Central Government  

(Search results - 37)
 • kcr

  Telangana5, Jul 2019, 6:28 PM IST

  ఎర్రమంజిల్ కూల్చివేతపై కేంద్రం ఆగ్రహం: కేసీఆర్ సర్కార్ కు అక్షింతలు

  ఫిర్యాదులను పరిశీలించిన కేంద్రం సాంస్కృతిక శాఖ రాష్ట్ర పురావస్తు శాఖపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎర్రమంజిల్ పై రాద్ధాంతం జరుగుతున్నా తమకు సంబంధం లేదన్నట్లుగా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ పురావస్తు శాఖ అధికారులకు అక్షింతలు వేసింది.  ఇకనైనాప్రేక్షక పాత్రకు స్వస్తి పలికి పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. 

 • Rajashekar
  Video Icon

  Telangana15, May 2019, 2:39 PM IST

  మిషన్ భగీరథ పనులను పరిశీలించిన కేంద్ర బృందం(వీడియో)

  వివిధ రాష్ట్రాల్లోని తాగునీటి పథకాల పనితీరును పరిశీలించేందుకు కేంద్ర తాగునీటి విభాగం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర తాగునీటి విభాగం డిప్యూటీ సలహాదారు రాజశేఖర్ , మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వెళ్లారు. నాగసాల లో నిర్మించిన నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. నీటి శుద్ధి ప్రక్రియను చూసారు. అక్కడి నుంచి కేతిరెడ్డి పల్లె , నందారం గ్రామాల్లో, భగీరథ నీటి సరఫరా పై గ్రామస్తుల అభిప్రాయం తెలుసుకున్నారు. నీటి నాణ్యత, సరఫరా సమయం గురించి అడిగారు. భగీరథ నీళ్లు వచ్చినప్పటి నుంచి తమకు కష్టాలు తీరినాయని గ్రామస్తులు చెప్పారు. భగీరథ నీళ్లు బాగున్నాయన్న గ్రామస్తులు, తాము అవే నీటిని తాగుతున్నామని చెప్పారు.

 • NATIONAL21, Apr 2019, 10:44 AM IST

  కేంద్రంలో మళ్లీ మాదే అధికారం: రాంమాధవ్

  కేంద్రంలో  మరోసారి మోడీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆ పార్టీ నేత రాం మాధవ్ అభిప్రాయపడ్డారు. విపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా కూడ తమ పార్టీ అధికారంలోకి రాకుండా అడ్డుకోలేరని ఆయన చెప్పారు.

 • bb patil

  Telangana12, Feb 2019, 4:14 PM IST

  శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలి: టీఆర్ఎస్ ఎంపీ డిమాండ్

  అనారోగ్యంతో ఇటీవలే తుదిశ్వాస విడిచిన శ్రీసిద్దగంగ మఠాధిపతి  శివకుమార స్వామికి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ఆద్యాత్మిక గురువు, సామాజిక సేవకులైన శివకుమారస్వామి భారతరత్న ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తరువాత చాలా మంది రాజకీయ నాయకులు, ఆద్యాత్మికవేత్తలు కూడా కుమార స్వామి ప్రతిపాదనకు మద్దతు పలికారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ ఎంపీ ఏకంగా లోక్ సభలో ఈ అంశంపై ప్రసంగించారు. 

 • vandemataram express

  business12, Feb 2019, 3:26 PM IST

  ప్రయాణికులను బెంబేలెత్తిస్తున్న వందేమాతరం ఎక్స్‌ప్రెస్ రైలు...ప్రారంభానికి ముందే

  ప్రధానమంత్రి నరేంద్రమోదీ చొరవతో ప్రారంభమైన మేకిన్ ఇండియాలో భాగంగా రూపుదిద్దుకుని ఈ నెల 15న పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణికులకు చుక్కలు చూపనున్నది. ఎనిమిది గంటల్లో ఢిల్లీ నుంచి వారణాసి చేరుకునే ఈ రైలు టిక్కెట్ ధరలు చుక్కలనంటుతున్నాయి. అలాగే భోజనాది తదితర వసతుల ధరలు అలాగే ఉన్నాయి. 

