Municipal Election Results 2020
(Search results - 25)TelanganaJan 25, 2020, 9:16 PM IST
నేను గాయత్రీ మంత్రం చదువుతా, బిజెపి చెప్తేనేనా: కేసీఆర్
తాను ప్రతి రోజూ గాయత్రీ మంత్రం చదువుతానని, బిజెపి చెప్తేనే చదువుతున్నానా అని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. తాను హిందువునని, బాజాప్తాగా యాగాలు చేస్తానని అన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదని ఆయన అన్నారు.
TelanganaJan 25, 2020, 7:12 PM IST
జబర్దస్త్ రిటైర్ చేయిస్తారా, ఏంది: కేటీఆర్ కు సీఎం పోస్టుపై కేసీఆర్
కేటీఆర్ కు సిఎం పోస్టు ఎప్పుడిస్తారని అడిగితే కేసీఆర్ తనను జబర్దస్త్ గా రిటైర్ చేయిస్తారా అంటూ చమత్కరించారు. తాను దుక్కలాగా ఉన్నానని, తాను పనికిరానా అని ఆయన అడిగారు. జాతీయ రాజకీయాలకు తప్పకుండా వెళ్తానని చెప్పారు.
TelanganaJan 25, 2020, 6:25 PM IST
భయోత్పాతం, కేంద్రం బండారం బయటపడుతుంది: ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తెలంగాణ సీఎం కేసీఆర్ బిజెపి కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. దేశం ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగాలేదని, కేంద్రం ఆర్థిక పరిస్థితి బండారం బయటపడుతుందని ఆయన అన్నారు.
TelanganaJan 25, 2020, 6:06 PM IST
ఎన్టీఆర్ వేవ్, ఇందిరా వేవ్ చూశా, ఇటువంటి వేవ్ చూడలేదు: కేసీఆర్
మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ఘన విజయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందిస్తూ ఇటువంటి వేవ్ తాను చూడలేదని అన్నారు. తాను ఎన్టీఆర్ వేవ్, ఇందిర వేవ్ చూశానని, కానీ ఇటువంటి వేవ్ తొలిసారి చూశానని ఆయన చెప్పారు.
TelanganaJan 25, 2020, 5:39 PM IST
రామారావుకు ఆశీస్సులు: తనయుడు కేటీఆర్ పై కేసీఆర్
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ కు ఆశీస్సులు అందించారు. ప్రజలు తమకు మార్గదర్శనం చేసినట్లుగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
TelanganaJan 25, 2020, 4:38 PM IST
అభ్యర్థిని ఎత్తుకుపోయారు: ఈసీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు, కేసీఆర్ ఫై ఫైర్
తమ క్యాంపులో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థిని పోలీసులు ఎత్తుకెళ్లి టీఆర్ఎస్ క్యాంపులో చేర్చారని రేవంత్ రెడ్డి ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి ఫిర్యాదు చేశారు. కేసీఆర్ మంత్రులను బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించారు.
KarimanagarJan 25, 2020, 3:35 PM IST
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్: జాబితా ఇదే
ఉమ్మడి కరీంనగర్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. అన్ని మున్సిపాలిటీలను టీఆర్ఎస్ దక్కించుకుంది. ప్రతిపక్ష కాంగ్రెసు, బిజెపిలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు.
TelanganaJan 25, 2020, 3:18 PM IST
కార్పోరేషన్లలో టీఆర్ఎస్ పాగా: 27న కరీంనగర్, ఇందూరులో బిజెపి హవా
తెలంగాణలోని మెజారిటీ నగర పాలక సంస్థల్లో టీఆర్ఎస్ పాగా వేసింది. రాష్ట్రంలోని 9 నగర పాలక సంస్థల్లో టీఆర్ఎస్ ఏడింటిని కైవసం చేసుకుంది. నిజామాబాద్ ఫలితం మాత్రం ఊగిసలాడుతోంది.
TelanganaJan 25, 2020, 2:50 PM IST
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలు: కేటీఆర్ స్పందన ఇదీ...
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ ఫలితాలు మున్సిపల్ మంత్రిగా తన బాధ్యతలను మరింత పెంచాయని ఆయన అన్నారు.
TelanganaJan 25, 2020, 2:19 PM IST
ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరో షాక్: గాంధీభవన్ వెలవెల
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలింది. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. కాంగ్రెసు అగ్రనేతలంతా అదే పరిస్థితిని ఎదుర్కుంటున్నారు.
TelanganaJan 25, 2020, 1:36 PM IST
తెలంగాణ మున్సిపల్ ఫలితాలు: బోణీ కొట్టిన టీడీపీ
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఖాతా తెరిచింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మథిర మున్సిపాలిటీలో టీడీపీ ఓ వార్డును గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులో ఉండడమే ఆ విజయానికి కారణమని భావిస్తున్నారు.
TelanganaJan 25, 2020, 1:19 PM IST
భైంసా మున్సిపాలిటీ మజ్లీస్ కైవసం...బోణీ కూడా కొట్టని తెరాస, కాంగ్రెస్
భైంసా మునిసిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార తెరాస కు భారీ షాక్ తగిలింది. ఈ మునిసిపాలిటీలో ఒక్కటంటే ఒక్క వార్డును కూడా తెరాస కైవభాసం చేసుకోలేకపోవడం గమనార్హం. ఎంఐఎం ఈ మునిసిపాలిటీని కైవసం చేసుకోవడం విశేషం.
TelanganaJan 25, 2020, 1:12 PM IST
జనగామ టఫ్: టీఆర్ఎస్ రెబెల్స్ ను క్యాంప్ నకు తరలించిన కాంగ్రెసు
జనగామ మున్సిపాలిటీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెసు పార్టీ నేతలు ఇద్దరు టీఆర్ఎస్ రెబెల్స్ ను క్యాంప్ నకు తరలించారు. బిజెపితో పొత్తు పెట్టుకుని టీఆర్ఎస్ షాక్ ఇవ్వాలని కాంగ్రెసు భావిస్తోంది.
TelanganaJan 25, 2020, 12:57 PM IST
మున్సిపల్ ఎన్నికలు: కేసీఆర్ కోటలో కాంగ్రెసు ఖాతా
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వెల్ లో కాంగ్రెసు పార్టీ ఖాతా తెరిచింది. టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయలేకపోయింది. కాంగ్రెసు ఓ వార్డును గెలుచుకుని తన ఉనికిని చాటుకుంది.
TelanganaJan 25, 2020, 12:46 PM IST
మున్సిపల్ ఎన్నికలు: కొడంగల్ లో రేవంత్ రెడ్డికి ఎదురు దెబ్బ
తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి కొడంగల్ మున్సిపాలిటీలో ఎదురు దెబ్బ తగిలింది. కొడంగల్ మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను టీఆర్ఎస్ గెలుచుకుంది.