Extradition
(Search results - 15)businessNov 2, 2020, 4:09 PM IST
విజయ్ మాల్యా అప్పగింతపై సస్పెన్స్.. 6 వారాల్లోగా స్టేటస్ రిపోర్ట్ సమర్పించాలని కోరిన సుప్రీంకోర్టు
యునైటెడ్ కింగ్డమ్లో ప్రత్యేక చట్టపరమైన ప్రక్రియ జరిగే వరకు విజయ్ మాల్యాను భారతదేశానికి రప్పించలేమని కేంద్రం అక్టోబర్ 5న సుప్రీం కోర్టుకు తెలిపింది. జస్టిస్ యు యు లలిత్, అశోక్ భూషణ్ ధర్మాసనం ఆరు వారాల్లో ఈ విషయంపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరింది
businessOct 6, 2020, 3:23 PM IST
మాల్యా అప్పగింత ప్రక్రియ రహస్యంగా కొనసాగుతోంది : సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్రం
మల్యా విజ్ఞప్తిని యుకే అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించిన తరువాత విజయ్ మాల్యాని అప్పగించే చర్యలు పూర్తయినప్పటికీ, తాజా చర్యలు భారత ప్రభుత్వానికి తెలియదు అని కేంద్ర ప్రభుత్వం అపెక్స్ కోర్టుకు తెలిపింది.
businessJun 5, 2020, 10:26 AM IST
విజయ్ మాల్యా అప్పగింత మరింత ఆలస్యం!!
విజయ్ మాల్యాను భారత్కు ఇప్పట్లో అప్పగించే అవకాశాలు కనిపించడం లేదు. దీనికి చట్టపరంగా తాము పరిష్కరించాల్సిన విషయం ఒకటి ఉన్నదని బ్రిటిష్ హై కమిషన్ పేర్కొనడమే నిదర్శనం.
businessMay 15, 2020, 12:33 PM IST
నీరవ్ మోదీ చంపేస్తానన్నారు.. ఓ డమ్మీ డైరెక్టర్ ఆరోపణ...
పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ)ని మోసగించిన కేసులో ప్రధాన నిందితుడు నీరవ్ మోదీకి వ్యతిరేకంగా సీబీఐ కీలక సాక్ష్యాలు సంపాదించింది. ఆయన సంస్థకు చెందిన ఆరుగురు డైరెక్టర్లతో నీరవ్ కు వ్యతిరేకంగా వీడియో సాక్ష్యాలను లండన్ కోర్టులో సమర్పించింది.
Coronavirus IndiaMay 14, 2020, 12:37 PM IST
రుణాలు 100 శాతం చెల్లిస్తా, కేసు క్లోజ్ చేయండి: విజయ్ మాల్యా
వేలకోట్ల రుణాలు ఎగవేత, మనీలాండరింగ్ ఆరోపణలు వంటి కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులకు సంబంధించి తనని భారత్కు అప్పగించే ఉత్తర్వులకు వ్యతిరేకంగా లండన్ హైకోర్టులో అప్పీల్ చేశారు. దాని తరువాత ఈ నెల ప్రారంభంలో మాల్యా యు.కె సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు.
businessJul 3, 2019, 10:40 AM IST
అలా రాసి ఉంటే అలాగే!! భారత్కు అప్పగింతపై మాల్యా.. చౌక్సీపై సుప్రీంకు కేంద్రం
విజయ్ మాల్యా అప్పగింత కేసులో భారతదేశానికి ఎదురుదెబ్బ తగిలింది. భారత్కు మాల్యా అప్పగింతపై బ్రిటన్ హోంమంత్రి సాజిద్ జావిద్ జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ మాల్యా దాఖలు చేసిన పిటిషన్ను లండన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో నిందితుడు మెహుల్ చౌక్సీ అప్పగింత విషయమై కేంద్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.TECHNOLOGYJun 26, 2019, 10:34 AM IST
మెంగ్ వాంగ్ ఝూ అప్పగింతను విత్ డ్రా చేయండి.. కెనడా మంత్రికి వేడికోళ్లు
హువావే సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంగ్ వాంగ్ ఝూను అమెరికాకు అప్పగించాలన్న పిటిషన్ ను ఉపసంహరించాలని కెనడా మంత్రి డేవిడ్ లామిట్టెకు ఆమె తరఫు న్యాయవాదులు కోరారు.businessMay 16, 2019, 11:42 AM IST
నీరవ్ మోదీ, మాల్యా అప్పగింతపై డిటైల్స్ ఇవ్వలేం.. ఎందుకంటే?!
