CRICKET17, Feb 2019, 10:48 AM IST
పుల్వామా దాడి: అమర జవాన్ల పిల్లలను చదివించనున్న సెహ్వాగ్
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడిలో అసువులు బాసిన సీఆర్పీఎఫ్ సైనికుల కుటుంబాలకు భారతావని అండగా నిలబడుతోంది. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు, రాష్ట్రప్రభుత్వాలు, ప్రజలు సైనిక సంక్షేమ నిధికి భారీగా విరాళాలు ఇస్తున్నారు.
CRICKET16, Feb 2019, 12:45 PM IST
దినేశ్ కార్తిక్ పని అయిపోయినట్లే...కేవలం ప్రపంచకప్‌లోనే కాదు...: సంజయ్ మంజ్రేకర్
ప్రపంచ కప్ కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో తలపడే భారత జట్టును బిసిసిఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో టీ20 సీరిస్ కు ఎంపికైన సీనియర్ ఆటగాడు దినేశ్ కార్తిక్ కు వన్డే జట్టులో అవకాశం లభించలేదు. వన్డే ప్రపంచ కప్ కు ముందు ఇలా దినేశ్ కార్తీక్ ను వన్డే సీరిస్ కు ఎంపికచేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ కప్ ను దృష్టిలో పెట్టుకుని ఈ జట్టును ఎంపికచేశారు కాబట్టి ఇక కార్తిక్ పని అయిపోయినట్లేనని పలు కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఆ అనుమానాలన్నీ నిజమవనున్నాయని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
CRICKET15, Feb 2019, 9:43 PM IST
భారత ఆటగాళ్లను పాకిస్థాన్ క్రికెట్ లీగ్ లో ఆడించాలి: పిసిబి ఛైర్మన్
పాకిస్థాన్ సూపర్ లీగ్... దుబాయ్ వేదికగా గత మూడేళ్లుగా పిసిబి(పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్) సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తోంది. అయితే ఈ లీగ్ లో అన్ని దేశాల క్రీడాకారులు ఆడుతున్నా భారత ఆటగాళ్లు మాత్రం ఆడటం లేదు. పాకిస్థాన్-ఇండియాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో ఆ ప్రభావం ఇరు దేశాల క్రికెట్ సంబంధాలపై కూడా పడింది. దీంతో బిసిసిఐ నిర్వహించే ఐపిఎల్ కు పాక్ క్రికెటర్లు దూరమవగా...పాకిస్థాన్ పీఎస్ఎల్ కు భారత ఆటగాళ్లు దూరంగా వుంటున్నారు. అంతేకాకుండా ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.
CRICKET15, Feb 2019, 5:57 PM IST
తెలుగు క్రికెటర్ హనుమ విహారీ అరుదైన ఘనత...
తెలుగు క్రికెటర్ హనుమ విహారి రంజీ మ్యాచుల్లో అదరగొడుతున్నాడు. ఇరానీ కప్ లో రెస్టాఫ్ ఇండియా తరపున బరిలోకి దిగిన విహారి తన బ్యాట్ ను ఝలిపించాడు. దీంతో ఒకే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్సుల్లోనూ సెంచరీలు సాధించి అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఈ సెంచరీలతో ఇప్పటివరకు ఇరానీ కప్ టోర్నీ చరిత్రలో వరుసగా మూడు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్ గా విహారీ అరుదైన ఘనత సాధించాడు.
CRICKET13, Feb 2019, 8:16 PM IST
''ప్రపంచ కప్ ఆడటానికి విజయ్ శంకర్ అర్హుడే''
వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో తమ దేశం తరపున పాల్గొనాలని ప్రతి ఆటగాడు భావిస్తుంటాడు. అయితే అవకాశం కొంతమందిని మాత్రమే వరిస్తుంది. మరికొన్ని రోజుల్లో
ఈ మెగా ఈవెంట్ ప్రారంభంకానున్న నేపథ్యంలో భారత ఆటగాళ్ల ఎంపికను సెలెక్టర్లు ప్రారంభించారు. భారత జట్టును సీనియర్లు, జూనియర్లతో సమతూకంతో ఎంపిక చేయనున్నట్లు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఇప్పటికే వెల్లడించాడు. ఇటీవల మంచి ఫామ్ తో అత్యుత్తమంగా ఆడుతున్న యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, విజయ్ శంకర్ ల పేర్లను వరల్డ్ కప్ కోసం పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే.CRICKET13, Feb 2019, 6:23 PM IST
క్షణికావేశంలో దారుణం... క్రికెటర్ పై జీవిత కాల నిషేదం
టీంఇండియా మాజీ ఆటగాడు అమిత్ బండారీపై జరిగిన దాడిని డిల్లీ క్రికెట్ అసోసియేషన్ తీవ్రంగా పరిగణించింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరక్కుండా కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. దాడికి పాల్పడిన అనూజ్ దేడాపై క్రికెట్ నుండి జీవితకాల నిషేదాన్ని విధించినట్లు డిసిసిఏ ప్రకటించింది.
CRICKET13, Feb 2019, 5:47 PM IST
వరల్డ్ కప్‌లో రిషబ్ పంత్‌తో ఓపెనింగ్ చేయించాలి...ఎందుకంటే: షేన్ వార్న్
మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ప్రపంచ కప్ 2019 విజేతగా నిలిచే అన్ని అర్హతలు టీంఇండియాకు వున్నాయని ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ షేన్ వార్న్ కితాబిచ్చాడు. అయితే అందుకోసం భారత జట్టు కొన్ని ప్రయోగాలు చేయాలని ఆయన సూచించారు. తన సూచనలను పాటిస్తే ఈ మెగా టోర్నీలో భారత్ కు ఎదురుండదని ఈ ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం వెల్లడించాడు.
SPORTS12, Feb 2019, 4:24 PM IST
రైనా చనిపోయాడంటూ ప్రచారం.. స్పందించిన ఆల్ రౌండర్
ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో సురేష్ రైనా చనిపోయారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
CRICKET12, Feb 2019, 1:56 PM IST
‘‘గే’’నే అయితే తప్పేంటీ.. విండీస్ క్రికెటర్‌కు జో రూట్ కౌంటర్
ప్రస్తుతం వెస్టిండీస్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి విండీస్ 154 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు దూసుకెళ్తోంది.
CRICKET11, Feb 2019, 6:12 PM IST
టీంఇండియా మాజీ ప్లేయర్‌పై హాకీస్టిక్స్, సైకిల్ చైన్లతో దాడి
భారత జట్టు మాజీ ఆటగాడు, ప్రస్తుత ఢిల్లీ డిస్ట్రిక్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ అధ్యక్షుడు అమిత్ భండారీపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. హాకీ స్టిక్స్, ఇనుప రాడ్లు, సైకిల్ చైన్లతో అతడిపై దాడికి పాల్పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అమిత్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతడి తల భాగంలో తీవ్రమైన గాయాలయ్యాయని డాక్టర్లు తెలిపారు.
CRICKET10, Feb 2019, 4:44 PM IST
టీ20ల్లో ధోనీ అరుదైన రికార్డు.. 300 మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా..
ఇప్పటికే తన పేరిట ఎన్నో రికార్డులు లిఖించుకున్న టీమిండియా మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డును నెలకొల్పాడు. భారత్ తరపున 300 టీ20 మ్యాచ్‌లుఆడిన క్రికెటర్‌గా ఘనత వహించాడు.
CRICKET10, Feb 2019, 11:52 AM IST
కివీస్‌కు చుక్కలు చూపిన సృతీ..సెంచరీ మిస్
మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య హామిల్టన్‌లో జరుగుతున్న చివరి టీ20లో భారత స్టార్ ఓపెనర్ స్మృతీ మంధాన కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత్‌కు స్మృతీ ధాటిగా ఆడింది.
CRICKET8, Feb 2019, 3:17 PM IST
నా భర్త కోసం కెఎల్.రాహుల్ చేసిన సాయమే విలువైనది: మార్టిన్ భార్య
కాఫీ విత్ కరణ్ షో లో మహిళలను ఉద్దేశించి అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీంఇండియా యువ క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్.రాహుల్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. అయితే హర్దిక్ పాండ్యా చేసిన తప్పుకు కెఎల్. రాహుల్ బలికావాల్సి వచ్చింది. కేవలం పాండ్యాతో కలిసి ఆ షోలో పాల్గొన్నందుకే రాహుల్ పై బిసిసిఐ వేటు వేసింది. ఈ వివాదం, బిసిసిఐ నిషేదం నుండి ఇటీవలే బయటపడ్డ రాహుల్ తన ఉధారతను చాటుకున్నారు.
Telangana8, Feb 2019, 12:29 PM IST
జయరాం హత్యలో ట్విస్ట్: శిఖా చౌదరితో హైదరాబాద్ క్రికెటర్ కు లింక్స్
జయరాం హత్య జరిగిన రోజు శిఖా చౌదరి విల్లాకు యువ క్రికెటర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రికెటర్ ఎవరనేది తెలియడం లేదు. అతను ఐపిఎల్ మ్యాచులు కూడా ఆడినట్లు చెబుతున్నారు.
SPORTS6, Feb 2019, 3:51 PM IST
అంతర్జాతీయ క్రికెట్ జట్లలో అన్నదమ్ముల జోడీలివే...
అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లకు వుండే క్రేజ్ అంతాఇంతా కాదు. భారత్ వంటి దేశాల్లో కొందరు క్రికెటర్లను అభిమానులను దేవుళ్లతో పోలుస్తుంటారు. అయితే ఇలా అంతర్జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించి దేశానికి ప్రాతినిధ్యం వహించాలని చాలా మంది భావిస్తుంటారు. కానీ అలా ఆడే అరుదైన అవకాశం ఏ కొందరికో లభిస్తుంది. అలాంటిది ఒకే కుటుంబం నుండి ఇద్దరు అన్నదమ్ముళ్లు జట్టులో స్ధానం సంపాదించడమంటే అది మామూలు విషయం కాదు. అయితే ఇది అసాధ్యం కాదని నిరూపిస్తూ అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగిన అన్నదమ్ముళ్లు వున్నారు. అలాంటి క్రికెట్ బ్రదర్స్ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.