Search results - 111 Results
 • ktr

  Telangana23, Mar 2019, 6:59 PM IST

  ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కుంటున్నాం: చేవెళ్ల ప్రచారంలో కేటీఆర్

  ఎక్కడ కోల్పోయామో అక్కడే వెతుక్కోవాలన్న పెద్దల మాటలను తాను విశ్వసిస్తానని... అందువల్లే చేవెళ్ల లోక్ సభ స్థానంపై ప్రత్యేక దృష్టి పెట్టిపట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. గత ఎన్నికల సందర్భంగా తమ పార్టీ నుండి ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారని గుర్తుచేశారు. ఇలా కోల్పోయిన స్థానాన్ని మళ్లీ గెలుచుకుని సత్తా చాటతామన్న నమ్మకం వుందని కేటీఆర్ అన్నారు. 
   

 • Kavitha Nominations
  Video Icon

  Election videos22, Mar 2019, 6:12 PM IST

  నామినేషన్ దాఖలు: ఎమ్మెల్యే నడిపిన గులాబీ కారులో కవిత (వీడియో)

  నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత నామినేషన్ వేసేందుకు ఇంటి నుంచి గులాబీ రంగు అంబాసిడర్ కారులో కలెక్టరేట్ కు వెళ్లారు. ఆ కారును నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీగాల గణేశ్ గుప్తా నడిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెనక కూర్చున్నారు. ఈ సందర్భంగా ఎంపి కవిత నివాసం ముందు టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానంతో పిలిపించుకున్న మహారాష్ట్రకు చెందిన డోలు కళాకారులు వాయిద్యాల హోరుతో సందడిగా మారింది.

 • Telangana22, Mar 2019, 1:54 PM IST

  మహమూద్ అలీని కలిసిన తలసాని సాయికిరణ్ యాదవ్

  రాష్ట్ర హోంమంత్రి శ్రీ మహమూద్ అలీ గారిని శుక్రవారం సికింద్రాబాద్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్ మర్యాద పూర్వకంగా కలిశారు. 

 • ranjith reddy
  Video Icon

  Election videos22, Mar 2019, 1:48 PM IST

  కనకదుర్గ గుడిలో రంజిత్ రెడ్డి దంపతుల పూజలు (వీడియో)

  చేవెళ్లి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) లోకసభ అభ్యర్థి రింజిత్ రెడ్డి హైదరాబాదులోని బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లో గల కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సతీమణితో కలిసి ఆయన ఈ పూజలు చేశారు.

 • నల్గొండ నుండి సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థానం నుండి కేసీఆర్ కూడ పోటీ చేస్తారనే ప్రచారం కూడ లేకపోలేదు. సుఖేందర్ రెడ్డి పోటీకి విముఖత చూపితే తేరా చిన్నపరెడ్డి లేదా ప్రముఖ బిల్డర్ వి. నర్సింహారెడ్డిని బరిలోకి దింపే అవకాశం ఉంది. మల్కాజిగిరి నుండి నవీన్‌రావు, చేవేళ్ల నుండి రంజిత్‌ రెడ్డి, సికింద్రాబాద్‌ నుండి మంత్రి తలసాని తనయుడు సాయి కిరణ్ పోటీ చేసే అవకాశం ఉంది.

  Telangana21, Mar 2019, 7:56 PM IST

  లోక్ సభ అభ్యర్ధుల ఎంపికలో కేసీఆర్ సంచలన నిర్ణయం...గుత్తాకు దక్కని చోటు

  దేశ రాజకీయాలను శాసించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నల్గొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేంధర్ రెడ్డికి ఈసారి లోక్ సభ ఎన్నికలకు దూరం పెట్టారు. ఆయన ప్రస్తుతం సిట్టింగ్ గా కొనసాగుతున్న నల్గొండ లోక్ సభ నియోజవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా వేంరెడ్డి నర్సింహా రెడ్డి పోటీ చేయనున్నట్లు కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు.  

 • BJP New

  Lok Sabha Election 201921, Mar 2019, 7:42 PM IST

  182 మందితో బీజేపీ ఎంపీ అభ్యర్ధుల తొలి జాబితా: వారణాసి నుంచి మోడీ

  పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా బీజేపీ 182 మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఢిల్లీలో కేంద్రమంత్రి జేపీ నడ్డా అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. 

 • Namanageshwar rao
  Video Icon

  Election videos21, Mar 2019, 3:38 PM IST

  టీఆర్ఎస్ లో చేరిన నామా మాటలు ఇవే (వీడియో)

  తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే, సుఖ సంతోషాలతో ఉండాలంటే కెసిఆర్ నాయకత్వం  తెలంగాణలో ఉండాలని నామా నాగేశ్వర రావు అన్నారు. టీడీపి మాజీ ఎంపీ నామా నాగేశ్వర రావు టీఆర్ఎస్ లో చేరిన తర్వాత గురువారం మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేస్తామని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ లో చేరుతున్నానని ఆయన చెప్పారు. తాగునీరు, సాగునీరు, సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీ అధినేత ఆదేశానుసారం నడుచుకుంటానని చెప్పారు.

