Chigurupati Jayaram Murder Case
(Search results - 15)TelanganaJul 11, 2020, 12:09 PM IST
సీఐ శంకరయ్య కేసులో షాకింగ్ నిజాలు: చిగురుబాటి హత్య కేసులోనూ....
లక్షా 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన షాబాద్ సీఐ శంకరయ్య విషయంలో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. చిగురుబాటి హత్య కేసులో ఆయన పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
TelanganaOct 30, 2019, 12:39 PM IST
జయరాం హత్యకేసు: ఏసీపీకి, మరో ఇద్దరు సీఐలకు హైకోర్టు షాక్
ప్రముఖ వ్యాపారవేత్త జయరాం హత్య కేసులో ముగ్గురు పోలీస్ అధికారులకు తెలంగాణ హైకోర్టు బుధవారం నాడు షాకిచ్చింది.శాఖపరమైన విచారణను నిలిపివేయాలని కోరుతూ ఇబ్రహీంపట్నం మాజీ ఏసీపీ మల్లారెడ్డి, రాయదుర్గం సీఐ రాంబాబు, నల్లకుంట శ్రీనివాస్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
TelanganaMay 1, 2019, 10:28 AM IST
చిగురుపాటి జయరాం కేసు: శిఖాచౌదరికి ఊరట, పోలీసుల క్లీన్చిట్
ప్రముఖ పారిశ్రామిక వేత్త, కోస్టల్ బ్యాంక్ అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఆయన మేనకోడలు శిఖా చౌదరికి పెద్ద ఊరట లభించింది.
TelanganaApr 3, 2019, 9:16 AM IST
జయరాం కేసు: రాకేశ్‌కు సహకరించిన ముగ్గురు అధికారులపై వేటు
పారిశ్రామిక వేత్త, ఎన్నారై చిగురుపాటి జయరాం హత్య కేసులో నిందితులకు సహకరించిన ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది.
TelanganaFeb 26, 2019, 8:00 AM IST
జయరాం హత్య కేసులో ట్విస్ట్: తెరపైకి కొత్త వ్యక్తి
ప్రముఖ పారిశ్రామిక వేత్త, ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాం హత్య కేసు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. ఇప్పటికే జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని మిస్టరీని ఛేదించామని అనుకునేలోపు రోజుకొక మలుపు తిరుగుతోంది
TelanganaFeb 20, 2019, 10:26 AM IST
జయరాం హత్య కేసు: ఆ ఐదుగురు పోలీసుల పాత్రపై విచారణ
పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. జయరాంను హత్య చేసిన ప్రధాన నిందితుడు రాకేశ్ రెడ్డికి సహకరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కోంటున్న ఐదుగురు పోలీస్ అధికారులను బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించనున్నారు.
TelanganaFeb 19, 2019, 7:46 AM IST
జయరాం హత్య కేసు: నందిగామకు రాకేశ్ రెడ్డి
కోస్టల్ బ్యాంక్ అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసులో బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా క్రైమ్ సీన్ రీకన్సట్రక్షన్ చేయడానికి రాకేశ్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి నందిగామకు తీసుకెళ్లారు.
TelanganaFeb 18, 2019, 10:17 AM IST
జయరాం హత్య కేసు: రాకేశ్‌ను ఇరికించిన ఆ ‘‘హాబీ’’
కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడైన రాకేశ్ రెడ్డిని అతని హాబీ మరిన్ని కష్టాలపాలు చేస్తోంది.
TelanganaFeb 14, 2019, 8:04 PM IST
ప్రెస్ మీట్ పెడతా..అందరి ప్రశ్నలకు సమాధానం చెబుతా: శిఖా చౌదరి
చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులకు సహకరిస్తానని తెలిపారు ఆయన మేనకోడలు శిఖా చౌదరి. పోలీసుల విచారణ ముగిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లు తెలిపారు
TelanganaFeb 14, 2019, 7:49 PM IST
అమ్మాయి కోసం రాకేశ్ ఇంటికి జయరాం.. జూనియర్ ఆర్టిస్ట్ కీలకపాత్ర
పారిశ్రామిక వేత్త జయరాం హత్య కేసులో అనుహ్య మలుపు తిరిగింది. ఆయన హత్య కేసులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ సూర్య కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. గత నెల 29 సాయంత్రం జయరాంకు ఫోన్ చేసిన సూర్య.. మంచి అమ్మాయి ఉందని ఆయనతో చెప్పినట్లుగా సమాచారం.
TelanganaFeb 14, 2019, 6:20 PM IST
అమ్మాయిలను పంపుతాననేవాడు: రాకేశ్‌రెడ్డి బాధితుడి ఫిర్యాదు
కోస్టల్ బ్యాంక్ అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసు విచారణలో రాకేశ్ రెడ్డి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు బయటపడుతున్నాయి. తీగ లాగితే డొంక కదిలినట్టు జయరాం హత్యతో గతంలో రాకేశ్ వల్ల నష్టపోయిన బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు.
TelanganaFeb 12, 2019, 8:04 AM IST
జయరాం హత్య కేసు: ఈ రోజు జూబ్లీహిల్స్ పీఎస్‌కు శిఖా చౌదరి
కోస్టల్ బ్యాంక్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి జయరామ్ చౌదరి హత్య కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు వేగం పెంచారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరామ్ మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు ఇవాళ విచారించనున్నారు.
TelanganaFeb 11, 2019, 8:58 PM IST
హైదరాబాద్ కు జయరాం హత్యకేసు నిందితులు...
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్‌ప్రెస్ టీవి అధినేత చిగురుపాటి జయరాం హత్య కేసు పలు మలుపులు తిరిగి హైదరాబాద్ పోలీసుల చెంతకు చేరింది. ఏపి పోలీసులు ఈ కేసు విచారణను కొద్దిరోజుల క్రితమే తెలంగాణ పోలీసులకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. కానీ వివిధ కారణాల వల్ల ఈ కేసులో ప్రధాన నిందితులను మాత్రం ఇప్పటివరకు అప్పంగించకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. అయితే తాజాగా ఈ హత్యకేసులో నిందితులు రాకేష్ రెడ్డి, శ్రీనివాస్ లను తెలంగాణ పోలీసులు నందిగామ నుండి పిటి వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకువచ్చారు.
TelanganaFeb 8, 2019, 10:15 AM IST
జయరాం కేసు: విచారణ ప్రారంభించిన తెలంగాణ పోలీసులు, శిఖాకు నోటీసులు..?
కోస్టల్ బ్యాంక్ అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త చిగురురాటి జయరామ్ చౌదరి హత్య కేసులో తెలంగాణ పోలీసులు విచారణ ప్రారంభించారు. ఏపీ పోలీసుల దర్యాప్తు వల్ల నిందితులకు శిక్ష పడదని కేసును విచారించాల్సిందిగా జయరామ్ సతీమణి పద్మశ్రీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. ఏపీ పోలీసులు కేసును తెలంగాణకు బదిలీ చేశారు.
Andhra PradeshFeb 4, 2019, 9:41 AM IST
జయరాం హత్య కేసు: పోలీసుల అదుపులో రాకేశ్ స్నేహితులు
కోస్టల్ బ్యాంక్ అధినేత, ఎక్స్‌ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం చౌదరి హత్య కేసులో చిక్కుముడులు వీడటం లేదు. జయరాంను చంపింది రాకేశ్ రెడ్డే అని పోలీసులు నిర్ధారణకు వచ్చినప్పటికీ.. ఆదివారం శిఖా చౌదరి మీడియాతో మాట్లాడిన తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి.