Search results - 13 Results
 • nagini dance

  Lok Sabha Election 201910, Apr 2019, 8:51 PM IST

  నడిరోడ్డుపై నాగిని డ్యాన్స్ చేసిన కర్ణాటక మంత్రి నాగరాజు (వీడియో)

  దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల వేడి రాజుకుంది. అన్ని రాజకీయ పార్టీలు మరోసారి ప్రజలను ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అందరి మాదిరిగా తాను సాధారణంగా ఓట్లు అభ్యర్థిస్తే కిక్కేముంటుందని అనుకున్నాడో ఏమో కర్ణాటక మంత్రిగారు. తన ప్రచారాన్ని వినూత్స నడిరోడ్డుపై బ్యాండ్ చప్పుళ్ల ముందు నాగిని డ్యాన్స్ చేస్తూ కార్యకర్తలను ఉత్సాహపర్చడమే కాదు మీడియా దృష్టిని కూడా ఆకర్షించి మంచి పబ్లిసిటీ పొందారు. 

 • kumara swamy

  Lok Sabha Election 20193, Apr 2019, 5:08 PM IST

  కర్ణాటక ముఖ్యమంత్రినీ వదలని ఈసీ...

  ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆయన కాన్వాయ్ లోని వాహనాలను ఆపడానికే అధికారులు భయపడుతుంటారు. అలాంటిది ఏకంగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న వాహనాన్నే అధికారులు ఆపి తనిఖీలు నిర్వహించారు. సామాన్యుల వాహనం మాదిరిగానే ఆయన కూడా తనిఖీ చేస్తున్న అధికారులకు సహకరించాల్సి వచ్చింది. ఇలా ముఖ్యమంత్రి వాహనాన్ని కూడా వదలకుండా తనిఖీ చేయడం ద్వారా ఎన్నికల సమయంలో ఈసీ ఎంత నిస్పక్షపాతంగా వ్యవహరిస్తుందో భయటపడింది. 

 • CM Kumaraswamy

  Who will be the next PM కౌన్ బనేగా పిఎం28, Feb 2019, 7:44 PM IST

  ఈసారి మళ్లీ ప్రధానిగా కర్ణాటక వ్యక్తే...నిర్ణయం మీ చేతుల్లోనే: కుమార స్వామి

  కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి  లోక్ సభ ఎన్నికలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక ఓటర్లు సహకరిస్తే మరోసారి కన్నడ వ్యక్తి ప్రధాని పీఠాన్ని అధిరోహించనున్నాడని పేర్కొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో జేడిఎస్-కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను ఎంపీలుగా గెలిపించి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించేలా సహకరించాలని కుమార స్వామి ప్రజలను కోరారు. 

 • Siddaramaiah

  NATIONAL28, Jan 2019, 4:56 PM IST

  కుమారస్వామి హెచ్చరిక...కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నోటీసులు

  కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.బిజెపిని ఎదుర్కోడానికి కలిసిపోయిన కాంగ్రెస్-జేడిఎస్ పార్టీల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. జేడిఎస్ పార్టీని, ముఖ్యమంత్రి కుమార స్వామిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత కొన్ని రోజులుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే.  తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు తమ సంకీర్ణ బంధాన్ని దెబ్బతీసేలా ఉండటం సీఎం కుమార స్వామి సీరియస్ అయ్యారు. దీంతో సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అదిష్టానం చర్యలకు సిద్దమైంది.

 • amit

  NATIONAL17, Jan 2019, 6:22 PM IST

  కన్నడ రాజకీయాల్లో వేలు ...అమిత్‌షాకి స్వైన్ ఫ్లూ: కాంగ్రెస్ నేత వ్యాఖ్యలు

  బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత బీకే హరిప్రసాద్. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నించడం వల్లే అమిత్ షాకు స్వైన్ ఫ్లూ సోకిందన్నారు.

