Asianet News TeluguAsianet News Telugu
71 results for "

Coal

"
At Least 100 Killed In Airstrike On Yemen PrisonAt Least 100 Killed In Airstrike On Yemen Prison

air strike: వైమానిక దాడి.. 100 మందికి పైగా మృతి !

air strike: యెమెన్ లో దీర్ఘకాలికంగా కొన‌సాగుతున్న ఘర్షణ..  శుక్రవారం నాడు తీవ్ర హింస‌కు దారి తీసింది. అక్క‌డి జైలుపై జరిగిన వైమానిక దాడిలో కనీసం 100 మంది మరణించారు. వేరు వేరు చోట్ల జ‌రిగిన మ‌రో వైమానిక దాడిలో ముగ్గురు పిల్ల‌లు సైతం ప్రాణాలు కోల్పోయారు. ఆయా ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి హౌతీ తిరుగుబాటుదారులు వీడియో దృశ్యాల‌ను విడుదల చేశారు. జైలు పై జ‌రిగిన వైమానిక దాడిలో శిథిలాల కింద‌, అలాగే, చెల్లాచెదురుగా ప‌డివున్న శ‌వాల‌ను బ‌య‌ట‌కు తీస్తున్న భ‌యాన‌క దృశ్యాలు ఆ వీడియోలో క‌నిపించాయి. 
 

INTERNATIONAL Jan 22, 2022, 4:56 AM IST

11 Killed By Coalition Air Strikes In Yemen After Deadly UAE Attack11 Killed By Coalition Air Strikes In Yemen After Deadly UAE Attack

UAE Attack : హుతీలపై సంకీర్ణ దళాల వైమానిక దాడులు, 11మంది మృతి, పలువురికి గాయాలు..

ఈ దాడుల్లో దాదాపు పదకొండు మంది మృతి చెందినట్లు సమాచారం.  దీంతోపాటు సౌదీ అరేబియా వైపు ప్రయోగించిన 8 డ్రోన్లను అడ్డుకున్నట్లు ఈ దళాలు వెల్లడించాయి.  సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి లో యూఏఈ కూడా భాగస్వామి. వైమానిక దాడుల కారణంగా రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 

INTERNATIONAL Jan 19, 2022, 7:07 AM IST

REVANTH REDDY urges PM Narendra Modi to stop auction of Singareni coal blocksREVANTH REDDY urges PM Narendra Modi to stop auction of Singareni coal blocks

REVANTH REDDY: బొగ్గు గ‌నుల వేలంపై మోడీకి బ‌హిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి

REVANTH REDDY: ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి బ‌హిరంగ లేఖ  రాశారు. సింగరేణి కాల‌రీస్ లోని నాలుగు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు జ‌రుగుతోన్న ప్ర‌యత్నాల‌ను విర‌మించుకోవాల‌ని ప్రధాని మోడీని రేవంత్ రెడ్డి కోరారు. సింగరేణి కాలరీస్‌లోని నాలుగు బ్లాకులను వేలం వేయాలని బొగ్గు మంత్రిత్వ శాఖ ప్ర‌యత్నిస్తోంద‌నీ, ఆ ప్ర‌య‌త్నాన్ని వెంట‌నే ఉపసంహరించుకోవాలని అన్నారు. ఆ బ్లాకుల‌ను కూడా  సింగ‌రేణీ కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ ( SCCL )కి అప్ప‌జెప్పాల‌ని విన్న‌వించుకున్నారు. 
 

Telangana Dec 11, 2021, 3:06 PM IST

Balkasuman fires on auction of coal blocks in SingareniBalkasuman fires on auction of coal blocks in Singareni

‘బీజేపీ ఎంపీల లాగులు ఊడదీసి కొట్టాలి’.. సింగరేణిలో బొగ్గు బ్లాక్ ల వేలంపై బాల్కాసుమన్ ఫైర్...

బ్లాక్ ల వేలం వేయొద్దని సీఎం కేసీఆర్ స్వయంగా మోడీ కి లేఖ రాశారు. అయినా ఉలుకు పలుకు లేదు. గుజరాత్ లో బ్లాక్ లు వేయకుండా అక్కడి రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు కోల్ ఇండియాకు కేటాయించింది. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది కనుకే కేంద్రం అక్కడి సీఎం చెప్పినట్టు విన్నది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కనుకే బీజేపీ కోల్ బ్లాక్ లను ప్రైవేట్ కంపెనీ లకు కట్టబెట్టాలని చూస్తున్నది.