 • MODI reservation

  NATIONAL7, Jan 2019, 9:29 PM IST

  బిజెపి రాజకీయ ఎత్తుగడ: అగ్రకుల పేదలకు రిజర్వేషన్లు

  త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. అగ్రకులాల్లోని పేదలకు కూడా రిజర్వేషన్లు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇలా ఆదాయ పరిమితితో కూడిన రిజర్వేషన్లు ప్రకటించిన మోదీ సర్కార్ భారీ ఎత్తుగడలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

 • Siricilla _KTR

  Telangana5, Jan 2019, 4:30 PM IST

  ఆ ఒక్కటి కూడా రానివ్వం: కేంద్రంపై కేటీఆర్ మండిపాటు

  కేంద్రప్రభుత్వంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతోపాటు వివిధ ప్రాజెక్టులకు కేంద్రప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుతున్నాయని తెలిపారు. మిషన్ భగీరథ వంటి కార్యక్రమం ఎంతో మంచి కార్యక్రమమని ఆ పథకం దేశం అంతా అనుసరించాల్సిన పథకం అని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ లో ప్రసంశించినట్లు కేటీఆర్ గుర్తు చేశారు. 

 • Telangana4, Jan 2019, 2:28 PM IST

  మిషన్ కాకతీయకు మరో అరుదైన గౌరవం...

  తెలంగాణ ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పథకం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది. తెలంగాణలో వ్యవసాయానికి సాగునీరు అందించడంలో ముఖ్య వనరుగా వున్నచెరువులను పునరుద్దరించడమే లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని చేపట్టింది. అన్నదాతల కోసం జరుగుతున్న ఈ బృహత్తర పథకం ఇప్పటికే అనేక అవార్డులను కైవసం చేసుకోగా తాజాగా మరోసారి కేంద్ర ప్రభుత్వ అవార్డుకు ఎంపికయ్యింది.

 • Govt Jobs2, Jan 2019, 3:10 PM IST

  యువతకు ప్రధాని నూతన సంవత్సర కానుక: స్వయంగా ప్రకటించిన రైల్వే మంత్రి

  దేశంలోని నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన భారతీయ రైల్వేలో భారీ సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. వివిధ ఉద్యోగ నియామకాలకు సంబంధించి రైల్వే రిక్రూట్ మెంట్ బోర్డు ఇప్పటికే నోటిపికేషన్ జారీ చేసి...అర్హతగల అభ్యర్థులకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోడానికి అవకాశం కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  

 • chandrababu naidu

  Andhra Pradesh28, Dec 2018, 2:29 PM IST

  కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తోంది.. చంద్రబాబు ఫైర్

  రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామంటే కేంద్రం సహకరించ లేదని, ఇప్పుడు కేంద్రం రుణమాఫీ అంటే ఎన్నికల స్టంటే అని వ్యాఖ్యానించారు.

 • tdp bjp

  Andhra Pradesh27, Dec 2018, 8:06 PM IST

  కడప ఉక్కు పరిశ్రమపై కేంద్రం సంచలన ప్రకటన

  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  కడప ఉక్కు ప్యాక్టరీ నిర్మాణానికి ఇవాళ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. దీని ద్వారా విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం విస్మరించినా... తాము ముందుకు తీసుకెళుతున్నామనే సంకేతాలను చంద్రబాబు ఏపి ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చంద్రబాబు భావించారు. అయితే ఆయన ఆలోచనను గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఏపి ప్రభుత్వాన్నే ఇరకాటంలో పెడుతూ కడప ఉక్కు ప్యాక్టరీపై సంచలన ప్రకటన చేసింది.

 • kavitha

  Telangana21, Dec 2018, 5:12 PM IST

  కేసీఆర్ కలల ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి : కవిత

  తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ అవుటర్ రింగ్ రోడ్డు ఓ మణిహారంలా నిలిచి ట్రాపిక్ కష్టాలను తీరుస్తున్న విషయం తెలిసిందే. అయితే దానికి ఆవల రీజనల్ రింగ్ రోడ్డు పేరుతో శివారు పట్టణాలను కలుపుతూ మరో బారీ ప్రాజెక్టును చేపట్టాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు ఫలించి హైదరాబాద్ చుట్టూ నాలుగు వరుసల రీజినల్ రింగ్ రోడ్డును నిర్మించేందుకు సూత్రప్రాయంగా అంగీకారం లభించింది.