Csk Vs Mi  

(Search results - 12)
 • mi

  CRICKET14, May 2019, 3:22 PM IST

  ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లు ఎవరికి కావాలి...మనకు కావాల్సిందిదే: ముంబై కోచ్ జయవర్ధనే (వీడియో)

  హాట్ హాట్ సమ్మర్ లో క్రికెట్ ప్రియులకు ఐపిఎల్ 2019 మంచి మజాను పంచింది. రెండు నెలల పాటు సాగిన ఈ మెగా లీగ్ లో చివరకు ముంబై ఇండియన్స్ విజేతగా నిలించింది. ఈ విజయంతో రోహిత్ సేన ఖాతాలో నాలుగో ఐపిఎల్ ట్రోపి వచ్చి చేరింది. అయితే ఈ సీజన్లో ముంబై జట్టులోని ఆటగాళ్లు వ్యక్తిగతంగా రికార్డులు సాధించకున్నా సమిష్టిగా రాణించి  విజయకేతనం ఎగురవేశారు. ఇదే సమిష్టితత్వం తమ జట్టును టైటిల్ విజేతగా నిలలబెట్టిందని ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్దనే అభిప్రాయపడ్డారు. 

 • Shane Watson

  CRICKET13, May 2019, 11:05 PM IST

  చెన్నై ఓటమికి కారణమతడే: అభిమానుల ఆగ్రహం

  ఐపిఎల్ 2019 ఆరంభంనుండి ఫైనల్ వరకు ప్రతి జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ దే పైచేయిగా నిలిచింది. కానీ  ఒక్క ముంబై ఇండియన్స్  పై మాత్రం ఆ జట్టు ఒక్కటంటే ఒక్క విజయాన్ని సాధించలేకపోయింది. లీగ్ దశలోనే కాకుండా క్వాలిఫయర్ మ్యాచులో కూడా ముంబై చేతిలో చెన్నై ఘోర ఓటమిని చవిచూసింది. ఇదే ఆటతీరు ఫైనల్లో కూడా కొనసాగించిన చెన్నై ఐపిఎల్ 2019 ట్రోఫీని చేజేతులా జారవిడుచుకుని ముంబై చేతిలో పెట్టింది. 

 • Shane Watson

  CRICKET13, May 2019, 6:16 PM IST

  ఐపిఎల్ 2019 ఫైనల్ ఫిక్సయ్యిందా...? అభిమానుల అనుమానాలివే

  ఐపిఎల్ సీజన్ 12 లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోయి  టైటిల్ విజేతగా నిలిచింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో చెన్నై  సూపర్ కింగ్స్ తో తలపడ్డ ముంబై కేవలం ఒకే ఒక పరుగు తేడాతో గెలిచింది. 150 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించే క్రమంలో వాట్సన్(80 పరుగులు) ధాటిగా ఆడటంతో చివరివరకు మ్యాచ్ చెన్నై వైపే నిలిచింది. కానీ చివరి రెండు ఓవర్లు మ్యాచ్ స్వరూపాన్నే మార్చి అనూహ్యంగా ముంబైని  విజేతగా నిలబెట్టాయి. 

 • Sachin Mumbai

  CRICKET13, May 2019, 4:09 PM IST

  అతడో వరల్డ్ క్లాస్ బౌలర్...ముంబై గెలుపులో ముఖ్య పాత్ర: యువరాజ్ తో సచిన్ (వీడియో)

  హైదరాబాద్ వేదికగా జరిగిన ఐపిఎల్ ఫైనల్లో ముంబై ఇండియన్స్ అద్భుత విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ వంటి సక్సెస్‌ఫుల్ జట్టును మట్టికరిపించి ముంబై జట్టు ట్రోఫిని ముద్దాడింది. ఇలా ఐపిఎల్ చరిత్రలో నాలుగోసారి విజేతగా నిలిచిన ముంబైపై టీమిండియా మాజీ క్రికెటర్  సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. 149 పరుగుల స్వల్ప స్కోరును కాపాడుకున్న ముంబై బౌలర్లను సచిన్ ప్రత్యేకంగా అభినందించాడు. 

 • siddharth

  ENTERTAINMENT13, May 2019, 3:24 PM IST

  సిద్ధార్థ్ పై అజిత్ అభిమానులు ఫైర్.. కారణమేమిటంటే..?

  ఆదివారం నాడు చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. 

 • Rohit Sharma

  CRICKET13, May 2019, 2:27 PM IST

  ఐపిఎల్ 2019 ఫైనల్ విజయంపై రోహిత్ ఏమన్నాడంటే...

  ఇండియన్  ప్రీమియర్ లీగ్ చరిత్రలో విజయవంతమైన జట్లేవంటే ముందుగా వినిపించే పేర్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్. ఈ రెండు జట్లు మైదానంలో తలపడుతుంటే అభిమానులకు కావల్సినంత క్రికెట్ మజా లభిస్తుంది. అలాంటిది టైటిల్ కోసం ఫైనల్లో ఢీకొంటే ఎలా వుంటుందో ఆదివారం హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ ను చూస్తే తెలుస్తుంది. ఐపిఎల్ సీజన్ 12 ఫైనల్లో ఇరు జట్లు హోరాహోరీగా పోరాడినా చివరకు ముంబై ఇండియన్స్ దే పైచేయిగా నిలిచింది. కేవలం ఒకే ఒక్క పరుగుతో విజయం సాధించిన  ముంబై జట్టు ఐపిఎల్ ట్రోఫీని అందుకుంది. ఈ గెలుపుపై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. 

 • rahul chahar

  CRICKET13, May 2019, 1:40 PM IST

  ముంబై విజయంలో అతడిదే కీలక పాత్ర: యువ కిలాడిపై సచిన్ ప్రశంసలు

  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019 విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచిన విషయం తెలిసిందే. నిన్న ఆదివారం హైదరాబాద్  ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించి ముంబై నాలుగో సారి ఐపిఎల్ ట్రోఫీని అందుకుంది. అయితే 149 పరుగులు తక్కువ స్కోరును కాపాడుకోవడంతో ముంబై బౌలర్లు సఫలమయ్యారు. ఇలా అదరగొట్టిన బౌలర్లలో రాహుల్ చాహర్ అద్భుతమైన బౌలింగ్  క్రికెట్ లెజెండ్,  మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుందట. ఈ విషయాన్ని స్వయంగా సచినే వెల్లడించాడు. 

 • CRICKET7, May 2019, 7:49 PM IST

  సూర్యకుమార్ సూపర్ షో...చెన్నైపై గెలిచి నేరుగా ఫైనల్‌కు చేరిన ముంబై

  ఐపిఎల్ సీజన్ 12లో మొదటి క్వాలిఫయర్ మ్యాచ్ కు చెన్నై చెపాక్ స్టేడియం వేదికయ్యింది. డైరెక్ట్ పైనలిస్ట్ ను నిర్ణయించే ఈ మ్యాచ్ లో పాయింట్ టేబుల్ లో టాప్ స్థానంలో నిలిచిన ముంబై ఇండియన్స్, సెకండ్ ప్లేస్ లో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబై  విజేతగా నిలిచి నేరుగా  ఫైనల్ కు చేరగా చెన్నై ఓటమిపాలై మరో అవకాశాన్ని వినియోగించుకోవాల్సి వస్తోంది.

 • dhoni rohit

  CRICKET27, Apr 2019, 4:36 PM IST

  ధోనియే మమ్మల్ని గెలిపించాడు : రోహిత్ శర్మ

  చెన్నై వేదికగా శుక్రవారం ఐపిఎల్ టోర్నీలో రెండు అత్యుత్తమ జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ  ఐపిఎల్ సీజన్ 12లో వరుస విజయాలతో దూసుకుపోతూ ఇప్పటికే ప్లేఆఫ్ బెర్తు ఖాయం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ కు ప్లేఆఫ్ బెర్తును ఖాయం చేసుకోడానికి ప్రయత్నిస్తున్న ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఇలా హేమాహేమీ జట్ల మధ్య జరిగిన పోరులో చివరకు ముంబైదే పైచేయిగా నిలిచింది. ఏకంగా 46 పరుగుల తేడాతో ముంబై చేతిలో చెన్నై ఘోర ఓటమిని చవిచూసింది. 

 • Rohit Sharma IPL

  CRICKET27, Apr 2019, 3:46 PM IST

  అవెంజర్స్‌లో ఇకనుంచి హిట్ మ్యాన్ కూడా: రోహిత్ పై పాండ్యా ఆసక్తికర ట్వీట్

  ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ను అభిమానులు ముద్దుగా హిట్ మ్యాన్ అని పిలుచుకుంటారు.  ఈ పేరుకు తగ్గట్లుగానే అతడు క్రీజులో కుదరుకున్నాడంటే ప్రతి బంతిని బౌండరీ బయటకు తరలించాలని చూస్తుంటాడు. అయితే ఐపిఎల్ సీజన్ 12 ప్రారంభమై దాదాపు నెల రోజులు గడుస్తున్నా రోహిత్ హిట్టింగ్ ను అభిమానులు చూడలేకపోయారు. ఆ లోటును భర్తీ చేస్తూ శుక్రవారం చెన్నైతో జరిగిన మ్యాచ్ లో ముంబై కెప్టెన్ చెలరేగిపోయాడు. అద్భుతమైన షాట్లతో అర్థశతకాన్ని నమోదుచేసుకుని జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

 • Malinga

  CRICKET26, Apr 2019, 8:14 PM IST

  మలింగ మాయాజాలం...ముంబై చేతిలో చిత్తుచిత్తుగా ఓడిన చెన్నై

  ఐపిఎల్ సీజన్ 12 లీగ్ దశలో భాగంగా చెన్నై చెపాక్ స్టేడియంలో మరో అద్భుతమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్ పై ముంబై ఇండియన్స్ పైచేయిగా సాధించింది. ముంబై బౌలర్ మలింగ విజృంభణతో చెన్నై 156 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించలేక చతికిల పడింది. మలింగ్ నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లు పడగొట్టి చెన్నై జట్టు నడ్డి విరిచాడు. 

 • dhoni csk

  CRICKET26, Apr 2019, 8:00 PM IST

  మ్యాచ్ కు ముందే చెన్నైకి ఎదురుదెబ్బ... మరోసారి జట్టుకు దూరమైన ధోని

  ఐపిఎల్ సీజన్ 2 లో మరో రసవత్తర సమరానికి అంతాసిద్దమైన సమయ్యింది. మరికొద్దిసేపట్లో చెపాక్ స్టేడియంలో చెన్నై సూపన్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల  మధ్య మ్యాచ్ మొదలవనుంది. అయితే ఈ సమయంలో ఆతిథ్య చెన్నై అభిమానులకు టీంమేనేజ్ మెంట్ షాకిచ్చింది. తీవ్ర జ్వరం కారణంగా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్ కు దూరమైనట్లు సంచలన ప్రకటన చేసింది.