Search results - 870 Results
 • komatireddy venkatreddy supports to his brother

  Telangana25, Sep 2018, 9:21 PM IST

  తమ్ముడికి అండగా నిలిచిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...కఠిన నిర్ణయాలు వద్దని సూచన

  సొంత పార్టీ నిర్ణయాన్నే దిక్కరించడంతో పార్టీ పెద్దలపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలకు సిద్దమైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసినా రాజగోపాల్ రెడ్డి దాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ సంఘం సమావేశం కానుంది. ఈ సమావేశంలో అతడిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న వేళ రాజగోపాల్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తమ్ముడికి అండగా నిలిచాడు. 

 • pcc chief uttam, jana reddy meets congress party national leaders in war room

  NATIONAL25, Sep 2018, 9:06 PM IST

  వార్ రూమ్ లో సీట్ల సర్ధుబాటు తేలలేదు...ఇంకా చర్చ జరగాలి: ఉత్తమ్

  పొత్తులు, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ స్పీడు పెంచింది. ఇదే అంశంపై చర్చించేందుకు వార్‌ రూమ్‌లో కాంగ్రెస్ సీనియర్‌ నేతలతో పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, ఆంటోనీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా పాల్గొన్నారు. 

 • damodara raja narsimha on ktr

  Telangana25, Sep 2018, 8:22 PM IST

  కళ్లు నెత్తికెక్కిమాట్లాడతున్నావ్..చరిత్ర తెలుసుకో:కేటీఆర్ కు దామోదర వార్నింగ్

   మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహా నిప్పులు చెరిగారు. కేటీఆర్ కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మాట్లాడేటప్పుడు చరిత్ర తెలుసుకుని మాట్లాడాలని సూచించారు.  

 • minister ktr fires on konda surekha, kodandaram

  Telangana25, Sep 2018, 7:49 PM IST

  అప్పుడు మంచి వాళ్లం...ఇప్పుడు విమర్శలా..కొండా దంపతులకు కేటీఆర్ కౌంటర్

  టీఆర్ఎస్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నమాజీమంత్రి కొండా సురేఖ దంపతులకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ లో ఉన్నంత కాలం కొండా దంపతులకు తాము మంచి వాళ్లమని, పార్టీ నుంచి వెళ్లిపోయే ముందు విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 

 • Minister Harish rao comments

  Telangana25, Sep 2018, 4:24 PM IST

  ఓటుతో మహాకూటమికి బుద్ధి చెప్పండి: మంత్రి హరీష్ రావు

  రాష్ట్రంలో 60 ఏళ్లలో జరగని అభివృద్ధి నాలుగేళ్లలో జరిగిందని మంత్రి హరీష్ రావు చెప్పారు. ప్రజలకు నేరుగా లబ్ధి చేకూరేలా కేసీఆర్ వందలాది పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ములుగులో టీఆర్ఎస్ కార్యకర్తలు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనని తెలిపారు. 
   

 • ex union minister datthatreya fires on cm kcr due to ayushman bhava

  Telangana25, Sep 2018, 4:02 PM IST

  కుంభకోణాల్లో అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు టీఆర్ఎస్: దత్తాత్రేయ

  టీఆర్ఎస్ పార్టీపై కేంద్ర మాజీమంత్రి దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల పట్ల సీఎం కేసీఆర్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

 • hyderabad mp candidate vote missing

  Telangana25, Sep 2018, 3:26 PM IST

  హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి ఓటు గల్లంతు... కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

  తెలంగాణ లో దాదాపు 21 లక్షల ఓట్లు గల్లంతయినట్లు ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్లాయి. బిజెపి, టీఆర్ఎస్ లు ఈసీతో కుమ్మకై ఇలా ఓట్లను తొలగిస్తున్నట్లు కొందరు నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తూ ఏకంగా ఓ ఎంపీ అభ్యర్థి పేరే ఓటర్ లిస్టు నుండి గల్లంతయింది.  