నీరవ్ మోదీ, విజయ్ మాల్య అప్పగింత ప్రక్రియ ఏ దశలో ఉన్నదో వెల్లడించడానికి విదేశాంగశాఖ నిరాకరించింది. వారిద్దరూ బ్రిటన్ కనుసన్నుల్లోనే ఉన్నందున అప్పగింత ప్రక్రియ వివరాలు వెల్లడిస్తే అసలుకే మోసం రావచ్చునని ఆందోళన వ్యక్తం చేసింది.
businessApr 8, 2019, 6:48 PM IST
భారత్కు జవాబుదారివి: విజయ్ మాల్యాకు షాకిచ్చిన యూకే హైకోర్టు
స్వదేశంలో రూ.9వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. భారత్కు రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నాలు చేస్తుండగా.. ఇందుకు వ్యతిరేకంగా మాల్యా చేసిన అభ్యర్థనను అక్కడి హైకోర్టు కోర్టు తోసిపుచ్చింది.
businessMar 19, 2019, 11:13 AM IST
నీరవ్ మోదీకి షాక్.. అరెస్టు వారెంటు జారీ
దాదాపు 15 నెలల క్రితం వెలుగు చూసిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం కేసులో నిందితుడు నీరవ్ మోదీని అప్పగించాలని కోరుతూ భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే ఉన్నాయి. ఇటీవల టెలిగ్రాఫ్ విలేకరికి లండన్ నగరంలో నీరవ్ మోదీ తారసపడిన సంగతి తెలిసిందే. తాజాగా లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు నీరవ్ మోదీని అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై బ్రిటన్ ప్రభుత్వం, స్కాట్లాండ్ పోలీసులు ప్రతిస్పందించాల్సి ఉంది. అయితే నీరవ్ మోదీ బ్రిటన్ చట్టాల మాటున కొంత కాలం భారత్కు అప్పగించకుండా తప్పించుకోవచ్చునేమో గానీ.. సొంత దేశానికి రాకుండా ఉండలేరని తేలిపోయింది.
businessFeb 5, 2019, 10:41 AM IST
మాల్యా అప్పగింతకు ఓకే.. బట్ హైకోర్టుకెళ్తానని మద్యం వ్యాపారి బీరాలు
నష్టాలతో మూలనబడ్డ కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ అధినేత, మద్యం వ్యాపారి విజయ్ మాల్యా అప్పగింతకు బ్రిటన్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. విజయ్ మాల్యాను భారతదేశానికి అప్పగించాలని డిసెంబర్ 10వ తేదీన వెస్ట్ మినిస్టర్ కోర్టు తీర్పు చెప్పడమే కాదు దీనిపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖకు సిఫారసు చేసింది. తాజాగా బ్రిటన్ హోంమంత్రి సాజిద్ జావిద్ ఆ అప్పగింత ఫైలుపై సంతకం చేశారు. కాకపోతే విజయ్ మాల్య మరోమారు బ్రిటన్ హైకోర్టు, సుప్రీంకోర్టుల తలుపు తట్టేందుకు అవకాశం ఉన్నది. ఇదంతా జరిగి భారత దేశానికి విజయ్ మాల్యను తీసుకు రావడానికి ఏడెనిమిది నెలలు పట్టొచ్చునని న్యాయ నిపుణులు అంటున్నారు.
businessDec 10, 2018, 11:23 AM IST
businessAug 5, 2018, 12:37 PM IST
businessJul 31, 2018, 4:51 PM IST
Jun 13, 2018, 6:03 PM IST
నీరవ్ మోడీ, మాల్యా మీకు కావాలా.. ఐతే ఒక షరతు..!!
నీరవ్ మోడీ, మాల్యా మీకు కావాలా.. ఐతే ఒక షరతు..!!