Data Missing Issue  

(Search results - 7)
 • sivaji

  Andhra Pradesh8, Mar 2019, 4:34 PM

  కేసీఆర్ పని ఇదీ: డేటా చోరీపై హీరో శివాజీ సంచలన వ్యాఖ్యలు

  సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించి ఫామ్ ప్రైవేట్ కంపెనీ డిజైన్ చెయ్యడమే అందుకు నాంది పలకడం జరిగిందని ఆరోపించారు. ఆ ప్రైవేట్ కంపెనీకి డేటా అంతా అందజేసి ఓట్ల కుంభకోణానికి పాల్పడింది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అంటూ శివాజీ ప్రశ్నించారు. కేసీఆర్ కుట్రలను కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డి ప్రశ్నించారని చెప్పుకొచ్చారు.  
   

 • tdp case

  Andhra Pradesh6, Mar 2019, 9:48 PM

  డేటా చోరీ కేసులో కీలకమలుపు: తెలంగాణ ప్రభుత్వంపై టీడీపీ ఫిర్యాదు

  రెండు దశాబ్ధాల నుంచి సేకరించిన టీడీపీ సమాచారాన్ని దోచుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సెక్షన్ 120బి, 418, 420,380, 409, 167, 177,182 రెడ్ విత్ 511 సెక్షన్ల కింద కేసు నమోదు చెయ్యాలని ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 23న పోలీసులు ఐటీ గ్రిడ్ సంస్థపై దాడులు చేశారని ఆ సమయంలో సిఈవో అశోక్, సిబ్బందిని బెదిరించి బలవంతంగా సమాచారాన్ని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసుల దాడులకు సంబంధించి సీసీ ఫుటేజ్, ఫోటోలను ఫిర్యాదుతోపాటు ఎస్పీకి అందజేశారు. 

 • నారా లోకేష్ కుప్పం నుంచి పోటీ చేస్తారని ఒకసారి, గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని మరోసారి, కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోటీ చేస్తారంటూ ఇంకోసారి, కాదు కడప జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే అత్యధికశాతం మంది వెనుకబడిన ప్రాంతం అయిన ఉత్తరాంధ్రలో ఏదో ఒక జిల్లా నుంచి పోటీ చెయ్యాలంటూ సూచించారు.

  Andhra Pradesh6, Mar 2019, 8:12 PM

  నేరాలు-ఘోరాలు, చోరీలలో నీ ర్యాంకు ఏ 1: వైఎస్ జగన్ పై లోకేష్ ఫైర్

  ల‌క్ష‌ల కోట్ల ప్ర‌జాధ‌నం లూటీ చేసిందీ నువ్వే అంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ డేటా చోరీ చేసిందీ నువ్వే అంటూ మండిపడ్డారు. నేరాల్లోనూ, ఘోరాల్లోనూ, చోరీల్లోనూ నీకు నీవే సాటి నీ ర్యాంకు A1 అంటూ లోకేష్ ట్విట్టర్ వేదికగా వైఎస్ జగన్ పై ధ్వజమెత్తారు. 
   

 • jawahar

  Andhra Pradesh6, Mar 2019, 7:21 PM

  కేటీఆర్, వైఎస్ జగన్ రహస్య భేటీ, చేతులు మారిన డబ్బు : ఏపీ మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు

  జగన్, కేటీఆర్ భేటీలో పెద్ద మెుత్తంలో నగదు చేతులు మారిందని ఆరోపించారు. జగన్, కేటీఆర్ ల భేటీని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఏర్పాటు చేశారంటూ చెప్పుకొచ్చారు. డేటా చోరీ కుట్రలో గవర్నర్ నరసింహన్ కుట్ర కూడా ఉందన్నారు. గవర్నర్ వ్యవస్థను మోదీ దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శించారు. 

 • hyderabad cp

  Telangana6, Mar 2019, 4:55 PM

  డేటా చోరీ కేసులో క్రిమినల్ కంటెంట్ ఉంది: హైదరాబాద్ సీపీ అంజనీకుమార్

  డేటాచోరీ అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘంకు తెలియజేశామని తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా కేసు దర్యాప్తు చేస్తామని తెలిపారు. వీరితోపాటు ఒక వ్యక్తికి ఎక్కడ ఓటు ఉంది, ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నారు, ఏ పార్టీకి ఓటేస్తున్నారు వంటి అంశాలపై సేవామిత్ర ఆరా తీస్తున్నట్లు తెలిపారు. డేటా చోరీ కేసులో క్రిమినల్ కంటెంట్ ఉందన్నారు. 
   

 • ఆ తర్వాత మళ్లీ జూ.ఎన్టీఆర్ పేరెత్తలేదు. జూ.ఎన్టీఆర్ ని తెరపైకి తెస్తే ఇబ్బందులు తప్పవని చంద్రబాబు ముందే ఊహించి ఆయనను పక్కకు తప్పించారని జోరుగా ప్రచారం జరిగింది. లోకేష్ కు ఎక్కడ పోటీ వస్తారో అన్న భయంతో జూనియర్ ఎన్టీఆర్ ను కావాలనే పక్కన పెట్టారని గుసగుసలు కూడా వినిపించాయి. కొందరైతే లోకేశ్ కోసం జూ.ఎన్టీఆర్ ను చంద్రబాబు నాయుడు తొక్కేశారంటూ ఆరోపణలు కూడా చ్చాయి.

  Andhra Pradesh5, Mar 2019, 8:32 PM

  కేటీఆర్ టైమ్ మిషన్ ఎక్కారా, దొంగతో స్నేహం మిమ్మల్ని దొంగను చేసిందే : లోకేష్ ఫైర్


  టీడీపీ సమాచారం కోసం వారం రోజుల పాటు ఉద్యోగులను వేధించారని లోకేష్ ఆరోపించారు. మా డేటా ఎత్తుకెళ్లి ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే’ అంటున్నారని మండిపడ్డారు. లక్షల కోట్ల దొంగతో స్నేహం మిమ్మల్ని కూడా దొంగను చేసిందంటూ లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.  

 • 2014 ఎన్నికల్లో బాపట్ల పార్లమెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వరికూటి అమృతపాణి పోటీ చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాల్యాద్రి చేతిలో 30వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఈసారి బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు.

  Andhra Pradesh5, Mar 2019, 3:46 PM

  ఓట్లను తొలగిస్తున్నారు, చంపేందుకు కూడా వెనుకాడరు: బాబుపై జగన్

  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమకు ఓట్లు వెయ్యరు అని తెలిస్తే వారిని చంపేందుకు సైతం చంద్రబాబు నాయుడు వెనుకాడరని ఆరోపించారు. ఒకవేళ కొన్ని గ్రామాలు ఓటెయ్యవని తెలిస్తే ఆ గ్రామాలకు నిప్పు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. నెల్లూరు జిల్లాలో వైసీపీ సమరశంఖారాం బహిరంగ సభలో పాల్గొన్న  వైఎస్ జగన్ చంద్రబాబు తీరును ఎండగట్టారు.