Asianet News TeluguAsianet News Telugu
10 results for "

Maratorium

"
October to December will be a testing quarter for banks: Union Bank chiefOctober to December will be a testing quarter for banks: Union Bank chief

డిసెంబర్ వరకూ మళ్ళీ మారటోరియం పొడిగింపు..?

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం టెస్టింగ్ పీరియడ్ అని యూనియన్ బ్యాంక్ ఎండీ, సీఈఓ రాజ్ కిరణ్ రాయ్ పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకుని రుణ వాయిదాలు చెల్లించాలన్నా మరో దఫా మారటోరియం విధించక తప్పదంటున్నారు. లేకపోతే మొండి బాకీలు పెరిగిపోయే అవకాశం ఉన్నదని సీనియర్ బ్యాంకర్లు అభిప్రాయ పడుతున్నారు.
 

business Jul 8, 2020, 1:23 PM IST

supreme court directs Centre and RBI to review loan moratorium schemesupreme court directs Centre and RBI to review loan moratorium scheme

మారటోరియంపై పట్టించుకోకుంటే ఎలా.. కేంద్రం తీరుపై సుప్రీం కోర్టు అసంతృప్తి..

మారటోరియంలో రుణాలపై వడ్డీ వసూలు చేసే విషయాన్ని సమీక్షించాలని కేంద్రం, ఆర్బీఐని  సుప్రీంకోర్టు ఆదేశించింది. మారటోరియం సమస్య పరిష్కారానికి నూతన మార్గదర్శకాలు తీసుకొచ్చేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ)కు దేశ అత్యున్నత న్యాయస్థానం సూచించింది.

business Jun 18, 2020, 12:13 PM IST

private bank icici extends moratorium on credit card duesprivate bank icici extends moratorium on credit card dues

క్రెడిట్ కార్డు వాడుతున్నారా... అయితే మీకో గుడ్ న్యూస్..

కరోనా వైరస్ వ్యాప్తి వల్ల సామాన్య ప్రజలు, ఉద్యోగుల, వ్యాపారుల ఆదాయం తగ్గిపోయింది. ఉద్యోగులు క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేకపోతున్నా వారికి  గుడ్ న్యూస్. ఏంటంటే ప్రైవేట్ రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు తీయని కబురు అందించింది. క్రెడిట్ కార్డు బిల్లుపై మారటోరియం ఫెసిలిటీ అందిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. 

business Jun 1, 2020, 3:49 PM IST

What is EMI and how is it calculated? All FAQs on equated monthly installment answered hereWhat is EMI and how is it calculated? All FAQs on equated monthly installment answered here

తస్మాత్ జాగ్రత్త!: ఈఎంఐల వాయిదా.. అసలుపై అదనపు భారం

కరోనా ‘లాక్ డౌన్’తో ప్రజల కష్టాలు రెట్టింపయ్యాయి. ఆదాయాలు తగ్గిపోయాయి. ఫలితంగా వివిధ అవసరాలకు రుణాలు తీసుకున్న వారు ఈఎంఐల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి తాత్కాలికంగా పరిష్కారం చూపుతూ ఆర్బీఐ మార్చి 27న విధించిన గడువు ఈ నెలతో ముగుస్తుంది. అలాగే లాక్ డౌన్ ఈ నెల 17 వరకు పొడిగించడంతో పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. మరో మూడు నెలలు మారటోరియం పొడిగించాలని ఆర్బీఐకి వినతులు వెల్లువెత్తుతున్నాయి.
 

Coronavirus India May 7, 2020, 12:11 PM IST

RBI may extend moratorium on loans by another 3 monthsRBI may extend moratorium on loans by another 3 months

ఆగస్టు వరకు నో ప్రాబ్లం: ఈఎంఐ చెల్లింపులపై మరో 3 నెలల మారటోరియం?

కరోనా వైరస్ నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఈ నెల 17కు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. మార్చి 24న తొలిసారి లాక్ డౌన్ ప్రకటించిన మూడు రోజులకు రుణ వాయిదాల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం ఈ నెలాఖరుతో చెల్లిపోనున్నది. కానీ లాక్ డౌన్ ఈ నెల 17 వరకు పొడిగించడంతో ప్రజల వద్ద తగిన ఆదాయాలు కనిపించే అవకాశాల్లేవు. ఈ క్రమంలోనే రుణ వాయిదాల చెల్లింపుపై మరో మూడు నెలల మారటోరియం విధించే అంశాన్ని ఆర్బీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Coronavirus India May 5, 2020, 10:30 AM IST

Small business credit worth Rs 2.32 lakh crore at highest risk of defaultSmall business credit worth Rs 2.32 lakh crore at highest risk of default

దివాళా అంచున ‘చిన్న’కంపెనీలు.. బ్యాంకులకు పొంచి ఉన్న ప్రమాదం...

కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ వల్ల చిన్న కంపెనీలు ‘దివాలా’ ముప్పును ఎదుర్కోనున్నాయని సిబిల్ హెచ్చరించింది. సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు చెందిన రూ.2.32 లక్షల కోట్ల రుణాలు మొండి బాకీలుగా మారతాయని ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు చిన్న, మధ్య తరహా సంస్థలకు రుణ వాయిదాల చెల్లింపులపై ఆరు నెలల మారటోరియం విధించాలని ఆర్బీఐ, కేంద్రాన్ని ఇండియన్ బ్యాంకర్స్ అసోసియేషన్ కోరడం గమనార్హం.
 

business Apr 23, 2020, 2:14 PM IST

indian banks bet on retial loans may have misfired due to coronavirus pandamicindian banks bet on retial loans may have misfired due to coronavirus pandamic

బ్యాంకు కస్టమర్లకు షాక్‌ : క్రెడిట్, పర్సనల్ లోన్స్ కష్టమే...

కరోనా కష్టాలు అన్నీఇన్నీ కావు.. ఇప్పటికే బయటకు వెళ్లలేక కొందరు.. ఉద్యోగాలు కోల్పోయి మరి కొందరు ఇబ్బందుల్లో పడ్డారు. మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు క్రెడిట్ కార్డుల రుణ పరిమితి తగ్గించడంతోపాటు రిటైల్ రుణాల జారీపై బ్యాంకర్లు ఆంక్షలు విధిస్తున్నారు.
 

Coronavirus India Apr 22, 2020, 1:42 PM IST

No EMI payments for home, car, and corporate and other loans for 3 months says RBINo EMI payments for home, car, and corporate and other loans for 3 months says RBI

లోన్స్ పై రిలీఫ్: కానీ ఈఎంఐ ప్లస్ క్రెడిట్ బకాయిలు తడిసి మోపెడ్

అసలు ఆర్థిక మందగమనంలో ఉన్న భారతీయులపై కరోనా పిడుగు పడింది. దాదాపు ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రుణ గ్రహీతలు వాయిదాల చెల్లింపులపై మూడు నెలల మారటోరియం విధిస్తూ ఆర్బీఐ వెసులుబాటు కల్పించింది. కానీ, వివిధ రకాల రుణాల వాయిదాలు, క్రెడిట్ కార్డు చెల్లింపులు కలిసి మారటోరియం తర్వాత తడిసి మోపెడవుతుంది. కనుక ఈఎంఐల చెల్లింపులు సకాలంలో చేయడమే బెటర్ అని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

business Mar 28, 2020, 8:33 AM IST

What 3 month moratorium on repayment of term loans means for borrowersWhat 3 month moratorium on repayment of term loans means for borrowers

మారటోరియం: క్రెడిట్ కార్డు హోల్డర్లకు రిజర్వ్ బ్యాంక్ చేదు వార్త


అన్ని రకాల రుణాలపై మూడు నెలల పాటు మారటోరియం విధిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం గృహ, ఇతర రుణాలను తీసుకున్న వినియోగదారులకు ఈఎంఐ చెల్లింపుల నుంచి మూడు నెలల మినహాయింపునిచ్చింది.

business Mar 27, 2020, 3:02 PM IST

India Inc seeks fiscal stimulus, moratorium on debt repayment to mitigate coronavirus impactIndia Inc seeks fiscal stimulus, moratorium on debt repayment to mitigate coronavirus impact

మారటోరియం ప్లీజ్.. లేదంటే...!! కేంద్రానికి సీఐఐ, అసోచామ్ డిమాండ్లు

ఈ నేపథ్యంలో అటు కార్పొరేట్‌, ఇటు వ్యక్తిగత రుణాల చెల్లింపులపై మారటోరియం ఇవ్వాలని వ్యాపార, పారిశ్రామిక రంగాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. రుణ చెల్లింపులు, పన్ను కోతలపై ఏడాదిపాటు విరామం ఇవ్వాలని దేశీయ పరిశ్రమ డిమాండ్‌ చేస్తున్నది.

business Mar 23, 2020, 10:51 AM IST