Marri Rajasekhar  

(Search results - 7)
 • ముందుగా ఇందుకోసం కొంత కసరత్తు గత రెండు మూడు వారాలుగా జరిగింది. చెన్నైలో ఉన్న జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌ కొజిరొ ఉచియామ ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు సహా ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. జపాన్‌లో పర్యటించాలంటూ ముఖ్యమంత్రిని ఆయన ఆహ్వానించారు. అవినీతిలేని, పారదర్శక పాలనకోసం రాష్ట్రంలో తీసుకుంటున్న చర్యలను సీఎం వివరించారు. దీనివల్ల భూములు, నీళ్లు, కరెంటు రేట్లు తగ్గుతాయని, పారిశ్రామిక వర్గాలకు మేలు జరుగుతుందని జపాన్‌ కాన్సులేట్‌ జనరల్‌కు సీఎం వివరించారు.

  Andhra Pradesh10, Aug 2019, 7:28 PM IST

  ఎమ్మెల్సీ అభ్యర్థులపై జగన్ వ్యూహం: ఇద్దరు ఫైనల్, మూడో అభ్యర్థిపై మల్లగుల్లాలు

  ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. మూడు ఎమ్మెల్సీ స్థానాలకు గానూ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఛాన్స్ ఇవ్వగా, మాజీ ఐపీఎస్ అధికారి మహ్మద్ ఇక్బాల్ కు కూడా అవకాశం ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇకపోతే మూడో అభ్యర్థిపై జగన్ మల్లగుల్లాలు పడుతున్నారు. 

 • కాపు రిజర్వేషన్ల అంశం రాజకీయంగా ఆయా పార్టీలపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. దీంతో ఈ విషయమై అధికార, విపక్షాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి.ఇందులో భాగంగానే కాపు రిజర్వేషన్ల అంశంపై టీడీపీ, వైఎస్ఆర్‌సీపీలు అడుగులు వేస్తున్నాయి.

  Andhra Pradesh6, Aug 2019, 10:41 AM IST

  జగన్‌కు పరీక్ష: ఎమ్మెల్సీ పదవులకు పోటాపోటీ

  మ్మెల్సీ పదవిని దక్కించుకొనేందుకు వైఎస్ఆ‌ర్‌సీపీలో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 26 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 

 • జిల్లా వైసీపీ అధ్యక్షుడు హోదాలో ఉన్న మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ను సంప్రదించకుండా ఆమె వైసీపీలో చేరిపోయారు. వెంటనే చిలకలూరిపేటలో ప్రెస్మీట్ పెట్టి తానే నియోజకవర్గ ఇంచార్జ్ అంటూ ప్రకటించేసుకున్నారు. ఈ వ్యవహారంతో మర్రి రాజశేఖర్ అలకబూనారు.

  Andhra Pradesh7, Jun 2019, 8:38 PM IST

  ఈయన విషయంలో జగన్ మాట తప్పారు

  జగన్ హామీ ఇవ్వడంతో ఇక ఏపీ కేబినెట్ లో మర్రి రాజశేఖర్ కు అంతా మంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ అనూహ్యంగా జగన్ ఆయనకు మెుండి చేయి చూపడంతో అంతా నివ్వెరపోయారు. మర్రి రాజశేఖర్ అభిమానులు నిరాశ చెందారు. అయితే వైయస్ జగన్ మాటతప్పడు మడమ తిప్పడంటూ రాజకీయాల్లో పేరుంది.

  అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కూర్పుపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా హర్షం వ్యక్తం చేస్తోంది. వ్యూహాత్మకంగా ఎవరి అంచనాలకు అందకుండా జగన్ తన కేబినెట్ కూర్పు చేశారు. ప్రజా సంకల్పయాత్రలో, పార్టీలో చేరినప్పుడు జగన్ హామీ ఇచ్చిన వారందరికీ మంత్రి పదవులు దక్కాయని తెలుస్తోంది. 