 • kpcc president

  NATIONAL4, Jul 2018, 5:33 PM IST

  కర్ణాటక పిసిసి చీఫ్ గా మాజీ ముఖ్యమంత్రి తనయుడు

  కర్ణాటక కాంగ్రెస్ కమిటీ నూతన అద్యక్షడిగా ఎమ్మెల్యే దినేష్ గుండూరావును నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఎనిమిదేళ్ల పాటు కెపిసిసి చీఫ్ గా పనిచేసిన పరమేశ్వర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్ లో స్థానం దక్కించుకుని కెపిసిసి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడానికి చాలామంది సీనియర్లు విశ్వప్రయత్నాలు చేశారు. చివరకు ఈ పదవి దినేష్ గుండూరావును వరించింది.

 • NATIONAL30, Jun 2018, 4:57 PM IST

  జేడిఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తెస్తే అధికారం మనదే : యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు

  కర్ణాటక లో అధికారాన్ని మళ్లీ చేజిక్కించుకునే అవకాశాలు తమకున్నాయని మాజీ ముఖ్యమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అధికారం రావాలంటే ప్రతి బిజెపి కార్యకర్త, నాయకులు జేడియస్ ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకోవాలని సూచించారు. అవసరమైతే వారి ఇళ్లకు వెళ్లి వారిని బిజెపికి మద్దతిచ్చేలా ఒప్పించాలని సూచించారు. 

 • devegowda

  15, Jun 2018, 11:20 AM IST

  86 ఏళ్ల వయసులోనూ ఈ మాజీ ప్రధాని ఫిట్ నెస్ చూశారా?

  ప్రస్తుతం ప్రముఖ రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సీనీ ప్రముఖులు, సెలబ్రిటీలు ఫిట్ నెస్ చాలెంజ్ పేరుతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో చాలా మంది కేవలం ప్రచారం కోసమే ఫిట్ నెస్ చాలెంజ్ ను స్వీకరించి ఎప్పుడూ చేయని ఎక్సర్ సైజ్ లు చేస్తున్నారు. కానీ ఈ 86 ఏళ్ల మాజీ ప్రధాని తనకు ఈ ఛాలెంజ్ లు ఏవీ అవసరం లేదని నిరూపించారు. ఇప్పుడు కాదు తాను చాలా ఏళ్ల నుండి తన ఫిట్ నెస్, ఆరోగ్యం కాపాడుకునే పనిలోనే ఉన్నానని తెలియజేశారు. ఇంతకూ ఆ ఫిట్ నెస్ మాజీ ప్రధాని ఎవరనుకుంటున్నారా? ఆయనేనండీ కర్ణాటక కురువృద్దుడు, రాజకీయ ఉద్దండుడు దేవె గౌడ.

 • 13, Jun 2018, 11:38 AM IST

  ప్రధాని ఫిట్ నెస్ చాలెంజ్ కు కర్ణాటక సీఎం కుమారస్వామి కౌంటర్ ట్వీట్

  దేశంలో ఇపుడు ''ఫిట్ నెస్ చాలెంజ్'' యుగం కొనసాగుతోంది. సెలబ్రిటీలతో పాటు ప్రముఖ రాజకీయ నాయకులు ఒకరికి ఒకరు ఈ ఫిట్ నెస్ చాలెంజ్ విసురుకుంటున్నారు. ‘హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌’ అన్న నినాదంతో దేశం మొత్తం ఫిట్ గా ఉండేందుకు ఈ చాలెంజ్ కొనసాగుతోంది. అయితే ఈ ఫాట్ నెస్ చాలెంజ్ ను ప్రారంభించిన కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ టీంఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ చాలెంజ్ విసిరిన విషయం తెలిసిందే. ఆయన దీన్ని స్వీకరించి ప్రధాని మోదీ కి చాలెంజ్ విసిరారు. దీంతో కొహ్లీ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ను స్వీకరించిన ప్రధాని నరేంద్ర మోదీ ఓ ఫిట్‌నెస్‌ వీడియోను ఇవాళ పోస్ట్‌ చేశారు.