Telangana Dec 11, 2021, 2:31 PM IST

Stop auction of Singareni coal mines - YS SharmilaStop auction of Singareni coal mines - YS Sharmila

సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని ఆపండి - వైఎస్ శర్మిల

సింగరేణి గనులు వేలం వేసే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ శ‌ర్మిల అన్నారు. కేంద్రం ఈ నిర్ణ‌యాన్ని వెంట‌నే ఉప‌సంహ‌రించుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు గురువారం ఆమె మీడియాకు ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగ‌రేణిలోని నాలుగు గనులను ఈ నెల 13న వేలం వేయాలని నిర్ణయింకోవ‌డం స‌రైంది కాద‌ని అన్నారు. గ‌నుల‌ను ప్ర‌యివేటు వ్య‌క్తుల‌కు ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించారు. కార్మిక సంఘాలు చేస్తున్న స‌మ్మెకు త‌మ పార్టీ పూర్తిగా మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని అన్నారు. ఈ నిర్ణ‌యాన్ని కేంద్రం వెన‌క్కి తీసుకునేంత‌వ‌ర‌కు టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడాల‌ని అన్నారు. 
 

Telangana Dec 9, 2021, 7:59 PM IST

Stop auction of 4 coal blocks in Singareni - CM KCR writes letter to PMStop auction of 4 coal blocks in Singareni - CM KCR writes letter to PM

సింగ‌రేణిలో 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని ఆపండి - ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ

కేంద్ర ప్రభుత్వ నిర్వహించ తలపెట్టిన నాలుగు కోల్ బ్లాక్స్ వేలాన్ని నిలిపివేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర  ప్ర‌భుత్వాన్ని కోరారు. ఈ మేర‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి బుధ‌వారం సాయంత్రం లేఖ రాశారు. 4 కోల్ బ్లాక్స్ వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుండి సమ్మెకు వెళ్లాలని నిర్ణయించాయి. ఈ సమ్మె మూడు రోజుల పాటు ఉంటుందని పిలుపునిచ్చాయి.

Telangana Dec 8, 2021, 9:02 PM IST

workers strike continues as discussions with singareni collieries failedworkers strike continues as discussions with singareni collieries failed

యాజమాన్యంతో సింగరేణి కార్మికుల చర్చలు విఫలం, బంతి కేంద్రం కోర్టులో.... సమ్మె యథాతథం

సింగరేణి కార్మిక సంఘాలతో యాజమాన్యం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో సంస్థలో సమ్మె సైరన్ మోగనుంది. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ.. సమ్మె వల్ల సింగరేణి అభివృద్ధికి విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసింది

Telangana Dec 3, 2021, 9:33 PM IST

SCCL trade unions to go on strike from December 9SCCL trade unions to go on strike from December 9

సింగరేణిలో సమ్మె సైరన్: కార్మిక సంఘాలతో నేడు అధికారుల చర్చలు

ప్రభుత్వ రంగ సంస్థలైన  Coal india, సింగరేణిలు స్వంత వనరులతోనే లాభాల బాటలో సాగుతున్నాయి. పన్నుల రూపంలో అయిదేళ్లలో సింగరేణి రాష్ట్రానికి రూ. 15,011 కోట్లు, కేంద్రానికి రూ. 17,690 కోట్లు కేంద్రానికి చెల్లించింది

Telangana Dec 3, 2021, 11:22 AM IST

madhu yashki goud counter to bjp congress coalitionmadhu yashki goud counter to bjp congress coalition

కాంగ్రెస్‌తో బీజేపీ పొత్తు .. అది ఎప్పటికీ జరగదు: టీఆర్ఎస్ వ్యాఖ్యలకు మధుయాష్కీ కౌంటర్

తెలంగాణ (telangana) రాష్ట్రంలో ఏ రోజు కూడా కాంగ్రెస్ (congress) -  బీజేపీ (bjp) ల మధ్య పొత్తు వుండదన్నారు టీ కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ (madhu yashki goud ). కొందరు పార్టీలో వుంటూనే టీఆర్ఎస్‌‌ను ఓడించాలనే క్షణికావేశంలో బీజేపీకి మద్ధతు తెలిపి వుండొచ్చని మధుయాష్కీ అభిప్రాయపడ్డారు. 

Telangana Nov 3, 2021, 5:17 PM IST

former CAG vinod rai tender apology to congress leader related to 2g scamformer CAG vinod rai tender apology to congress leader related to 2g scam

‘2జీ’ ఆరోపణలు వెనక్కి.. కాంగ్రెస్ నేతకు మాజీ కాగ్ వినోద్ రాయ్ క్షమాపణలు

2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు కలకలం రేపిన 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ కుంభకోణానికి సంబంధించి అప్పటి కాగ్ వినోద్ రాయ్ కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్‌కు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల స్కామ్‌పై కాగ్ రిపోర్టులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ పేరును చేర్చవద్దని తనపై అప్పటి కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ తీవ్ర ఒత్తిడి తెచ్చారని వినోద్ రాయ్ ఆరోపణలు చేశారు. తాజాగా, ఆ ఆరోపణలపై వినోద్ రాయ్ యూటర్న్ తీసుకున్నారు.

NATIONAL Oct 28, 2021, 5:36 PM IST

increased coal reserves in andhra pradeshincreased coal reserves in andhra pradesh

ఫలిస్తున్న ఏపీ సర్కార్ యత్నాలు.. పెరుగుతున్న బొగ్గు నిల్వలు, త్వరలోనే సంక్షోభానికి తెర

ఏపీలో బొగ్గు నిల్వలు ఇప్పుడు క్రమేణా పెరుగుతున్నాయి. కేంద్రంతో చర్చలు.. ఇతర ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా దాదాపు 22 ర్యాకుల బొగ్గు ప్రతిరోజూ రాష్ట్రానికి వస్తుండగా.. దీనికి మరికొంత నిల్వలు జత చేరుతుండటంతో రాష్ట్రంలో ప్రస్తుతానికి బొగ్గు కొరత తగ్గినట్టేనని ఏపీ జెన్‌కో (apgenco) అధికారులు చెబుతున్నారు. 

Andhra Pradesh Oct 27, 2021, 10:16 AM IST

andhra pradesh CM jagan mohan reddy reviews power situtionandhra pradesh CM jagan mohan reddy reviews power sitution

రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష.. ‘కొరత రాకూడదు’

దేశవ్యాప్తంగా బొగ్గు సంక్షోభంపై వాదనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నామని అధికారులు తెలిపారు. థర్మల్ కేంద్రాల దగ్గర బొగ్గు కొరత రాకుండా చూసుకోవాలని సీఎం ఆదేశించారు.

Andhra Pradesh Oct 18, 2021, 7:07 PM IST

Coal Shortage Hits 2 Power Units at RTPPCoal Shortage Hits 2 Power Units at RTPP

బొగ్గు కొరత: కడప ఆర్టీపీపీలో రెండు యూనిట్లలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తి

తమ రాష్ట్రంలోని థర్మల్ పవర్ స్టేషన్లకు రోజుకు 20 ర్యాక్స్ బొగ్గును సరఫరా చేయాలని కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఇటీవల కోరింది.  రాష్ట్రంలో 5010 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు కొరత కారణంగా 2,300 మెగావాట్ల నుండి 2500 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి జరుగుతుంది.

Andhra Pradesh Oct 15, 2021, 2:47 PM IST

Coal stocks in Telangana decline; SCCL under pressureCoal stocks in Telangana decline; SCCL under pressure

తెలంగాణ థర్మల్ పవర్ ప్లాంట్లలో తగ్గిన బొగ్గు నిల్వలు: కోల్ సరఫరాపై సింగరేణిపై తీవ్ర ఒత్తిడి

మహారాష్ట్రలోని థర్మల్ ప్లాంట్లకు పశ్చిమ ప్రాంతానికి చెందిన బొగ్గు క్షేత్రాల నుండి బొగ్గు సరఫరా  అవుతోంది. అయితే అక్కడ బొగ్గు నిల్వలు లేకపోవడంతో మహారాష్ట్రకు బొగ్గు సరఫరా కోసం సింగరేణిపై ఒత్తిడి పెరిగింది. 

Telangana Oct 13, 2021, 9:51 AM IST

ap electricity minister balineni srinivasa reddy sensational comments on coal shortageap electricity minister balineni srinivasa reddy sensational comments on coal shortage

విద్యుత్ సంక్షోభం.. తెలంగాణ రాష్ట్రం ఏపీకి బొగ్గును ఇవ్వడంలేదు: మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు

ఇంధన సంక్షోభంపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి (ap electricity minister) బాలినేని శ్రీనివాసరెడ్డి (balineni srinivasa reddy) స్పందించారు. బొగ్గు కొరత (coal shortage) దేశవ్యాప్తంగా ఉందని ఆయన వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు ఏదో ఒక స్థాయిలో విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయని, మన రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభం తాత్కాలికమేనని వివరించారు.

Andhra Pradesh Oct 12, 2021, 3:50 PM IST