  అయితే గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంకు చెందిన కీలక నేత మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చిలకలూరుపేట నియోజకవర్గంలో పర్యటించిన జగన్ చిలకలూరిపేట నియోజకవర్గ అభ్యర్థి విడదల రజనీని గెలిపిస్తే మర్రి రాజశేఖర్ ను మంత్రిని చేస్తానంటూ లక్షలాది మంది సాక్షిగా జగన్ హామీ ఇచ్చారు. 

  జగన్ హామీతో నియోజకవర్గం కార్యకర్తలంతా సంబరాలు చేసుకున్నారు. ఎన్నికల్లో విడదల రజనీ గెలవడం, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఖాయమని నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. 

  జగన్ హామీ ఇవ్వడంతో ఇక ఏపీ కేబినెట్ లో మర్రి రాజశేఖర్ కు అంతా మంత్రి పదవి ఖాయమని భావించారు. కానీ అనూహ్యంగా జగన్ ఆయనకు మెుండి చేయి చూపడంతో అంతా నివ్వెరపోయారు. మర్రి రాజశేఖర్ అభిమానులు నిరాశ చెందారు. 

  వాస్తవానికి నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారు మర్రి రాజశేఖర్. 2014 ఎన్నికల్లో ప్రత్తిపాటి పుల్లారావు చేతిలో ఆయన ఓటమి చెందారు. ఆ తర్వాత 2019లో టికెట్ ఆయనకు ఇవ్వకుండా విడదల రజనీకి ఇచ్చారు జగన్. 

  విడదల రజనీ కోసం టికెట్ సైతం త్యాగం చేశారు. అంతేకాదు నియోజకవర్గంలో గెలుపుకోసం అహర్నిశలు శ్రమించారు. ఆయన శ్రమకు తగ్గ ప్రతిఫలం వస్తుందని అంతా భావించినా చివరలో నిరాశే మిగిలింది. 

  అయితే వైయస్ జగన్ మాటతప్పడు మడమ తిప్పడంటూ రాజకీయాల్లో పేరుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మర్రి రాజశేఖర్ కు రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ లో ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అంటే మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి దక్కాలంటే మరో రెండున్నరేళ్లు వేచి చూడాల్సిందేనన్నమాట. 

 • అదే రాధా వైసీపీలో ఉండిఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే అయి ఉండేవారని చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యేకాకపోయినా నామినేటెడ్ పదవి అయినా ఇచ్చేవారని కానీ రాధా తొందర పడ్డారని బెజవాడ వాసులు అభిప్రాయపడుతున్నారు.

  Andhra Pradesh assembly Elections 201924, May 2019, 7:43 PM IST

  జగన్ కేబినెట్: ఐదుగురు ఫిక్స్, మిగిలిన వారు వీరేనా......

  జగన్ ముఖ్యమంత్రిగా విజయవాడలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో జగన్ తోపాటు మంత్రులుగా ఎవరెవెరు ప్రమాణ స్వీకారం చేస్తారా అంటూ ఆసక్తికర చర్చ జరుగుతోంది. 

   

 • ambati rambabu

  Andhra Pradesh17, Apr 2019, 6:50 PM IST

  స్పీకర్ కోడెలపై సిఈవోకి వైసీపీ ఫిర్యాదు

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై ఫిర్యాదు చేశారు. ఇనిమెట్లలోని 160 పోలింగ్ బూత్ లో కోడెల శివప్రసాదరావు దౌర్జన్యానికి దిగారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అందుకు సంబంధించి వీడియోలను అందజేశారు. దౌర్జన్యానికి సంబంధించి రాజుపాలెం పీఎస్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పదించలేదని పేర్కొన్నారు. 

 • marri rajasekhar

  Andhra Pradesh15, Apr 2019, 5:15 PM IST

  గెలుపుపై ఎవరి ధీమా వారిదే: చెప్పనలవి కాని మర్రి రాజశేఖర్ జోష్

  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తోందని రకరకాల సర్వేలు వెలువడుతుండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కంటే ఆ పార్టీ కీలక నేత మర్రి రాజశేఖర్ తెగ ఎంజాయ్ చేస్తున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్  పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తుంటే చాలు ఆయన  మెుఖంలో ఆనందానికి అంతేలేకుండా పోతుందట.