Honda  

(Search results - 43)
 • bikes

  Bikes29, Sep 2019, 11:47 AM IST

  గిఫ్ట్ ఓచర్లు.. గ్రైండర్లు.. బైక్స్ డీలర్స్ ఆఫర్స్ ఇలా

  తొమ్మిది నెలలుగా ఆటోమొబైల్ సంస్థలు కార్ల విక్రయాలు పడిపోయి దిగాలు పడ్డాయి. ద్విచక్ర వాహనాల సంస్థలు నాలుగు నెలలుగా సేల్స్ పతనమై ఇబ్బందుల పాలవుతున్న వేళ ప్రస్తుతం మోటారు బైక్ సంస్థల డీలర్లు వినియోగదారులకు పలు రకాల ఆఫర్లు, గిఫ్ట్ ఓచర్లు, రాయితీలు అందిస్తున్నారు.

 • Automobile16, Sep 2019, 2:00 PM IST

  బంపర్ ఆఫర్... హోండా కారు ధరలు తగ్గింపు

  హోండా అమేజ్ కారుపై దాదాపు రూ.42వేల తగ్గింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. దానిలో కార్ ఎక్స్చేంజ్ బోనస్ కింద రూ.30వేలు, ఎక్స్ టెండెడ్ వారెంటీ కింద రూ.12వేలు ఇస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ వినియోగదారులు కార్ ఎక్స్ఛేంజ్ చేసుకోకుండా.. రూ.16వేలు విలువచేసే మొయింట్ నెన్స్  ప్రోగ్రామ్ ని మూడు సంవత్సరాల పాటు అందించనున్నారు.

 • News12, Sep 2019, 2:30 PM IST

  ముందు వరుసలో హోండా:బీఎస్-6 ప్రమాణాలతో యాక్టీవా

  దేశంలో రెండో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌ సైకిల్‌ ఇండియా (హెచ్‌ఎంఎస్‌ఐ) బీఎస్‌-6 ఉద్గార ప్రమాణాలతో రూపొందించిన కొత్త యాక్టివా-125 వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేసింది

 • honda

  Bikes8, Sep 2019, 11:58 AM IST

  ఏడు నెలల ముందే విపణిలోకి హోండా ‘యాక్టీవా 125ఎఫ్ఐ’.. 11న ఆవిష్కరణ

  నిర్దేశించుకున్న లక్ష్యానికి ఏడు నెలల ముందే బీఎస్-6 ప్రమాణాలతో కూడిన స్కూటీ తరహా స్కూటర్‌ ‘హోండా యాక్టీవా 125ఎఫ్ఐ’ని హోండా మోటారు సైకిల్స్ అండ్ స్కూటర్స్ విడుదల చేస్తోంది. 

 • Honda

  Automobile3, Sep 2019, 10:38 AM IST

  దూరం దూరం..! భారత్‌ విపణికి ‘హోండా కార్స్’ సీఆర్-వీ ‘నో’ !!

  ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ తాజాగా హెచ్ఆర్-వీ కారు రూపుదిద్దుకుని, తుది మెరుగులు దిద్దుకుంటున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తుది త్రైమాసికంలో విపణిలో విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తుందని వార్తలొచ్చాయి. కానీ దేశీయంగా కార్ల విక్రయాలు పడిపోయిన నేపథ్యంలో ఇప్పట్లో భారత విపణిలో విడుదల చేసేందుకు హోండా మేనేజ్మెంట్ వెనుకాడుతున్నదని సమాచారం.

 • Andhra Pradesh26, Aug 2019, 8:45 PM IST

  కోడెల షోరూంలో తనిఖీలు: అసెంబ్లీ ఫర్నీచర్ రికవరీ

  అసెంబ్లీ ఫర్నీచర్ వివాదం నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ షోరూంలో అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించారు. వీటిని శాసనసభ ఫర్నిచర్‌గా గుర్తించిన అధికారులు అనంతరం షోరూం నుంచి తరలించారు

 • సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం నుండి కోడెల శివప్రసాదరావును అంబటి రాంబాబు ఓడించాడు. కోడెల శివప్రసాదరావు 2014 నుండి 2019 వరకు ఏపీ అసెంబ్లీకి స్పీకర్‌గా వ్యవహరించాడు.

  Andhra Pradesh10, Aug 2019, 1:23 PM IST

  మాజీ స్పీకర్ కోడెలకు అధికారుల షాక్

  కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్ కు చెందిన గౌతమ్ హోండా షో రూంని అధికారులు సీజ్ చేశారు. పన్నులు చెల్లించకుండా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఐదేళ్లుగా ఈ దందా కొనసాగుతున్నట్లు అధికారుల దర్యాప్తులో తేలింది.

 • Honda

  Automobile30, Jul 2019, 11:33 AM IST

  ఎయిర్ బ్యాగ్స్‌లో టెక్నికల్ ‘స్నాగ్’.. ఐదు వేల కార్ల రీకాల్


  ఎయిర్ బ్యాగ్స్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఐదు మోడల్ కార్లను రీకాల్ చేసినట్లు హోండా కార్స్ తెలిపింది. దేశవ్యాప్తంగా 5,088 కార్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెలలో కార్లను రీకాల్ చేసిన సంస్థల్లో హోండా కార్స్ మూడవది. ఇంతకుముందు ఫోర్డ్, వోల్వో కార్లు తమ కార్లను రీకాల్ చేశాయి. 

 • honda cars

  Automobile12, Jul 2019, 10:35 AM IST

  భారత్ విపణిలోకి న్యూమోడల్ హోండా డబ్ల్యూఆర్‌-వీ

  ప్రముఖ కార్ల తయారీ సంస్థ హోండా కార్స్ భారత దేశ విపణిలోకి న్యూ వేరియంట్ డబ్ల్యూఆర్- వీ మోడల్ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ.9.95 లక్షలుగా నిర్ణయించారు. డీజిల్ వేరియంట్ లోనూ ఈ కారు లభించనున్నది. 
   

 • honda

  cars30, Jun 2019, 1:46 PM IST

  టకాటా ఎయిర్ బ్యాగ్స్ ప్రాబ్లం: 16 లక్షల హోండా కార్లు రీకాల్‌

  టకాటా సంస్థ రూపొందించిన ఎయిర్ బ్యాగ్స్ వల్ల తలెత్తిన ఇబ్బందులతో 16 లక్షల కార్లను రీ కాల్ చేస్తున్నట్లు హోండా కార్స్ ప్రకటించింది. 
   

 • Automobile26, Jun 2019, 10:36 AM IST

  హీరోమోటో, బజాజ్, టీవీఎస్‌లతో హోండా గొంతు.. మోర్ టైం నీడెడ్ ఫర్ ఎలక్ట్రిక్ బైక్స్


  ఆగమేఘాలపై విద్యుత్ మోటారు సైకిళ్లు, స్కూటర్ల వైపు మళ్లాలంటే కష్ట సాధ్యమేనని జపాన్ ఆటో మేజర్ హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ స్పష్టం చేసింది. కర్బన ఉద్గారాల నియంత్రణకు వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్ -6 నిబంధనల అమలు దిశగా ఆటోమొబైల్ పరిశ్రమ వెళుతున్నదని గుర్తు చేసింది. అందులో స్థిరపడ్డాక విద్యుత్ వాహనాల దిశగా వెళితే బాగుంటుందని, దీనిపై అన్ని వర్గాల వారితో సంప్రదించాలని నీతి ఆయోగ్‌కు సూచించింది. 

 • Honda Amaze

  Automobile17, Jun 2019, 11:22 AM IST

  వచ్చేనెల నుంచి హోండా కార్లు ప్రియం!


  పెరిగిన ముడి సరుకు ధరలు, అదనపు భద్రతా ఫీచర్లు జత చేర్చడంతో తమపై పెరిగిన భారాన్ని వినియోగదారులపై కొంత మోపడానికి సిద్ధమైనట్లు హోండా కార్స్ ప్రకటించింది. వచ్చేనెల నుంచి అన్ని రకాల కార్లపై 1.2 శాతం ధరలు పెంచుతున్నట్లు తెలిపింది. ఒకే ఏడాదిలో హోండా కార్స్ కార్ల ధర పెంచడం రెండోసారి కానుంది.

 • activa

  Automobile13, Jun 2019, 1:08 PM IST

  బీఎస్‌-6 ప్రమాణాలతో విపణిలోకి కొత్త హోండా యాక్టివా.. సెప్టెంబర్ నుంచి లభ్యం

  హోండా మోటార్ సైకిల్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) విపణిలోకి ముందుగానే కర్బన ఉద్గారాల నియంత్రణకు బీఎస్ -6 ప్రమాణాలతో కూడిన హోండా యాక్టీవా 125 ఎఫ్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. సెప్టెంబర్ నాటికి ఇది వినియోగదారులకు అందుబాటులోకి రానున్నది. బీఎస్ -4తో కూడిన స్కూటర్‌తో పోలిస్తే బీఎస్ -6 ప్రమాణాలు గల స్కూటర్ ధర 10-15 శాతం పెరుగుతుందని తెలిపింది.

 • Honda unicorn

  Automobile28, May 2019, 11:23 AM IST

  సరికొత్తగా విపణిలోకి హోండా ‘సీబీషైన్ ప్లస్ యాక్టీవా 5జీ’

  హోండా మోటార్ సైకిల్స్ అండ్ స్కూటర్స్ మార్కెట్లోకి సరికొత్తగా హోండా సీబీషైన్, యాక్టీవా 5జీ స్కూటర్ లిమిడెడ్ ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఈ రెండు మోడల్స్ దేశంలో అత్యధికంగా అమ్ముడు పోతున్న బైక్‌లు, స్కూటర్లుగా నిలిచాయి.

 • Honda

  Automobile13, May 2019, 11:13 AM IST

  బీఎస్-6 వచ్చినా డీజిల్ కార్లకు ‘నో’ఢోకా: హోండా

  వచ్చే ఏడాది నుంచి ఆటోమొబైల్ సంస్థలకు కష్టాలు ప్రారంభం కానున్నాయి. కర్బన ఉద్గారాల నియంత్రణ కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీఎస్-6 ప్రమాణాలతో కూడిన కార్ల తయారీపై కేంద్రీకరించాయి ఆటోమొబైల్ సంస్థలు. ఈ ప్రమాణాలతో డీజిల్ ఇంజిన్ల తయారీ ఖర్చుతో కూడిన పని అని, ఆ మోడల్ కార్ల తయారీకే తిలోదకాలిచ్చేస్తున్నాయి. కానీ జపాన్ కేంద్రంగా పని చేస్తున్న హోండా కార్స్ మాత్రం డీజిల్ కార్ల విక్రయాలు సాగిస్తామని చెబుతోంది. ఇప్పటికిప్పుడు డీజిల్ కార్లకు డిమాండ్ తగ్గబోదని పేర్కొంటున్నది.