Mohali Odi  

(Search results - 8)
 • rishab dhawan

  CRICKETMar 12, 2019, 4:18 PM IST

  రిషబ్ ఆ స్టంపింగ్ చేసుంటే మ్యాచ్ మరోలా ఉండేది: ధావన్

  భారత్-ఆస్ట్రేలియా మధ్య మొహాలి వేదికగా జరిగిన వన్డేలో టీమిండియా ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత బ్యాట్ మెన్స్ అద్భుతంగా రాణించి 358 పరుగులు చేసినప్పటికి ఆ  పరుగులను కాపాడుుకోలేక పరాజయంపాలవ్వాల్సి వచ్చింది. ఇలా భారీ పరుగులన కాపాడుకోలేకపోవడంతో ఆటగాళ్ల చెత్త ఫీల్డింగే కారణమన్న విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా ధోని స్థానంలో వికెట్ కీపింగ్ చేసిని యువ ఆటగాడు రిషబ్ పంత్ ను అభిమానులో ఓ ఆట ఆడుకుంటున్నారు. అతడే ఈ మ్యాచ్ ఓటమికి కారణమని...ధోనిని అనుసరించాలని ప్రయత్నించి విఫలమై జట్టు ఓటమికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

 • akash chopra

  CRICKETMar 11, 2019, 7:57 PM IST

  రిషబ్‌ను భారత జట్టులోకి తీసుకోవడం కరెక్టేనా?: ఆకాశ్ చోప్రా ఆన్సర్

  రిషబ్ పంత్... ఈ యువ ఆటగాడు గతంలో ఆస్ట్రేలియా జట్టుపై అద్భుతంగా ఆడి ఒక్క మ్యాచ్ తో హీరోగా మారాడు. మళ్లీ అదే జట్టుపై పేలవ ప్రదర్శన చేసి విమర్శల పాలవుతున్నాడు. ఇలా మొహాలీ వన్డేలో రిషబ్ వికెట్ కీఫింగ్ లో తడబడి భారత అభిమానుల ఆగ్రహానికి గురవుతున్నాడు. అయితే ఇలాంటి ఇబ్బందికర సమయంలో రిషబ్ కు టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్నా మద్దతుగా నిలిచారు. 

 • Team India

  CRICKETMar 11, 2019, 4:14 PM IST

  టీమిండియా వన్డే చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు

  ప్రపంచ కప్ కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సీరిస్ ద్వారా భారత జట్టు ఖాతాలోకి అత్యంత చెత్త రికార్డు చేరింది. మొహాలీ వేదికగా జరిగిన నాలుగొ వన్డేలో టీమిండియా ఘోర పరాభవాన్ని చవిచూసింది. భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసి 358 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికి వాటిని కాపాడుకోవడంలో విఫలమయ్యింది. ఇలా 350 కి పైగా పరుగులు సాధించిన మ్యాచుల్లో భారత్ మొదటిసారి ఓటమిని చవిచూసింది. 

 • Australia team

  CRICKETMar 11, 2019, 3:48 PM IST

  మొహాలిలో ఘన విజయం: ఆసిస్ ఆల్ టైమ్ రికార్డు

  భారత్-ఆస్ట్రేలియా ల మధ్య  జరుగుతున్న వన్డే సీరిస్ మొహాలీ మ్యాచ్ తర్వాత రసవత్తంగా మారింది. ఈ మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ సునాయాసంగా చేధించింది. దీంతో ఘన విజయాన్ని సాధించడమే కాదు ఆసిస్ వన్డే క్రికెట్ చరిత్రతో ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పింది.  

 • rishab

  CRICKETMar 11, 2019, 12:13 PM IST

  మొహాలీ వన్డేలో భారత్ ఓటమి: పంత్‌పై నెటిజన్ల ఫైర్

  మొహాలీ వన్డేలో కష్టసాధ్యమైన 359 పరుగుల విజయ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా ఆడుతూ పాడుతూ ఛేదించి సిరీస్‌ను సమం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టు ఓటమికి వికెట్ కీపర్ రిషభ్ పంతే కారణమంటూ నెటిజన్లు అతనిపై విరుచుకుపడుతున్నారు.

 • dhoni rohit

  CRICKETMar 10, 2019, 4:25 PM IST

  ధోనీ రికార్డును బద్దలుగొట్టిన రోహిత్...

  ధనా ధన్ షాట్లతో మొహాలీ వన్డేలో చెలరేగినప్పటికి రోహిత్ కొద్దిలొో సెంచరీని మిస్సయ్యాడు. 95 పరుగుల వద్ద భారీ షాట్ తో సెంచరీ సాధించాలని రోహిత్ ప్రయత్నించి ఔటయ్యాడు. అయితే ఈ పరుగులు సాధించే క్రమంలో అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. హెలికాప్టర్ షాట్లతో రెచ్చిపోతూ సిక్సర్లతో విద్వంసం సృష్టించే ధోని పేరిట వున్న  రికార్డును తాజా మ్యాచ్ ద్వారా రికార్డును రోహిత్ బద్దలుగొట్టాడు. 

 • undefined

  CRICKETMar 10, 2019, 3:41 PM IST

  భారత ఓపెనర్ల వరల్డ్ రికార్డు...

  మొహాలీ వన్డేలో టీమిండియా ఓపెనర్లు రెచ్చిపోతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఈ సీరిస్ లో మొదటిసారి ఇద్దరు ఓపెనర్లు సమిష్టిగా రానిస్తూ శుభారంభాన్ని అందించారు.  రోహిత్ శర్మ- శిఖర్ ధావన్ లు అర్థశతకాలతో చెలరేగి భారత స్కోరును సెంచరీ దాటించారు. ఈ క్రమంలో వీరి ఖాతాలో మరో సెంచరీ భాగస్వామ్యం చేరింది. దీంతో అంతర్జాతీయంగా అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన అత్యుత్తమ ఓపెనింగ్ జోడీల సరసన వీరు చేరిపోయారు.  
     

 • మొదటి వన్డే కోసం భారత జట్టు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, అంబటి రాయుడు, కేధార్ జాదవ్,ఎంఎస్.ధోని, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ సింగ్ బుమ్రా,మహ్మద్ షమీ, యజువేందర్ చాహల్, కుల్దీప్ యాదవ్, విజయ్ శంకర్, రిషబ్ పంత్, సిద్దార్థ్ కౌల్, కేఎల్ రాహుల్.   వీరిలో తుది జట్టులో ఎవరికి స్థానం లభిస్తుందో మరికొద్దిసేపట్లో బిసిసిఐ ప్రకటించనుంది.

  CRICKETMar 10, 2019, 1:40 PM IST

  మొహాలి వన్డే: నాలుగు మార్పులతో బరిలోకి టీమిండియా

  భారత్-ఆస్ట్రేలియా మధ్య వన్డే సీరిస్ రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన టీమిండియా రాంచీ వన్డేలో మాత్రం ఓటమిపాలయ్యింది. దీంతో ఆసిస్ కు వన్డే సీరిస్ పై ఆశలు చిగురించాయి. అయితే మోహాలి వన్డేలో ఎట్టిపరిస్థితుల్లో గెలిచి సీరిస్ ను ఖాయం చేసుకోవాలిన భారత జట్టు భావిస్తోంది. తర్వాత మిగిలే చివరి వన్డేలో యువ ఆటగాళ్లను ఆడించి ప్రయోగాలు చేయాలనుకుంటోంది. అందువల్ల మూడో వన్డేలో విఫలమైన భారత జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి.