నారు. 

 • jet airways

  business21, Mar 2019, 2:49 PM IST

  నరేశ్‌జీ!!ఇక చాలు తప్పుకోండి: జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్‌కు ఎస్బీఐ

  జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి తప్పుకోవాలని ప్రమోటర్ నరేశ్ గోయల్ తోపాటు మరో ముగ్గురిని ఎస్బీఐ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుత యాజమాన్యం ఆధ్వర్యంలో సంస్థ నిర్వహణ అసాధ్యమని, వ్రుత్తి నిపుణులకు అప్పగించడం బెటరని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలో జరిగిన భేటీలో ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. అబుదాబీ ఎయిర్ లైన్స్ ‘ఎతిహాద్’ కూడా నరేశ్ గోయల్ చైర్మన్‌గా కొనసాగితే తాము వైదొలుగుతామని ఎస్బీఐకి తేల్చి చెప్పింది.
   

 • jet air ways

  business21, Mar 2019, 2:35 PM IST

  ముదిరిన జెట్ ఎయిర్‌వేస్ వివాదం...అతన్ని కొనసాగిస్తే మేం ఉండలేమన్న ఎస్బీఐ

  జెట్ ఎయిర్వేస్ బోర్డు నుంచి తప్పుకోవాలని ప్రమోటర్ నరేశ్ గోయల్ తోపాటు మరో ముగ్గురిని ఎస్బీఐ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుత యాజమాన్యం ఆధ్వర్యంలో సంస్థ నిర్వహణ అసాధ్యమని, వ్రుత్తి నిపుణులకు అప్పగించడం బెటరని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సారథ్యంలో జరిగిన భేటీలో ఎస్బీఐ చైర్మన్ రజనీశ్ కుమార్ కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. అబుదాబీ ఎయిర్ లైన్స్ ‘ఎతిహాద్’ కూడా నరేశ్ గోయల్ చైర్మన్‌గా కొనసాగితే తాము వైదొలుగుతామని ఎస్బీఐకి తేల్చి చెప్పింది.

 • Jet Airways

  business20, Mar 2019, 10:11 AM IST

  నరేశ్ గోయలే ‘కీ’:పతనం అంచుల్లో జెట్ ఎయిర్వేస్.. బెయిలౌట్ కోసం సర్కార్

  ప్రైవేట్ విమాన యాన సంస్థ జెట్ ఎయిర్వేస్ అప్పుల ఊబిలో చిక్కుకున్నది. ప్రధానంగా ప్రమోటర్ నరేశ్ గోయల్ తప్పుకునే పరిస్థితులు లేకపోవడంతో ఎతిహాద్‌ చేతులెత్తేసింది. ఎస్‌బీఐకి తన 24% వాటా అమ్మకానికి సిద్ధమైంది. అత్యధిక రుణాలిచ్చిన ఎస్బీఐకి విమాన రంగంపై అనుభవం లేదు. ఈ పరిస్థితుల్లో జెట్ ఎయిర్వేస్ సంస్థను ఆదుకునే అవకాశాలు తక్కువే. కానీ ఎన్నికల ముంగిట జెట్ ఎయిర్వేస్ మూతపడే పరిస్థితి వస్తే ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతుంది. అందువల్లే ఆదుకోవాలని బ్యాంకర్లపై ఒత్తిడి తెస్తోంది. జెట్ ఎయిర్వేస్  మూతబడితే 23 వేల మంది ఇబ్బందుల పాలవ్వాల్సి వస్తుంది. మరోవైపు ఎతిహాద్ స్థానే మరో భాగస్వామి కోసం ఖతార్ ఎయిర్వేస్ యాజమాన్యంతో నరేశ్ గోయల్ భేటీ అయినట్లు సమాచారం. 

 • Jet Airways

  Automobile16, Mar 2019, 12:00 PM IST

  మా విమానాలు మాకివ్వండి: జెట్ ఎయిర్‌వేస్ కి లీజు కంపనీల డిమాండ్

  నరేశ్ గోయల్ సారథ్యంలోని జెట్ ఎయిర్వేస్ సంస్థ మరింత చిక్కుల్లోకి వెళ్లిపోతున్నది. జెట్ ఎయిర్వేస్ సంస్థకు విమానాలను లీజుకు ఇచ్చిన సంస్థలు తమ విమానాలను వెనక్కు ఇచ్చేయాలని కోరుతూ డీజీసీఏకు దరఖాస్తు చేసుకున్నాయి. సకాలంలో లీజు మొత్తం జెట్ ఎయిర్వేస్ చెల్లించకపోవడమే దీనికి కారణం. ఇక జెట్ ఎయిర్వేస్ ప్రమోటర్‌గా నరేశ్ గోయల్ వాటా, పాత్రపైనే ఎతిహాద్ సంస్థతో విభేదాలు పెరుగడం వల్లే ప్రతిష్ఠంభన దాని వెంట సంక్షోభం కొనసాగుతున్నాయి. కానీ వారంలోగా పరిష్కారం లభిస్తుందని జెట్ ఎయిర్వేస్ లెండర్ ఎస్బీఐ ఆశాభావంతో ఉంది. 

 • Naresh goyal

  business1, Mar 2019, 1:33 PM IST

  జెట్ ఎయిర్వేస్ ‘నరేశ్‌గోయల్’ కథ కంచికే? ఇక ఇతేహాద్‌దే పై చేయి?

  దేశీయ పౌర విమాన యాన సంస్థ జెట్ ఎయిర్వేస్ అన్నీ అనుకున్నట్లు జరిగితే యాజమాన్యం చేతులు మారనున్నది. అబుదాబీ కేంద్రంగా పని చేస్తున్న ఎతిహాద్ వాటాలను కొనుగోలు చేయనున్నది. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం జెట్ ఎయిర్వేస్ చైర్మన్ హోదాలో ఉన్న నరేశ్ గోయల్ ఆ పదవిని వదులుకోనున్నారు. ఈ మేరకు బ్యాంకర్ల రుణాలను ఈక్విటీలుగా మార్చిన తర్వాత సదరు బ్యాంకర్లు గోయల్, ఎతిహాద్ సీఈఓ టోనీ డగ్లస్ మధ్య ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

 • Jet Airways

  business22, Feb 2019, 2:18 PM IST

  నరేశ్ గోయల్ గైర్హాజర్: నిరాశ మిగిల్చిన జెట్ ఎయిర్వేస్

  జెట్ ఎయిర్వేస్ సంస్థ యాజమాన్యం పునరుద్ధరణ ప్రణాళికలపై విమానాల యజమానులు పెదవివిరిచారు. దీంతో తమ విమాన సర్వీసులను వెనుకకు తీసుకుంటున్నారు. మరోవైపు బ్యాంకర్లు ఇచ్చిన రుణాలను ఈక్విటీ షేర్లుగా తీసుకునే ప్రక్రియను తప్పనిసరి పరిస్థితుల్లోనూ అంగీకరించినట్లు తెలుస్తున్నది. 

 • jet airways

  business18, Feb 2019, 11:24 AM IST

  నరేశ్ గోయల్ ఔట్: ఇతేహాద్‌కే జెట్‌ ఎయిర్వేస్‌పై పెత్తనం?

  ఎట్టకేలకు జెట్ ఎయిర్వేస్ ప్రధాన ప్రమోటర్ నరేశ్ గోయల్ మెట్టుదిగినట్లు కనిపిస్తున్నారు. నియంత్రణ బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సంస్థను రుణ బాధల నుంచి బయటపడవేసేందుకు బ్యాంకర్లతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు మరో రూ.3000 కోట్ల నిధులు రానున్నాయి. ఇతేహాద్, ఎన్ఐఐఎఫ్ సంస్థలు పెట్టుబడులు పెట్టనున్నాయి.