Mohammad Siraj
(Search results - 46)CricketFeb 18, 2021, 2:28 PM IST
మా నాన్న కూడా చప్పట్లు కొట్టడు, వీళ్లు కొడుతున్నారు... నువ్వు సెంచరీ చేయ్ భాయ్....
మహ్మద్ సిరాజ్... ఆట కంటే ఎక్కువగా ఆదర్శప్రాయమైన అమాయకత్వం, అందమైన మనసుతో అందరి మనసులు గెలుచుకుంటున్నాడు. ఆస్ట్రేలియా టూర్లో బుమ్రా కొట్టిన షాట్‌కి బ్యాట్స్‌మెన్ పడిపోతే... బ్యాటు పడేసి పరుగెత్తుకెళ్లిన సిరాజ్, ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడిన ఇన్నింగ్స్, అశ్విన్‌కి అందించిన సహకారం అద్భుతం. తాజాగా సిరాజ్, తనతో చెప్పిన మాటలను చెప్పుకొచ్చాడు సెకండ్ టెస్టు హీరో రవిచంద్రన్ అశ్విన్.
CricketFeb 16, 2021, 11:21 AM IST
సిరాజ్ సంబరాలు చూసి షాక్ అయ్యాను... మా అనుబంధానికి ఇదే నిదర్శనం... రవిచంద్రన్ అశ్విన్
ఇలాంటి పిచ్ తయారుచేస్తారా... ఈ పిచ్‌పై బ్యాటింగ్ చేయడం అసాధ్యం... కావాలనే కసితో ఇలాంటి చెత్త పిచ్‌ను తయారుచేశారు... రెండో టెస్టు జరుగుతున్న చెపాక్ పిచ్‌పై ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలు ఇవి. అయితే ఇదే పిచ్‌పై అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్. బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై దూకుడుగా బ్యాటింగ్ చేసి, టెస్టుల్లో ఐదో సెంచరీతో ఇంగ్లాండ్‌కి చుక్కలు చూపించాడు.
CricketFeb 15, 2021, 4:22 PM IST
ప్రతీ బంతికీ అరుపులు, కేకలు, చప్పట్లు... మహ్మద్ సిరాజ్‌కి చెన్నై ప్రేక్షకుల సపోర్ట్...
ఆస్ట్రేలియాలో 13 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచిన మహ్మద్ సిరాజ్‌కి ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఊహించని అనుభవం ఎదురైంది. రవిచంద్రన్ అశ్విన్ 80 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఆఖరి వికెట్‌గా క్రీజులోకి వచ్చాడు మహ్మద్ సిరాజ్ .
CricketFeb 15, 2021, 3:51 PM IST
INDvsENG: రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్... ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యం...
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, అద్భుత సెంచరీతో భారత జట్టు భారీ స్కోరు చేయగలిగింది. బ్యాటుకి కష్టసాధ్యమైన పిచ్‌పై తేలిగ్గా బౌండరీలు కొడుతూ, చారిత్రక సెంచరీ పూర్తి చేసుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. చెన్నై పిచ్‌పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు విమర్శలు చేస్తున్న సమయంలో అదే పిచ్‌పై అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు అశ్విన్. ఫలితంగా రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 286 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ జట్టు టార్గెట్ 481 పరుగులు.
CricketFeb 14, 2021, 1:39 PM IST
స్వదేశంలో మొదటి బంతికే వికెట్ తీసిన సిరాజ్... కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన రిషబ్ పంత్...
ఆస్ట్రేలియా టూర్లో 13 వికెట్లతో అదరగొట్టిన మహ్మద్ సిరాజ్... స్వదేశంలో వేసిన మొదటి బంతికే వికెట్ తీశాడు. 22 పరుగులు చేసిన ఓల్లీ పోప్‌ను అద్భుతమైన బంతికే అవుట్ చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో రిషబ్ పంత్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఓల్లీ పోప్‌ను పెవిలియన్ చేర్చారు
CricketFeb 5, 2021, 1:54 PM IST
ఇషాంత్ శర్మను ఎందుకు తీసుకున్నారు... కుల్దీప్ను ఎందుకు పక్కనబెట్టారు... గంభీర్ కామెంట్...
ఆస్ట్రేలియా టూర్లో మూడు టెస్టుల్లో 13 వికెట్లు తీసి, అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచిన మహ్మద్ సిరాజ్‌కి మొదటి టెస్టులో చోటు దక్కకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్. అలాగే ఆసీస్ టూర్లో చోటు దక్కించుకోలేకపోయిన కుల్దీప్ యాదవ్‌కి తుదిజట్టులో చోటు కల్పించాల్సిందని, అతని బదులు ఏ ప్లేయర్‌ని పక్కనబెట్టినా బాగుండేదని కామెంట్ చేశాడు గౌతీ.
CricketFeb 2, 2021, 11:22 AM IST
నెట్ ప్రాక్టీస్ మొదలెట్టిన టీమిండియా... క్రైమ్ పార్టనర్‌తో మహ్మద్ సిరాజ్...
ఆరు రోజుల క్వారంటైన్ పూర్తిచేసుకున్న టీమిండియా... ఇంగ్లాండ్ సిరీస్ ఆరంభానికి ముందు నెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టింది. చెన్నైలోని ఎంఏ చిదంబరం క్రికెట్ స్టేడియంలో సోమవారం నుంచి ప్రాక్టీస్ మొదలెట్టారు భారత క్రికెట్ జట్టు సభ్యులు. ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది భారత జట్టు.
CricketJan 28, 2021, 1:18 PM IST
భారత క్రికెటర్లకు మతాలతో లింకు పెడతారా? సిగ్గుండాలి... బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ శుక్లాపై ట్రోలింగ్...
భారతదేశం భిన్నమతాలకు, వేల కులాలకు, విభిన్న సంస్కృతులకు నిలయం. అయితే క్రికెట్ విషయానికి వచ్చేసరికి, అతను ఏ మతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడనే విషయాలను క్రికెట్ ఫ్యాన్స్ పట్టించుకోరు. అలాంటి పట్టించుకునేవాళ్లు నిజమైన క్రికెట్ ఫ్యాన్స్ కాదు. అయితే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఇలాంటి పనికి పాల్పడి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు.
CricketJan 28, 2021, 9:45 AM IST
ప్రతీ నెలా ఐసీసీ అవార్డులు... రేసులో నిలిచిన రిషబ్ పంత్, అశ్విన్, సిరాజ్, నట్టూ...
ఇంతకుముందు ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ఏడాదికి ఒక్కసారి ఉత్తమ క్రికెటర్ల అవార్డులను ప్రకటించేంది. అయితే ఇకపై ప్రతీ నెల అవార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది ఐసీసీ. ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ పేరటి సంవత్సరం పొడవునా, నెలకో క్రికెటర్‌కి ఈ అవార్డులను ఇవ్వనుంది ఐసీసీ....
CricketJan 25, 2021, 4:04 PM IST
టీమిండియా విజయానికి ఆ ముగ్గురే కారణం... పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్...
ఆస్ట్రేలియా గడ్డపై భారత జట్టు సాధించిన చారిత్రక విజయం... విమర్శకుల నోళ్లకు తాళాలు వేసింది. ఆడిలైడ్‌లో ఘోర ప్రదర్శన తర్వాత టీమిండియాను ఘోరంగా ట్రోల్ చేసిన పాక్ మాజీ ప్లేయర్ షోయబ్ అక్తర్, గబ్బా టెస్టు తర్వాత భారత జట్టుకు హ్యాట్సాఫ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్టులోకి పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ వుల్ హక్ కూడా చేరాడు.
CricketJan 23, 2021, 3:32 PM IST
ఆస్ట్రేలియాలో అదరగొట్టిన కుర్రాళ్లకు ఆనంద్ మహేంద్ర స్పెషల్ గిఫ్ట్... నట్టూ, సిరాజ్‌తో పాటు...
భారత పారిశ్రామిక దిగ్గజ సంస్థ మహేంద్ర గ్రూప్ ఛైర్మెన్, సీఈవో ఆనంద్ మహేంద్ర... వ్యాపార రంగంతో పాటు క్రికెట్‌ను కూడా బాగా ఫాలో అవుతుంటారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆనంద్ మహేంద్ర, వివిధ సామాజిక, సాంఘిక క్రీడా సంబంధిత అంశాలపై స్పందిస్తూ ఉంటారు.
CricketJan 22, 2021, 4:11 PM IST
BMW కారు కొనుగోలు చేసిన మహ్మద్ సిరాజ్... ఆటో డ్రైవర్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చి...
మహ్మద్ సిరాజ్ జీవితం ఆస్ట్రేలియా టూర్ తర్వాత పూర్తిగా మారిపోయింది. ఇంతకుముందు ఐపీఎల్లో రాణించినా, టీమిండియా తరుపున ఆడినా పెద్దగా పట్టించుకోనివాళ్లు కూడా ఇప్పుడు సిరాజ్ మంత్రం జపిస్తున్నారు.
CricketJan 22, 2021, 1:50 PM IST
అంపైర్లు ఆటను నిలిపివేసి వెళ్లిపోమ్నని చెప్పారు, కానీ రహానే భాయ్ మాత్రం... సిడ్నీ టెస్టులో...
సిడ్నీ స్టేడియంలో ఆస్ట్రేలియా ప్రేక్షకులు, భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌పై జాత్యాహంకార వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్టేడియంలో కొందరు ఆస్ట్రేలియన్లు, సిరాజ్‌ను అవమానిస్తూ జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది.
CricketJan 21, 2021, 1:10 PM IST
స్వదేశం చేరుకున్న భారత జట్టు... రహానే, విహారి, సిరాజ్ అండ్ జట్టుకి ఘన స్వాగతం...
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాను టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో చిత్తు చేసిన భారత జట్టు, స్వదేశానికి వచ్చేసింది. ఐపీఎల్ 2020 సీజన్ కోసం గత ఏడాది సెప్టెంబర్ మొదట్లో యూఏఈ చేరుకున్న భారత క్రికెటర్ల, దాదాపు ఐదు నెలల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చారు.
CricketJan 19, 2021, 10:12 AM IST
నాకు ఇష్టమైన బిర్యానీ తినడం తగ్గించా... రహానే మాటలు మరిచిపోలేను... - సిరాజ్
మహమ్మద్ సిరాజ్... ఈ హైదరాబాదీ బౌలర్ పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మార్మోగిపోతోంది. గబ్బా టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి, అబ్బురపరిచాడు సిరాజ్. ఆడుతున్న మూడో టెస్టులోనే బౌలింగ్ విభాగానికి నాయకత్వం వహించిన సిరాజ్... ఏ మాత్రం అనుభవం లేని యంగ్ బౌలర్లతో సంచలన ప్రదర్శన రాబట్టాడు. ఈ ప్రదర్శన అనంతరం సిరాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు...