Faf Du Plessis
(Search results - 7)CricketDec 29, 2020, 7:00 AM IST
పాపం డుప్లిసిస్... 199 పరుగుల వద్ద అవుటై ఆ జాబితాలోకి...
శ్రీలంకతో జరుగుతున్న మొదటి టెస్టులో సౌతాఫ్రికా భారీ స్కోరు చేసింది. అయితే సౌతాఫ్రికా ప్లేయర్ ఫాఫ్ డుప్లిసిస్ 199 పరుగుల వద్ద అవుటై, డబుల్ సెంచరీని మిస్ అయ్యాడు. 276 బంతుల్లో 24 ఫోర్లతో 199 పరుగులు చేసిన డుప్లిసిస్... ఈ స్కోరు వద్ద అవుటైన 11వ ప్లేయర్‌గా నిలిచాడు.
CricketNov 13, 2020, 7:06 PM IST
ధోనీ ఫ్యాన్స్‌కి షాక్... వచ్చే సీజన్లో చెన్నై కెప్టెన్‌గా అతను... రైనా కూడా కాదు!
IPL 2020 సీజన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్‌కి కోలుకోలేని షాక్ ఇచ్చింది. 10 సీజన్లలో ప్లేఆఫ్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్... మొట్టమొదటిసారి ఐపీఎల్ కెరీర్లో ప్లేఆఫ్ చేరకపోగా చెత్త ప్రదర్శనతో ఏడో స్థానానికి పరిమితమైంది. ధోనీ వచ్చే సీజన్లో చెన్నైకి ఆడతానని చెప్పడం మాహీ ఫ్యాన్స్‌కి ఊరటనిచ్చే అంశం. అయితే వచ్చే సీజన్లో ధోనీ షాకింగ్ నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్.
CricketNov 5, 2020, 4:57 PM IST
ధోనీ, డుప్లిసిస్ కలిసి కుమ్మేశారు... బర్త్ డే పార్టీలో కుర్రాడిని పట్టుకుని...
IPL 2020 సీజన్లో ప్లేఆఫ్ స్టేజీకి అర్హత సాధించలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్. ధోనీ నాయకత్వంలోని సీఎస్కే, తొలిసారిగా పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి పరిమితమైంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ డుప్లిసిస్ ఈ సీజన్లో అద్భుతంగా రాణించి, అత్యధిక పరుగులు చేసిన సీఎస్కే ప్లేయర్‌గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం 14 మ్యాచుల్లో కలిపి 200 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
CricketNov 2, 2020, 7:57 PM IST
ఐపీఎల్ నుంచి పాకిస్థాన్‌కి... పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడబోతున్న చెన్నై ప్లేయర్!
IPL 2020: ఛాలెంజింగ్ తీసుకుని దుబాయ్ వేదికగా నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగింపు దశకు చేరుకుంది. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ గ్రూప్ స్టేజ్ నుంచి నిష్కమించడం ఈ 2020 సీజన్లో ఊహించని సంఘటన. ధోనీ టీమ్ వెళుతూ వెళుతూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను కూడా వెంటతీసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ కూడా గ్రూప్ స్టేజ్ నుంచి నిష్కమించగా మిగిలిన జట్ల మధ్య ప్లేఆఫ్ రేసు జరుగుతోంది.
CricketMar 3, 2020, 8:32 AM IST
భారత్ తో దక్షిణాఫ్రికా వన్డే సిరీస్... జార్జ్ లిండేకి చోటు, డుప్లెసిస్ రీ ఎంట్రీ
భారత పర్యటనకు చైనామన్ స్పిన్నర్ తబ్రీజ్ షమ్సీ దూరమయ్యాడు. తన భార్య ప్రసవం కారణంగా ఈ టూర్ నుంచి అతడు తప్పుకున్నాడు. షమ్సీ స్థానంలో ఎడమచేతి వాటం స్పిన్నర్ జార్జ్ లిండేకు అవకాశం ఇచ్చారు. ఇక గాయం కారణంగా స్టార్ పేసర్ కగిసో రబాడ దూరమైన సంగతి తెలిసిందే.
CRICKETMay 24, 2019, 11:05 PM IST
నా జట్టులో డుప్లెసిస్, బుమ్రాలు తప్పనిసరి: కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డుప్లెసిస్ లాంటి ఆటగాడు ఎప్పుడూ తన జట్టులో వుండాలని కోరుకుంటానని అన్నాడు. అలాగే బౌలర్ల విషయానికి వస్తే టీమిండియా యార్కర్ స్పెషలిస్ట్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా ను అవకాశం ఇస్తానన్నాడు. ఇలా వారిద్దరు జట్టులో వుంటే తప్పకుండా అదో బలమైన జట్టుగా మారుతుందని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.
CRICKETJan 31, 2019, 3:02 PM IST
వరల్డ్ కప్ పేవరేట్ భారత జట్టే ...మా టీంపై అసలు అంచనాలే లేవు: డుప్లెసిస్
మరికోద్దిరోజుల్లో జరగనున్న ప్రపంచ దేశాల క్రికెట్ సమరం గురించి దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి ఇంగ్లాండ్ వేదికగా జరిగే వరల్డ్ కప్2019 లో భారత జట్టు హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగనుందని పేర్కొన్నాడు. ఇలా ఓ వైపు భారత్‌ను పొగుడుతూ, సొంతజట్టును తులనాడుతూ డుప్లెసిస్ తన అభిప్రాయాలను వెల్లడించాడు.