 • TTDP President L Ramana Fires On CM KCR

  Telangana25, Sep 2018, 2:51 PM IST

  టికెట్, పదవి ఇస్తానని కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు...కానీ..: ఎల్. రమణ

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ  తనను చాలాసార్లు ప్రలోభాలకు గురిచేసిందని టిటిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ ఆరోపించారు. అయితే వారి ప్రలోభాలకు లొంగకుండా తాను తెలంగాణలో టిడిపి పార్టీ బలోపేతం కోసం కృషి చేసినట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ పదవులు, టికెట్ ఆఫర్ కు తాను లొంగలేదని రమణ వెల్లడించారు. నాకు వాటికంటే పార్టీ, ప్రజలే ఎక్కువని రమణ స్పష్టం చేశారు.

 • trs leader vinay bhaskar fire on konda couple

  Telangana25, Sep 2018, 2:16 PM IST

  కొండా దంపతులు.. అందుకే అలా మాట్లాడుతున్నారు..వినయ్

  గతంలో ఉద్యమకారులపై ఎన్ని దౌర్జన్యాలు చేసినా పెద్దమనసుతో కొండా దంపతులను క్షమించారన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలో పనిచేస్తామని తమరు చెప్పారని గుర్తుచేశారు. 

 • Pawan kalyan speaks on next elections

  Andhra Pradesh25, Sep 2018, 1:31 PM IST

  ఎమ్మెల్యే చింతమనేనిపై పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు

  విలువలతో కూడిన రాజకీయాల కోసమే తాను పార్టీ పెట్టానని పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయాలంటే సుదీర్ఘ పోరాటమనే విషయం తనకు తెలుసునని ఆయన అన్నారు. 

 • konda murali comments on kcr

  Telangana25, Sep 2018, 1:28 PM IST

  దొరల కింద బతికేవాళ్లం కాదు.. సురేఖను లక్ష మెజారిటీతో గెలిపిస్తా: కొండా మురళీ

  టీఆర్ఎస్ అధిష్టానంపైనా, ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కొండా మురళీ. తమకు ఆత్మాభిమానం ఎక్కువని.. మేం దొరల కింద బతకలేమని.. పోరాటాలతో ఈ స్థాయికి వచ్చామని ఆయన అన్నారు

 • konda surekha as 15 Parties CM Candidate of Telangana

  Telangana25, Sep 2018, 1:02 PM IST

  15 పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొండా సురేఖ..?

  టీఆర్ఎస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆమె బహిరంగ లేఖ రాశారు. 

 • konda surekha sensational comments on trs

  Telangana25, Sep 2018, 12:42 PM IST

  నేను హరీశన్న వర్గం.. కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉలిక్కిపడ్డాయి.

 • konda surekha fires on kcr

  Telangana25, Sep 2018, 12:20 PM IST

  హరికృష్ణ స్మారకానికి మూడెకరాలు.. జయశంకర్‌కు గజం కూడా ఇవ్వలేదు: కొండా సురేఖ

  తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ఘోరంగా అవమానించారని ఆరోపించారు మాజీ మంత్రి కొండా సురేఖ. నందమూరి హరికృష్ణ చనిపోతే ఆయనకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారని.. అంతేకాకుండా స్మారక స్థలానికి మూడెకరాలు సైతం కేటాయించాలని కేసీఆర్ ఆదేశించారని సురేఖ గుర్తు చేశారు

 • konda surekha comments on TRS

  Telangana25, Sep 2018, 12:09 PM IST

  కల్వకుంట్ల వారి ఖజానా మొత్తం.. పర్సంటేజ్‌లు.. సెటిల్‌మెంట్ల సొమ్మే: కొండా సురేఖ

  సీఎం కేసీఆర్, కేటీఆర్‌‌‌లపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు చేశారు కొండా సురేఖ. కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాసిన ఆమె ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు.