Mtnl
(Search results - 14)Tech NewsSep 19, 2020, 4:08 PM IST
చైనా యాప్స్ నిషేధం.. వెలుగులోకి మరో ఆశ్చర్యకరమైన విషయం..
ఒక వైపు భారత ప్రభుత్వం చైనా యాప్లను నిషేధిస్తుండగా ఆశ్చర్యకరమైన విషయం తెరపైకి వచ్చింది. ఇటీవల ప్రభుత్వం రాజ్యసభలో ఒక ముఖ్యమైన సమాచారాన్ని పంచుకుంది, దీని ప్రకారం ప్రభుత్వ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) ఉపయోగించే మొబైల్ నెట్వర్క్ పరికరాల్లో 50 శాతానికి పైగా చైనా కంపెనీలకు చెందినవి అని తెలిపింది.
TechnologyDec 4, 2019, 10:16 AM IST
బీఎస్ఎన్ఎల్ & ఎంటీఎన్ఎల్ వీఆర్ఎస్ పథకానికి ఫుల్ డిమాండ్
కేంద్ర టెలికం సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ల్లో పని చేస్తున్న వారిలో సుమారు 92,700 మంది వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో సంస్థలపై ఏటా రూ.8,800 కోట్ల వేతన బిల్లు భారం తగ్గనున్నది.
TechnologyNov 21, 2019, 1:41 PM IST
బీఎస్ఎన్ఎల్ @ దాదాపు 78 వేల మంది...దరఖాస్తు
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల విలీనానికి రెండేళ్ల గడువు పడుతుందని కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. అంత వరకు బీఎస్ఎన్ఎల్ సంస్థకు ఎంటీఎన్ఎల్ అనుబంధ సంస్థగా కొనసాగుతుందన్నారు. ఇక బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కలిపి 91 వేల మంది ఉద్యోగులు వీఆర్ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో చాలా మందికి రూ.90 లక్షల మేరకు లబ్ధి చేకూరుతుందని అంచనా.
TechnologyNov 9, 2019, 10:49 AM IST
4 రోజుల్లోనే గుడ్ రెస్పాన్స్: 60 వేలు దాటిన వీఆర్ఎస్
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునర్వ్యవస్థీకరణ పేరిట కేంద్రం ప్రతిపాదించిన స్వచ్ఛంద పదవీ విరమణ పథకానికి ఉద్యోగుల నుంచి భారీగా స్పందన వస్తోంది. ప్రభుత్వం 94 వేల మందిని ఇంటికి సాగనంపాలని లక్ష్యంగా పెట్టుకుంటే నాలుగు రోజుల్లోనే దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 60 వేలు దాటింది. బీఎస్ఎన్ఎల్ సంస్థలోనే దరఖాస్తులు 57 వేలను మించి పోవడం గమనార్హం.
TechnologyNov 5, 2019, 11:49 AM IST
మెర్జర్ సరే.. బీఎస్ఎన్ఎల్ కు పొంచి ఉన్న దివాళా గండం
త్వరలో ఎంటీఎన్ఎల్ సంస్థను విలీనం చేసుకోనున్న బీఎస్ఎన్ఎల్కు ‘దివాళా’ గండం పొంచి ఉన్నది. వస్తువుల సరఫరా సంస్థలకు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రూ.20 వేల కోట్ల మేర బకాయి పడ్డాయి. మరోవైపు ఎంటీఎన్ఎల్ సంస్థలో పని చేస్తున్న 22 వేల మందిలో 15 వేల మందికి ఆకర్షణీయ వీఆర్ఎస్ పథకాన్ని ప్రకటించేసింది.
TechnologyNov 4, 2019, 2:37 PM IST
ఉద్యోగుల స్వచ్చంద పదవీ విరమణపైనే కేంద్రం ప్రియారిటీ
బీఎస్ఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్ విలీనం ప్రక్రియలో రెండు సంస్థల్లో 55 ఏళ్లు దాటిన ఉద్యోగుల పదవీ విరమణకు వీఆర్ఎస్ అమలు చేయడానికే కేంద్రం ప్రాధాన్యం ఇస్తున్నది. ఈ పథకం అమలు తీరు తెన్నులను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నేరుగా పర్యవేక్షించనున్నారు.
TechnologyOct 24, 2019, 9:26 AM IST
బీఎస్ఎన్ఎల్... ఉద్యోగులకు మంచి రోజులు...
