Huzur Nagar Byelection
(Search results - 6)TelanganaOct 19, 2019, 5:06 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: ఆన్ స్క్రీన్ బంద్... ఆఫ్ స్క్రీన్ సీన్ షురూ!
ఈ నెల 21వ తేదీన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఉప ఎన్నికకు ప్రచారం ముగిసింది. ఈ ఉప ఎన్నికతోపాటు మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. వాటికి సంబంధించిన ప్రచారం కూడా ముగిసింది.
TelanganaOct 19, 2019, 1:50 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: కారుకు ఈసీ దెబ్బలు, సైదిరెడ్డి మిత్రుడి బడిలో సోదాలు
హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార తెరాస పార్టీకి ఎన్నికల సంఘం షాకుల మీద షాకులు ఇస్తుంది. నిన్న హుజూర్ నగర్ లోని తెరాస అభ్యర్థి సైది రెడ్డి మిత్రుడి స్కూల్ లో ఆదాయపన్ను విభాగం సోదాలు నిర్వహించింది. సైది రెడ్డి ఆప్త మిత్రుడైన రవికుమార్ నిర్వహిస్తున్న పాఠశాలలో నిన్న సోదాలు జరగడం అక్కడ చర్చనీయాంశంగా మారింది.
TelanganaOct 13, 2019, 7:22 AM IST
కెసిఆర్ కు ఆర్టీసీ కార్మికుల ఉసురు తగిలి తీరుతుంది: ఉత్తమ్
ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేసారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యాయత్నానికి కెసిఆర్ దే బాధ్యత అని తెలిపారు. కార్మికుల ఆకలి కేకలు కెసిఆర్ కు వినిపించడం లేదా అంటూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
TelanganaOct 1, 2019, 6:00 PM IST
హుజూర్ నగర్ ఉప ఎన్నిక: విజయం కోసం సిద్దాంతాలు చిత్తు (వీడియో)
రాష్ట్రంలో ఇంత జోరు వానల మధ్యకూడా కాక పుట్టిస్తున్న అంశం ఏదన్నా ఉందంటే అది నిస్సంకోచంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికే. నిన్నటితో నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. అన్ని ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తమ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. తెరాస నాయకత్వం మండలానికో మంత్రిని ఇంచార్జిగా నియమించి ప్రచారంలో దూసుకుపోతుంది. మరోపక్క కాంగ్రెస్ ఏమో సహజంగానే నల్గొండ జిల్లాపై తమకున్న పట్టును ఉపయోగించుకొని గట్టెక్కాలని ప్రయత్నిస్తుంది.
TelanganaOct 1, 2019, 4:25 PM IST
హుజూర్ నగర్ ఉపఎన్నిక: కారు వెనక సీట్లో సిపిఐ ఎందుకంటే..
సిపిఐ తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందుకోసం ఏ ఎన్నికల్లోనైనా పోటీ మాత్రమే చేస్తే సరిపోదు. సీట్లను కూడా గెలవాలి. అప్పుడే పార్టీకి మనుగడ ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన సిపిఐ ఆ దిశలోనే అడుగులు వేస్తుంది.
TelanganaSep 29, 2019, 3:53 PM IST
నియంత పాలనకు తెలంగాణ ఆడపడుచులే బుద్ధి చెబుతారు: కోమటిరెడ్డి
కోమటి రెడ్డి వెంకటరెడ్డి హుజూర్ నగర్ ఉప ఎన్నిక గురించి మాట్లాడుతూ కెసిఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేసారు. తెలంగాణ ఆడపడుచుకు నియంత పాలనకు మధ్య జరుగుతున్న యుద్ధంగా ఈ ఉప ఎన్నికను కోమటిరెడ్డి వెంకటరెడ్డి అభివర్ణించారు.