 • shobha rani

  Telangana21, Mar 2019, 2:21 PM IST

  టిడిపికి మరో షాక్: కారెక్కడానికి సిద్దమైన రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు

  తెలంగాణ లో ప్రతిపక్ష పార్టీల నుండి అధికార టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతూనే వున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్,టిడిపి ల నుండి పలువురు ఎమ్మెల్యేలు, కీలక నాయకులు టీఆర్ఎస్ గూటికి చేరారు. తాజాగా వారి బాటలోనే రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి కూడా టిడిపికి ఝలక్ ఇవ్వడానికి సిద్దమయ్యారు. ఆమె సైకిల్ దిగి కారెక్కడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. 
   

 • pawan kalyan

  Andhra Pradesh20, Mar 2019, 8:35 PM IST

  జనసేనలో చేరిన నాగబాబు.... కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్ (ఫోటోలు)

  జనసేనలో చేరిన నాగబాబు.... కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్  

 • టీడీపీలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావును టీఆర్ఎస్‌లో చేర్చడంలో హరీష్ రావు కీలకంగా వ్యవహరించారు. దయాకర్ రావు టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత కేసీఆర్‌కు, కేటీఆర్‌కు అత్యంత నమ్మకస్తుడిగా మారాడు.

  Telangana20, Mar 2019, 3:12 PM IST

  ఆ ఎమ్మెల్యేలు సొంత ఇమేజ్‌తో గెలిచారు...పార్టీ బలంతో కాదు: మంత్రి ఎర్రబెల్లి

  గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు‌గా పోటీ చేసి గెలుపొందిన ఎమ్మెల్యేలు పార్టీ బలంతో కాకుండా సొంత ఇమేజ్ తో మాత్రమే గెలిచారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగినప్పటికి అక్కడక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలుపొందడానికి కారణమదేనని తెలిపారు. ఇలా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలు నియోజకవర్గ ప్రజల అభిప్రాయాలు, సూచనలను అనుసరించి టీఆర్ఎస్ లో చేరుతున్నారన్నారని అన్నారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలు తమ నాయకులు టిఆర్ఎస్ లో చేరాలని కోరుకుంటున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

 • kcr

  Telangana19, Mar 2019, 9:08 PM IST

  నిజామాబాద్‌లొ టీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ప్రచార సభ: పాల్గొన్న కేసీఆర్ (ఫోటోలు)

  నిజామాబాద్‌లొ టీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ప్రచార సభ: పాల్గొన్న కేసీఆర్ 

 • modi vs chandra babu naidu
  Video Icon

  Election videos19, Mar 2019, 5:03 PM IST

  ప్రతిపక్ష ఎమ్మెల్యేల పని చేయలేదు: అంగీకరించిన చంద్రబాబు (వీడియో)

  ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పను చేయలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వయంగా అంగీకరించారు. గౌరు చరితా రెడ్డిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. ఆమె నా దగ్గరికి వచ్చిన పనులు అడిగారని, ప్రతిపక్షంలో కూడా ఉన్నారు కాబట్టి చేయలేదని ఆయన అన్నారు. గౌరు చరితా రెడ్డి వైసిపికి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపి అభ్యర్థిగా గౌరు చరితా రెడ్డి పాణ్యం నుంచి పోటీ చేస్తున్నారు.

 • asaduddin owaisi

  Telangana19, Mar 2019, 11:08 AM IST

  17.84 కోట్లు, 2 తుపాకులు.. ఇవి అసదుద్దీన్ ఆస్తులు

  ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆస్తుల విలువ గణనీయంగా పెరిగింది. 2014 ఎన్నికల సమయంలో రూ. 3.94 కోట్లుగా ఉన్న ఆయన కుటుంబ ఆస్తి ప్రస్తుతం రూ.17.84 కోట్లకు చేరినట్లు అసదుద్దీన్ ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. 

 • ktr

  Telangana18, Mar 2019, 9:00 PM IST

  రేవంత్ రెడ్డి కేవలం పేపర్, ప్లెక్సీ పులి: కేటీఆర్ సెటైర్లు

  ముఖ్యమంత్రి కేసీఆర్ పై మళ్ళీ విమర్శలు ప్రారంభించిన రేవంత్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎదురుదాడికి దిగారు. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టడం వల్లే పెద్ద నాయకుడన్న పేరు తెచ్చుకోవాలని కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి భావిస్తున్నారన్నారు. కానీ అలా వ్యక్తిగత దూషణలకు దిగితే ఎప్పటికీ పెద్ద నాయకుడు కాలేరన్నారు. తనకు తాను ఓ పులి అని ఊహించుకునే రేవంత్ నిజానికి పేపర్, ప్లెక్సీ పులి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

 • kavitha

  Telangana18, Mar 2019, 8:25 PM IST

  లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనైన ఎంపీ కవిత

  తెలంగాణ లో త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల తర్వాత కేంద్రంలో కీలక పాత్ర పోషించనుందని ఆమె ధీమా  వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె  జగిత్యాల , నిజామాబాద్ లలో పర్యటించారు. ఈ సందర్భంగా రెండు చోట్ల కవిత మీడియాతో మాట్లాడారు.