బీఎస్ఎన్ఎల్ చైర్మన్ పీకే పూర్వార్ అన్నట్లే ఆ సంస్థకు, అందులో పని చేస్తున్న ఉద్యోగులకు మంచి రోజులు రానున్నాయి. ఎంటీఎన్ఎల్ సంస్థను బీఎస్ఎన్ఎల్లో విలీనం కానున్నది. ఈ మేరకు బుధవారం కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. రెండు సంస్థలపై సంస్థాగత భారాన్ని తగ్గించేందుకు యాబైమూడున్నరేళ్ల వయస్సు దాటిన ఉద్యోగులు, అధికారులకు ఆకర్షణీయ స్వచ్ఛంద పదవీ విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది కేంద్రం. అంతే కాదు 2016 ధరలకే 4జీ స్పెక్ట్రం కేటాయించనున్నది. అందుకూ నిధులను కేటాయించింది. ఇక ఆ సంస్థలు చేయాల్సిందల్లా ఇతర ప్రొవైడర్లతో పోటీ పడి దూసుకెళ్లాల్సిందే.
businessOct 23, 2019, 5:48 PM IST
ఎంటిఎంఎల్, బీఎస్ఎన్ఎల్ విలీనం చేయాలి : కేంద్ర మంత్రి
ఎంటిఎంఎల్, బీఎస్ఎన్ఎల్ విలీనం చేయాలి. బిఎస్ఎన్ఎల్, ఎమ్టిఎన్ఎల్ ఉద్యోగులకు ప్రభుత్వం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (విఆర్ఎస్) మరింత ఆకర్షణీయంగా మారుస్తుందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
businessOct 14, 2019, 12:40 PM IST
బీఎస్ఎన్ఎల్ కథ కంచికేనా?
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పునరుద్ధరణ కన్నా మూసివేతకే కేంద్ర ఆర్థిక శాఖ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ సంస్థల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆ రెండు సంస్థల ఉద్యోగులు ప్రధాని మోదీని అభ్యర్థిస్తున్నారు.
NATIONALJul 22, 2019, 4:56 PM IST
ముంబైలో అగ్నిప్రమాదం: అగ్ని కీలల్లో ఎంటిఎన్ఎల్ ఆఫీస్ (వీడియో)
ముంబై ఎంటిఎన్ఎల్ కార్యాలయంలో సోమవారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. నాలుగు అంతస్తుల భవనంలో ఈ ప్రమాదం వాటిల్లింది. దీంతో ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు భయాందోళన చెందుతున్నారు. ఫైరింజన్లు మంటలు ఆర్పుతున్నాయి.
NewsJul 17, 2019, 6:05 PM IST
వీఆర్ఎస్ ప్లస్ రివైవల్: ‘షా’ చేతిలో బీఎస్ఎన్ఎల్ ఫ్యూచర్
నిధుల కొరతను ఎదుర్కొంటున్న బీఎస్ఎన్ఎల్ను సత్వరమే ఆదుకునేందుకు మంత్రుల బృందం రూ.1,000 కోట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రత్యేక బడ్జెటరీ కేటాయింపులకు త్వరలో మంత్రుల బృందం ఆమోదం తెలపనుందని సమాచారం.
TECHNOLOGYJul 3, 2019, 10:44 AM IST
బీఎస్ఎన్ఎల్కు బెయిలౌట్.. బట్ వీఆర్ఎస్లు తప్పవ్!!
ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలకు మూసివేత భయం తప్పింది. మోయలేని అప్పుల భారంతో ఇక్కట్ల పాలవుతూ, ఉద్యోగుల వేతనాలు చెల్లింపునకు ఆపసోపాలు పడుతున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థల పునరుద్ధరణపై ఊహాగానాలు సాగాయి. మరోవైపు ప్రభుత్వం నుంచి స్పష్టమైన సహకారం కొరవడింది. ఫలితంగా సిబ్బంది, వినియోగదారులు అయోమయానికి గురవుతూ వచ్చారు. మూసివేత సంకేతాలపై ఆందోళన వ్యక్తం కావడంతో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ సంస్థలకు బెయిలౌట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతోపాటు వ్యూహాత్మకంగా వీఆర్ఎస్ నిమిత్తం భారీ ఆకర్షణీయ ప్యాకేజీ అమలు చేయనున్నట్లు సమాచారం.
TECHNOLOGYApr 5, 2019, 12:18 PM IST
బీఎస్ఎన్ఎల్కు బెయిలౌట్.. పీఎంఓ ఓకే.. ఇండియాలో నో జాబ్స్ అన్న ఫిచ్
ప్రైవేట్ మోజులో ఇప్పటి వరకు నిర్లక్ష్యానికి గురైన ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ దాని అనుబంధ ఎంటీఎన్ఎల్ సంస్థలకు బెయిలౌట్ ఇచ్చేందుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సంస్థ ఉద్యోగులపై మాత్రం స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కత్తి వేలాడుతున్నట్లే కనిపిస్తున్నది.
TECHNOLOGYApr 1, 2019, 12:02 PM IST
బీఎస్ఎన్ఎల్ పట్ల కేంద్రం ‘సవతి’ ప్రేమ.. ప్రైవేట్ పట్ల వల్లమాలిన ప్రేమ
బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ భవితవ్యంపై చర్చించేందుకు ఆ సంస్థల అధికారులతో మంగళవారం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) అధికారులు భేటీ కానున్నారు. సకల వసతులు ఉన్నా 1.76 కోట్ల మంది కస్టమర్లు ఉన్నా లాభాలు గడించలేకపోతున్నది బీఎస్ఎన్ఎల్. ఆ సంస్థ సాయంతో సేవలందిస్తున్న ప్రైవేట్ సంస్థలు మాత్రం లాభాలు గడిస్తున్నాయి.